NRI-NRT

“తానా-కళాశాల” గురువులకు సత్కారం

“తానా-కళాశాల” గురువులకు సత్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ సహకారంతో సంయుక్తంగా ‘తానా-కళాశాల’ పేరిట కూచిపూడి, భరతనాట్యం, సంగీత కోర్సుల్లో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. “తానా-కళాశాల” గురువులను మంగళవారం నాడు ఫ్రిస్కోలోని శుభం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. డాలస్ తానా ప్రాంతీయ ప్రతినిధి కొమ్మన సతీష్ స్వాగతోపన్యాసం చేశారు. శ్రీపద సమీర ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తానా-కళాశాల కార్యక్రమ అధ్యక్షుడు డా.అడుసుమిల్లి రాజేష్, ఉపాధ్యక్షురాలు నాగభైరవ మాలతీలు కళాశాల కార్యక్రమంపై ప్రసంగించారు. 400మందికి పైగా ప్రవాస విద్యార్థులు ఈ శిక్షణా తరగతుల ద్వారా లబ్ధి పొందుతున్నారని , ప్రతిష్ఠాత్మక పద్మావతి విశ్వవిద్యాలయ సర్టిఫికేట్లు అందుకుంటున్నారని వారు వెల్లడించారు. తానా ప్రస్తుత-పూర్వ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.

తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ కళాశాల కార్యక్రమ ఏర్పాటును గుర్తు చేసుకున్నారు. ఈ శిక్షణా తరగతులని అమెరికా అంతటా విస్తృతం చేసే దిశగా కృషి చేయాలని కోరారు. మరో మాజీ అధ్యక్షుడు డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట మాట్లాడుతూ భారతీయ కళలు తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే దిశగా తానా పని చేయాలనే తన ఆకాంక్ష ఈ విధంగా సాకారం అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షల పర్యవేక్షణాధికారిగా ఇండియా నుండి విచ్చేసిన ప్రొఫెసర్ డా. హిమబిందు ఉప్పరి తానా కళాశాలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. తమ సమయాన్ని ప్రవాసులు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న తీరు చూస్తే ఆనందం కలుగుతోందన్నారు. అనంతరం జ్ఞాపిక బహూకరించి సత్కరించారు.

గురువులు పద్మ శొంఠి, డా. సుధా కలవగుంట, శ్రీలత సూరి, కల్యాణి ఆవుల, హేమ చావలి, సమీర శ్రీపాద లను ఈ కార్యక్రమంలో తానా-డాలస్ ప్రతినిధి బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, తానా ప్రతినిధులు మురళి వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, సాంబ దొడ్డ, నాగరాజు నలజుల, వెంకట్ ములుకుట్ల, లెనిన్ తుళ్లూరి, రాజా నల్లూరి, ప్రవీణ్ కొడాలి, రాజేష్ పోలవరపు, విజయ్ వల్లూరు, వెంకట్ తొట్టెంపూడి, చంద్ర రెడ్డి పోలీస్, దీప్తి సూర్యదేవర, మధుమతి వైశ్యరాజు, శ్రీదేవి ఘట్టమనేని, అరవింద జోస్యుల తదితరులు పాల్గొన్నారు. యామిని సూరపనేని, మండువ సురేష్, A2B, Peacock-Coppell తదితరులు వేడుక విజయవంతానికి తోడ్పడ్డారు.