Sports

మిస్బా-ఉల్-హక్ వకార్ యూనిస్‌లు రాజీనామా

మిస్బా-ఉల్-హక్ వకార్ యూనిస్‌లు రాజీనామా

త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. హెడ్‌ కోచ్‌ మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్‌ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్‌ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్‌ క్రికెట్‌లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జ‌రగబోయే సిరీస్‌ల‌కు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా స‌క్లెయిన్ ముస్తాక్‌, అబ్దుల్ రజాక్‌ల‌ను నియ‌మించిన‌ట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్ర‌క‌టించింది.