Movies

నేను రాలేనన్న రకూల్…అయినా రప్పించిన ఈడీ-నేరవార్తలు

నేను రాలేనన్న రకూల్…అయినా రప్పించిన ఈడీ-నేరవార్తలు

* నకిలీ చలానాల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో మిగతా శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు.చలానాల ద్వారా చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై విచారణ.ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం.ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ₹8.13 కోట్ల మేర అవకతవకలు .₹4.62 కోట్ల మేర రికవరీ .14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్.

* వివాహేతర సంబంధం మూడు నిండుప్రాణాలను బలిగొంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య (32), కృష్ణవేణి (27) భార్యాభర్తలు. అదే కాలనీలో నివసించే పచ్చినీళ్ల ధర్మయ్య (30), కృష్ణవేణిల మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఆగస్టు 26న వారిద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోగా, బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. అదే కాలనీకి చెందిన వజ్రమ్మ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారం తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఏసీపీ వెంకటేశ్‌, సీఐ కరుణాకర్‌, ఎస్సై నాగరాజు వెళ్లి విచారణ ప్రారంభించారు. దుస్తుల ఆధారంగా మృతదేహాలు ధర్మయ్య, కృష్ణవేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌కుమార్‌ (10), వెంకటలక్ష్మి (7) అనాథలయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

* రోలుగుంట మండల సమీపంలో భోగాపురం వద్ద చోటు చేసుకున్న ఘటన..మానవత్వం లేని మనుషులు ముక్కు పచ్చలారని పసికందుని పోదలలో పారేశారు..విషయం తెలిసి రోలుగుంట సబ్ ఇన్స్పెక్టర్ నాగకార్తీక్ తన సిబ్బందితో వెళ్లి స్వయాన తన చేతులుతో పసికందుని ఎత్తుకొని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

* ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌.తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు.విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు.ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్‌ ఉండటంచేత తాను హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు.అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.

* మంగళగిరి పట్టణం గండాలయ పేటలో రాత్రి ఘర్షణ.ఘర్షణలో ఒక వ్యక్తిపై బ్లేడ్ తో దాడికి పాల్పడిన సహాచరులు.ఈ ఘటనలో సుమారు ఐదుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం.గాయపడిన వ్యక్తి ఎన్నారై ఆసుపత్రికి తరలింపు. మిగిలిన వారందరిని రాత్రే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పట్టణ పోలీసులు.చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ సిఐ అంకమ్మరావు తనదైన శైలిలో హెచ్చరించారు.పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.