DailyDose

TNI తాజా వార్తలు – 26/01/2022

TNI తాజా వార్తలు – 26/01/2022

ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.
అమర వీరులకు మోదీ నివాళులు

*గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు.ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు.గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు.ఇండియా గేటు వద్ద ప్రధాని నరేంద్రమోదీ నేతాజీ డిజిటల్ విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్ వేడుకలను ప్రారంభించారు.దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్ పై చెక్కారు.

*కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కానున్నారు. బొండా ఉమ తనయుడు బొండా సిద్ధార్థ్, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు. అమెరికాలో కలిసి చదువుకున్న సిద్ధార్థ్, జస్విత ఇద్దరూ ప్రస్తుతం టీడీపీ తరఫున చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు.

*ట్రెజరీ అధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లతో ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రెజరీ ఉద్యోగుల వేతన బిల్లులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు ఆర్థికశాఖ అధికారుల నుంచి ఒత్తిడి ఉందంటూ… వీడియో కాన్ఫరెన్స్లో ట్రెజరీ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం10.30 గంటలకు బిల్లులు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సబ్ట్రెజరీ అధికారులు తాము బిల్లులు పంపలేమని చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్రెజరీ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతల దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులు పంపొద్దని చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్లు సమాచారం.

*పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని వ్యసనా రహితంగా మార్చేందుకు డ్రగ్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పంజాబ్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తామని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేని పంజాబ్ కోసం డ్రగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ తెలిపారు.

* రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసేందుకు ఏఎస్ఈబీ అధికారులు ఆరాట పడుతున్నారని జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ స్టేట్ కోఆర్డినేటర్ లోకేష్ ఆరోపించారు. జగ్గయ్యపేట మండల పరిధిలో పట్టుకున్న ఇసుక లారీలపై లోకేష్ స్పందించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బలుసుపాడు తక్కెళ్ళపాడు గ్రామాలకు వే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న లారీలను అక్రమంగా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో వాహనాలను సీజ్ చేసి ఆ వాహనాలు తెలంగాణ పోతాయని ఎలా చెబుతున్నారని అధికారులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇసుక సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుకను పంపేందుకు కాదని ఆయన పేర్కొన్నారు. అధికారులు విచక్షణ కోల్పోయి అక్రమంగా లారీలను సీజ్ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

* టంగుటూరు మండలంలో పోలీసులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఎం.నిడమనూరులో మద్యం అమ్ముతున్నాడన్న నెపంతో.. దివ్యాంగుడు లక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక లక్ష్మీనారాయణరెడ్డి మృతి చెందాడు. దీంతో పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కొట్టడం వల్లే మృతి చెందాడని బంధువుల ఆరోపించగా… ఫిట్స్ రావటం వల్లే లక్ష్మీనారాయణరెడ్డి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* కొత్త జిల్లాల ఏర్పాటుపై పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా.. ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టాల్సిన ఉద్యోగులంతా ఉద్యమంలోనే ఉన్నారన్నారు. ఐఏఎస్ అధికారులు మినహా ఉద్యోగులందరూ సమ్మెకు సిద్ధమవుతున్నారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యోగులుగా చేయగలిగినంత చేస్తామని బొప్పరాజు వెల్లడించారు. ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవొద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ఈ నెల జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జీతాలు రాకుంటే ఉద్యోగులు తిరగబడతారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు పేర్కొన్నారు.

* ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా సేవలందించిన పారిశుద్ద్య కార్మికులను ఎమ్మెల్యే కరణం బలరాం సన్మానించారు.