NRI-NRT

అమెరికాలో పాక్ రాయబారిగా జిహాది

అమెరికాలో పాక్ రాయబారిగా జిహాది

అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా నియమితుడైన మసూద్ ఖాన్ ఉగ్రవాద సానుభూతిపరుడని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ ఆరోపించారు. ఖాన్ నియామకాన్ని తిరస్కరించాలని ఆయన అధ్యక్షుడు బైడెను రాసిన లేఖలో కోరారు. దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలనూ, అమెరికా మిత్ర దేశం భారత్ భద్రతనూ ఖాన్ దెబ్బతీస్తున్నారనీ పేర్కొన్నారు. నిరుడు ఆగస్టు వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అధ్యక్షుడిగా వ్యవహరించిన మసూద్ ఖాన్, అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధిగా, చైనాలో పాక్ రాయబారిగా పనిచేశారు. ఆయన గతంలో హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలనూ, విదేశీ టెర్రరిస్టు గ్రూపులనూ కీర్తించారనీ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని ఆదర్శంగా తీసుకోవాలని పాక్ యువతకు నూరిపోశారనీ పెర్రీ వెల్లడించారు. 2008లో ముంబయిపై ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తొయిబా భాగస్వామి హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు ఖాన్ మద్దతు ఇచ్చారని పెరీ వెల్లడించారు.