Devotional

నేటి రాశి ఫలితాలు 27-Nov-2021

నేటి రాశి ఫలితాలు 27-Nov-2021

?️హిందూ ధర్మం?
? శుభోదయం ?
✍? 27.11.2021 ✍?
? నేటి రాశిఫలాలు ?

? మేషం
ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలగుతాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.
???????

? వృషభం
ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీ స్తుతి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
???????

? మిధునం
ఈరోజు
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.
???????

? కర్కాటకం
ఈరోజు
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
???????

? సింహం
ఈరోజు
చిరస్మరణీయ విజయాలు సొంతమవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యాన శ్లోకం చదవండి.
???????

? కన్య
ఈరోజు
మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.
???????

⚖ తుల
ఈరోజు
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

? వృశ్చికం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మేలు చేకూరుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
???????

? ధనుస్సు
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. చంద్ర ధ్యానం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
???????

? మకరం
ఈరోజు
ప్రారంభించే పనులలో పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
???????

? కుంభం
ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
???????

? మీనం
ఈరోజు
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామ నామం జపించడం ఉత్తమం.
???????