Movies

ఆదిత్య 369 సీక్వెల్‌లో తండ్రీ తనయులు

ఆదిత్య 369 సీక్వెల్‌లో తండ్రీ తనయులు

బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన వారసుడు మోక్షజ్ఞ సినిమా తెరంగేట్రంపై స్పష్టత ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన, తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని తెరకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ సినిమాకు తానే కథ రాయడంతో పాటు దర్శకత్వం వహిస్తానని చెప్పడం విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.