Editorials

విజయవాడను జల్లెడ పడుతున్న NIA

విజయవాడను జల్లెడ పడుతున్న NIA

ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సోదాల్లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు కీలక పత్రాలు, సామగ్రి సీజ్‌ చేశారు. ఇటీవల ముంద్రాపోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. హెరాయిన్‌ పట్టివేత కేసును రెండ్రోజుల క్రితం ఎన్‌ఐఏ స్వీకరించింది. ఎన్‌డీపీఎస్‌, చట్టవ్యతిరేక చర్యల కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్‌ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులను వెంటబెట్టుకుని 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నిందితులుగా ఉన్న మాచవరం సుధాకర్‌, గోవిందరాజు, రాజ్‌కుమార్‌లకు సంబంధించిన 3 నగరాల్లోని పలు ప్రదేశాల్లో సోదాలు జరిపినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.