Business

సోలార్‌లోకి ముకేష్ ప్రవేశం-వాణిజ్యం

సోలార్‌లోకి ముకేష్ ప్రవేశం-వాణిజ్యం

* దేశ భద్రత నెపంతో సొంత దేశ కార్పొరేట్‌ కంపెనీలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా సైబర్‌ భద్రత పేరిట సంస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు కొత్త నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో నమోదవుతున్న కంపెనీలను షీ జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ మేరకు మంగళవారం భేటీ అయిన చైనా కేబినెట్‌.. బడా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. లిస్టింగ్‌ పేరిట కీలక సమాచారాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.

* రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 44వ ఎజీఎం సమావేశంలో 10 బిలియన్‌ డాలర్లను పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుంగా ఎజీఎం సమావేశంలో 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. కాగా ముఖేష్‌ అంబానీ గ్రీన్‌ఎనర్జీలోకి ఏంట్రీతో అదానీ సోలార్‌ కంపెనీలకు తలనొప్పిగా మారనుంది. ముఖేష్‌ రాకతో ప్రస్తుతం ఉన్న సోలార్‌ విద్యుత్‌ ఛార్జీలు పూర్తిగా తగ్గిపోతాయని వ్యాపార నిపుణులు భావిస్తోన్నారు.

* టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందం సిద్ధమవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎమ్‌బిఎల్), పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (గోపిచంద్ అకాడమీ) సంయుక్తంగా ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే మహిళా అథ్లెట్లలో స్పూర్తిని నింపడమే ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశ్యం.

* మ‌రో టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు పెంట‌గాన్ ప్ర‌క‌టించింది. ఈ వార్త వెలుగు చూడ‌టంతోనే అమెజాన్ షేర్ల‌కు రెక్క‌లొచ్చాయి. ఫ‌లితంగా జెఫ్ బెజోస్ వ్య‌క్తిగ‌త నిక‌ర సంప‌ద 8.4 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగింద‌ని బ్లూంబ‌ర్గ్ బిలియ‌నీర్ ఇండెక్స్ తెలిపింది.