Politics

మరో ఉద్యమానికి చంద్రబాబు ప్లాన్

మరో ఉద్యమానికి చంద్రబాబు ప్లాన్

ఆస్తి పన్ను పెంపుపై ఉద్యమిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

10 డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నెల 16 నుంచి 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యచరణ రూపొందించారు.

ఆస్తి పన్నుపై రేపు, ఎల్లుండి అఖిలపక్ష నిరసనలకు సంఫీుభావం తెలపనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

ఈ నెల 16న తహసీల్దార్‌ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు ఇస్తామన్నారు.

ఈ నెల 18న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో విజ్ఞాపనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 20న కలెక్టర్‌ కార్యాలయాల్లో విజ్ఞాపనలు ఇస్తామన్నారు.

ఈ నెల 22న అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపడతామని చంద్రబాబు అన్నారు.