Movies

డెకాయిట్ రూపమతి

డెకాయిట్ రూపమతి

బాలీవుడ్ చిత్రసీమలో సంజయ్‌ లీలా భన్సాలీకి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. అదే విధంగా కథానాయికగా దీపికా పదుకొణె సైతం తను ఎంచుకొనే పాత్రల్లో వైవిధ్యతను కనబరుస్తుంది. ప్రస్తుతం సంజయ్‌ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా చిత్రం తెరకెక్కతుంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాని తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో డెకాయిట్ రూపమతి అనే పాత్రని నటి దీపికా పదుకొణె పోషించనుందట. ఈ పాత్ర కోసం ఇప్పటికే సంజయ్‌ – దీపికాతో కలిసి పలుమార్లు చర్చలు కూడా జరిపారట. ఇంకా కొన్ని విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయట. చిత్రానికి సంబంధించి స్క్రిప్టు కూడా ఇంకా పూర్తి కాలేదట. 2022 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.