DailyDose

సజ్జనార్‌కు సమన్లు-నేరవార్తలు

సజ్జనార్‌కు సమన్లు-నేరవార్తలు

* దిశ కమిషన్ విచారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరు కానున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉంది. కాగా సోమవారం త్రిసభ్య కమిటీ ముందు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హాజరుకానుంది. సజ్జనార్‌ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌‌ను విచారించనుంది.

* కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ నందు 1.షేక్ నూర్ భాషా 2. ఖాజా 3.N.ఖాసీం, .ముగ్గురు గుంతకల్ టౌన్ , అనంతపూర్ (జిల్లా) . ముగ్గురు వ్యక్తులు నకిలీ కరెన్సీ ని ఎలా తయారీ చేయాలో యు ట్యూబు లో చూసి , నేర్చుకొని దానికి అవసరమైన స్కానర్ తో పాటు వుండె ప్రింటర్ మరియు పేపర్ ను గుంతకల్ టౌన్ లో షాప్ లలో కొనుక్కొని సదరు ప్రింటర్ తో ఒరిజినల్ వంద రూపాయల నోట్స్ ను జిరాక్స్ చేసి వాటిని మామూలు వంద రూపాయల నోట్లుగా కట్ చేసి వాటిని గుంతకల్ పరిసర ప్రాంతాలలో మరియు జొన్నగిరి పరిసర ప్రాంతాలలో కిరాణా మరియు చికెన్ షాప్ లలో సదరు జిరాక్స్ వంద రూపాయలను మార్పిడి చేస్తూ ఉన్నారు ముగ్గురు వ్యక్తులు జొన్నగిరి బస్ స్టాప్ వద్ద ఉండగా వారిని రాబడిన సమాచారము మేరకు పత్తికొండ రూరల్ సి‌ఐ రామకృష్ణారెడ్డి జొన్నగిరి ఎస్‌ఐ రామాంజనేయులు మరియు వారి సిబ్బంది సహాయముతో వారిని పట్టుకొని వారి వద్ద నుండి 27 నకిలీ 100 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించిన ప్రింటర్ మరియు ఇతర సామగ్రి ని స్వాధీనం చేసుకుని ముద్దయీలను అరెస్టు చేసి రీమాండ్ కు పంపించినట్లు. సి ఐ .మీడియాకు తెలిపారు

* తాడేపల్లి వారధి పై నుంచి దూకి అట్లూరి వెంకట సంతోష్ అనే యువకుడు ఆత్మహత్య ప్రయత్నం.

* బిహార్‌లోని పట్నా నగరంలో ఓ గర్భిణిపై దారుణం చోటుచేసుకుంది. వాకింగ్‌కు వెళ్లిన ఆమెపై ముగ్గురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయిన గర్భిణి పట్ల కనీస కనికరం కూడా చూపకుండా నిర్దయగా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24ఏళ్ల మహిళ శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో వాకింగ్‌కు వెళ్లింది. ఆమెను అనుసరించిన ఇద్దరు యువకులు గర్భిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె నోటిని గట్టిగా మూసేసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం మరో వ్యక్తిని పిలిచి ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోవడంతో మహిళను రైల్వే ట్రాక్‌ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు స్పృహ వచ్చింది. గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను మహిళా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులైన విశాల్‌, అంకిత్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

* శంషాబాద్‌ విమనాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. రూ.34.24 లక్షల విలువైన 763.66గ్రా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్‌ నుంచి వచ్చిన వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్‌ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.