Devotional

యాదాద్రికి రూ.50 లక్షల విరాళం – TNI ఆధ్యాత్మికం

యాదాద్రికి రూ.50 లక్షల విరాళం – TNI ఆధ్యాత్మికం

1. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తితిదే వర్గాలు వెల్లడించాయి. భక్తులు సమర్పించిన కానుకల వల్ల టీటీడీకి రూ 2.52 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపాయి.

2. తిరుమలలో ప్రణయకలహోత్సవం
శ్రీవేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహోత్సవం మంగళవారం తిరుమలలో జరిగింది. ఈ ఉత్సవ సందర్భంగా సాయంత్రం 4 గంటల తర్వాత శ్రీవారు, అమ్మవార్ల ఉత్సమూర్తులు బంగారు పల్లకీలపై వేర్వేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగారు. అక్కడ ప్రణయకలహోత్సవం నిర్వహించారు. కాగా అధ్యయనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీవారికి సోమవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

3. భక్తజన సంద్రంగామారిన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో కొద్ది వారాలుగా భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మందికి పైగా భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారాయి. భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

4. యాదాద్రి పునఃప్రారంభానికి ఏర్పాట్లు : మంత్రి
యాదాద్రిలో లక్ష్మీ నరసింహ ఆలయ పునః ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. మార్చి నెలలో యాదాద్రి ఆలయం ప్రారంభం కానున్న ట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆ లయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారన్నారు. లెక్కలేనన్నీ నిధులు మం జూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు వేములవాడ రాజరాజేశ్వరాలయం, కాళేశ్వరం ము క్తేశ్వరాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని వివరించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామని అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భగవత్‌ సంకల్పంతో దం పతి సన్మానం నిర్వహించామని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవ తప్ప మరో ధ్యాస తనకు లేదని, రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్‌తో కలిసి నడవడమే కర్తవ్యమని అన్నారు. కనుమ పండుగ సందర్భంగా 108 మంది బ్రహ్మణ దంపతులకు పాదపూజ చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

5. తొడసం వంశీయుల ప్రత్యేక పూజలతో ఖాందేవ్‌ జాతర ప్రారంభం
నార్నూర్‌ మండల కేంద్రంలో గల ఖాందేవ్‌ ఆల యం వద్ద తొడసం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన పూజలతో నార్నూర్‌ జాతర ప్రారంభమైంది. తొడసం వంశీయుల ఆరాధ్య దైవం ఖాం దేవ్‌ ఆలయం వద్ద ఆదివాసీలతో కోలాహలంగా మారింది. చిత్తగూడకు చెందిన తొడసం వంశీయులు ఆదివారం మాన్కాపూర్‌ మర్రి చెట్టువద్దకు చేరుకొని సోమవారం ఆదివాసీ సంప్రదాయాలతో ఖాందేవ్‌ ఆలయానికి చేరుకున్నారు. పుష్యమి, పౌర్ణమి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి పూజ లు నిర్వహించడానికి ఆదివాసీలు సంప్రదాయ పూజలను ఖాందేవ్‌ ఆల యం వద్ద ప్రారంభించారు. చిత్తగూడ నుంచి తొడసం వంశీయులు ఖాం దేవ్‌ ప్రతిమలను తెచ్చారు. తొడసం వంశీయులు అయిన తెలంగ్‌రావు, రాజు, లచ్చు పటేల్‌, గోపాల్‌, సీతారాం, యాదవ్‌, భీంరావు, తొడసం నాగోరావుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖాందేవ్‌ ఆల యం వద్ద కరోన నిబంధలనకు అనుగుణంగా ఈనెల 30వరకు జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం రూప్‌దేవ్‌ తెలిపారు. మంగళవారం జంగుబాయి, సోనేరావు దంపతుల కూతురు చిత్తగూడకు చెందిన తొడసం వంశీయుల ఆడపడుచు యేత్మాబాయి నూనే తాగి మొక్కు చెల్లిస్తుందని తెలిపారు. కాగా, మంగళవారం నూనే తాగే కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం, వ్యాపారుల కోసం ఏర్పాట్లు చేశామని సర్పంచ్‌ గజానంద్‌నాయక్‌ తెలిపారు.

6. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి హైదరాబాద్ కార్వాన్కు చెందిన బండారి విద్యాసంస్థల అధినేత , భాజపా నాయకుడు బండారి శ్రీనివాస్ , ఆయన సోదరులు , కుటుంబసభ్యులు రూ .50 లక్షల విరాళం ప్రకటించారు . ఈ మేరకు సోమవారం యాదాద్రిలో శ్రీనివాస్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కార్యనిర్వాహణ అధికారి ( ఈవో ) గీతారెడ్డికి రూ .30 లక్షల డీడీ అందజేశారు.

7. చరిత్రలో ఈ రోజు జనవరి 18
గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 18వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 347 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 348 రోజులు).
1896 – –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
**జననాలు
1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)
1950: అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,
1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
మరణాలు
1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)
2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)

8. తిరుమల శ్రీవారికి తలలీలాలు సమర్పించాలను కోనే భక్తులు కళ్యాణ కట్ట వివరాలు ?
1)ప్రధాన కళ్యాణకట్ట
(అన్నదానం కాంప్లెక్స్ ఎదురుగా)
24 గంటలు
2)కళ్యాణ కట్ట 2
(మెయిన్ కల్యాణకట్ట దగ్గర)
24 గంటలు
3)రాంబగీచా గెస్ట్ హౌస్
(ప్రధాన దేవాలయం దగ్గర) ఉదయం 6 – సాయంత్రం 6 గం
4 )శ్రీ వేంకటేశ్వర అతిథి గృహం 6 ఉదయం – 6 సాయంత్రం
5) పద్మావతి అతిథి గృహం 6 ఉదయం – సాయంత్రం 6 గం
6) యాత్రక సదన్ కాంప్లెక్స్ I
(తిరుమల బస్టాండ్ ఎదురుగా) ఉదయం 6 – రాత్రి 9 గంటల
7) హిల్ వ్యూ కల్యాణకట6 ఉదయం – 6 సాయంత్రం
8) M.B.C కళ్యాణకట్ట6 ఉదయం – 6 సాయంత్రం 6
9)వరాహస్వామి I కళ్యాణకట్ట.
వరాహస్వామి అతిథి గృహం 6 am – 9 pm
10) NGGH కల్యాణకట్ట 6 am – 6 pm
11)పాంచజన్యం కల్యాణకట్ట 6 am – 6 pm
12) కౌస్ధుబం గెస్ట్ హౌస్
కల్యాణకట్ట 6 am – 6 pm
13)SMC కళ్యాణకట్ట 6 am – 6 pm
14)TBC కళ్యాణకట్ట 6 am – 6 pm
15)PAC II కళ్యాణకట్ట
(తిరుమల బస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం 6 – రాత్రి 9 గం
ఈ కాంప్లెక్స్ లో స్వామివారికి తలలీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొండి.