DailyDose

ఎలక్ట్రిక్ బస్ అగ్నికి ఆహుతి – TNI నేర వార్తలు

ఎలక్ట్రిక్ బస్ అగ్నికి ఆహుతి – TNI  నేర వార్తలు

* సికింద్రాబాద్‌ నగరంలోని కంటోన్మెంట్‌ డిపోలో ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బస్ గంటసేపట్లో అగ్నికి ఆహుతి అయిపోయింది. జేబీఎస్‌లోని కంటోన్మెంట్ డిపోలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం 1:00 గంల సమయంలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ బస్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను మరో చోటికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బస్సు దగ్ధమైనది. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోలో మొత్తం 22 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా కంటోన్మెంట్ డిపో ఆవరణలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

* నటుడు నరేష్ మాజీ భార్యపై కేసులు నమోదు
నటుడు నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై.. ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. రమ్య రఘుపతి వసూళ్లకు.. తనకూ ఎలాంటి సంబంధమూ లేదని నరేష్ చెబుతున్నారు. హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి మాజీ భార్య. రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య రఘుపతిని 8 ఏళ్ల క్రితం నరేష్ వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని సమాచారం. నరేష్‌కు ఉన్న ఆస్తులను చూపించి.. ఈ ఆస్తి అంతా తనకే చెందుతుందని చెబుతూ చాలా మంది నుంచి ఆమె డబ్బులు చేసినట్లు సమాచారం. అయితే బాధితులు కూడా ఒక్కో విధంగా చెబుతున్నారు. ఐదుగురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమ్యను పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయనున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు సారథ్యంలో హనుమాన్ జంక్షన్ సీఐ సతీష్ ఎస్ ఐ గౌతమ్ కుమార్ ఆదివారం వాహనాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది. హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ కి వచ్చిన సమాచారం మేరకు గుడివాడ రోడ్ నుండి పిరికీడు బైపాస్ మీదుగా వెళ్తున్న ఏపీ 16 టి సి 97 86 లారీ ఆపి తనిఖీలు నిర్వహించగా లారీలో తరలిస్తున్న సుమారు 25 టన్నుల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే సహించబోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* కుమార్తె తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి మండలం గండ్లూరులో జరిగింది. గోపాలకృష్ణ, పద్మావతి (35) దంపతులకు ఒక కుమార్తె. ఆమె అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి తల్లిదండ్రులు మందలించారు. అయితే 10 రోజుల క్రితం అతడ్ని వివాహం చేసుకుంది. కుమార్తె తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేక పద్మావతి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది.

* సికింద్రాబాద్‌ నగరంలోని కంటోన్మెంట్‌ డిపోలో ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బస్ గంటసేపట్లో అగ్నికి ఆహుతి అయిపోయింది. జేబీఎస్‌లోని కంటోన్మెంట్ డిపోలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం 1:00 గంల సమయంలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ బస్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను మరో చోటికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బస్సు దగ్ధమైనది. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోలో మొత్తం 22 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా కంటోన్మెంట్ డిపో ఆవరణలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

* తూర్పుగోదావరిజిల్లాలోని యానాం-ఎదుర్లంక జి.ఎం.సి.బాలయోగి వారధి వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. వారధి పైనుండి గౌతమి గోదావరిలో ప్రేమజంట దూకారు. గోదావరిలో పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు సమాచారంతో సంఘటనా పోలీసులు స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహం లభ్యమయింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

* తన కొడుకు ఒక మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని తెలుసకున్న ఒక తండ్రి ఎలాగైనా ఆ బంధాన్ని విడగొట్టాలని రౌడీ సహాయంతో సదరు మహిళ రహస్య ఫొటోలను ఆమె తండ్రికి పంపాడు. అనంతరం వాళ్లు నివాసం ఉంటున్న నగరాన్ని విడిచిపెట్టి పోవాలని అదే రౌడీతో ఆమెను బెదిరించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన బాధిత మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మహిళ రహస్య ఫొటోలను ఆమె తండ్రికి పంపిన నేరస్తుడిని పోలీసులు పట్టుకుని విచారించగా.. బాలుడి తండ్రి తనను ఎంతగారో బతిమాలాడాడని అందుకే తాను ఈ పనికి ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు.

* కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు సారథ్యంలో హనుమాన్ జంక్షన్ సీఐ సతీష్ ఎస్ ఐ గౌతమ్ కుమార్ ఆదివారం వాహనాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది. హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ కి వచ్చిన సమాచారం మేరకు గుడివాడ రోడ్ నుండి పిరికీడు బైపాస్ మీదుగా వెళ్తున్న ఏపీ 16 టి సి 97 86 లారీ ఆపి తనిఖీలు నిర్వహించగా లారీలో తరలిస్తున్న సుమారు 25 టన్నుల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే సహించబోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* కర్నూలు జిల్లా ఆదోనీ మండలంలో బల్లెకల్ గ్రామంలో గొర్రెల కాపరిపై రెండు చిరుతలు దాడికి పాల్పడ్డాయి. ఆటో తాయప్ప అనే వ్యక్తి ఇంటి వద్ద చిరుతలు అలజడి సృష్టించాయి.దీంతో ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి బయట కట్టేసి ఉన్న గొర్రెలపై దాడి చేయబోతుండటాన్ని తాయప్ప గమనించాడు. గొర్రెలను కాపాడుకునే క్రమంలో చిరుతలను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎదురుతిరిగి దాడికి పాల్పడటంతో ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్నాడు.అక్కడ జరిగిన దాడిలో నాలుగు గొర్రెల మృతి చెందాయని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు. గతంలో కూడా రెండు మూడు సార్లు చిరుతలు జనావాసాల్లోకి వచ్చేశాయని వాపోతున్నారు.భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు వెంటనే చిరుతలను బంధించాలంటూ ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

* జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ లో భారీ చోరీ అర్ధరాత్రి ట్రావెల్స్ తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు లక్ష రూపాయల నగదు హార్డ్ డిస్క్ కీలక పత్రాలు చోరీ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నా క్లూస్ టీం ,పోలీసులు.

*హైదరాబాద్లో ఓ మైనర్పై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి మిత్రుని గదిలోకి తీసుకెళ్లిన యువకులు.. అనంతరం ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. మాయ మాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

* తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం మల్లయ్య(45) అనే గీత కార్మికుడు రోజు వారి వృత్తి పనిలో భాగంగా మల్లయ్య తాటి వనానికి వెళ్లి కల్లు గీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.

* సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతి మృత దేహం కలకలం రేపింది. భరత్ నగర్ కాలనీలో ఓ నిర్మాణంలో ఉన్న భవనం ఐదో అంతస్థులో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృత దేహం లభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. హత్య లేక ఆత్మ హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఓ యువకుడు యువతిని తీసుకుని భవనంలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. సీసీటీవీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. వివరాలు తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

*నంద్యాల పప్పులబట్టి బజార్‌లో వివాహిత అనీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఊరేసుకొని వివాహత అత్మహత్యకు పాల్పడింది. ఏడు సంవత్సరాల క్రితం రాజు, అనీష ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంపావత్‌ జిల్లాలో సుఖిధాంగ్-దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తనక్‌పూర్‌లో బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు.

*హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలోని తహ్లివల్‌ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

*పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయసు ఉండే గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలుకి పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు.

*ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్‌పై పనిచేస్తున్న కూలీని దుండగులు ఇనుపరాడ్డు, సిమెంటు ఇంటుకలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన శివాలాల్‌గా గుర్తించారు.

* 18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో దంప‌తుల‌కు సిటీ సెష‌న్స్ కోర్టు ప‌దేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య స‌హ‌కారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడుల‌కు పాల్ప‌డ్డాడు. అనాధాశ్ర‌మంలో పెరిగిన బాధితురాలు 18 ఏండ్లు రాగానే అమ్మ‌మ్మ వ‌ద్ద నివ‌సిస్తోంది. 2018లో బాలిక‌ను త‌మ‌తో పంపాల‌ని తాము హాస్ట‌ల్‌లో చేర్పిస్తామ‌ని కుటుంబ‌స‌భ్యుల‌ను నిందితుడు కోరాడు.

* బాణసంచా కర్మాగారంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగింది. క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. మరో 12మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన వారిలో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారని వెల్లడించారు.

* చిత్తూరు జిల్లా బి.కొత్తకోట జ్యోతి బస్టాండ్ నందు సిమెంటు లారీకి కరెంటు తీగ తగిలి పోల్ విరిగి రోడ్డు మీదపడి కరెంటు తీగలు రోడ్డుకడ్డంగా పడ్డాయి సమయానికి కరెంటు లేకపోవడంతో దాదాపు 30 నుంచి 40 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అనునిత్యం రద్దీగా ఉండే కూడలిలో ఈ ప్రమాదం జరిగింది

*కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఎంపీ నందిగాం సురేష్‌తోపాటు ఆయన అనుచరుల దాడి ఘటన కొత్త మలుపు తీసుకుంది. కృష్ణ లంక ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారంటూ చేయి చేసుకున్న వీడియో క్లిప్పింగ్స్ తాజాగా ఎంపీ అనుచరులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దుమారం రేగింది. పోలీస్ స్టేషన్‌లో నందిగాం సురేష్‌తో పాటు ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడి వారిపై దాడి చేసిన వీడియో క్లిప్పింగులు ఎక్కడా బయటపెట్టలేదు.

*పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ట్రావెల్స్ తాళాలు పగలగొట్టి దుండుగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు లక్ష రూపాయల నగదు, హార్డ్ డిస్క్, కీలక పత్రాలు చోరీకి గురయ్యాయి. ట్రావెల్స్ యజమాని ఫిర్యాదు మేరకు క్లూస్ టీం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*పెళ్లికి వెళ్లి వస్తున్నకారు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగింది.ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని సుఖిధాంగ్ రీతా సాహిబ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ బృందం ఒక వివాహానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని డీఐజీ నీలేష్ ఆనంద్ భర్నే చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. స్థానిక యంత్రాంగం సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని డీఐజీ పేర్కొన్నారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.అని ప్రధాని మోదీ హిందీలో రాశారు.

*భార్యపై అనుమానంతో కన్న కొడుకును కరెంట్ షాక్తో హత్య చేసేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. ప్రకాశం జిల్లా దర్శిలో ఆదివారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసుల కఽథనం… దొనకొండ మండలం నర్శింహనాయునిపాలెంకు చెందిన మహిళను పొదిలి మండలం రామాపురం గ్రామానికి చెందిన దేశం రమణారెడ్డి ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం ఆరేళ్ల వయస్సు ఉన్న కొడుకు రేవంత్ ఉన్నాడు. రమణారెడ్డికి భార్యపై అనుమానం ఉంది. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. దీంతో ఆమె స్ఫృహతప్పి పడిపోయింది. అనంతరం కుమారునికి విద్యుత్ షాక్ పెట్టి హత్యచేసే ప్రయత్నం చేశాడు. బాలుడు కేకలు వేయడంతో తల్లి లేచి అరిచింది. చుట్టుపక్కల వారు రావడంతో రమణారెడ్డి పరారయ్యాడు.

*ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారును బయటకు తీసి అందులోకి వ్యక్తులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఇంకోల్లు మండలం ఇడుపులపాడులో ఓ పెళ్ళి రిసెప్షన్కు వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోుద చేసి దర్యాప్తు చేపట్టారు.

*విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాధీనం చేసుకున్నవాటిలో ఏడుకోట్ల విలువైన హెరాయిన్ ఉండగా రూ.2.82 కోట్ల విలువ కలిగిన ఎండీఎంఏను గుర్తించారు. విదేశాల నుంచి ఎయిర్పోర్టుకు కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు. రెండు కొరియర్లలో బెల్జియం, జాంబియా నుంచి దుబాయ్ మీదుగా బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చినట్లు గుర్తించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేసి పకడ్బందీ వ్యూహంతో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నామని, వీటివెనుక కారకులెవరనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు ప్రకటించారు.

*అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, అమానుషంగా హత్య చేసిన కేసులో పానిపట్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పుచెప్పింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నరరూప రాక్షసులకు ఉరిశిక్ష విధించింది. హర్యానాలో పోస్కో చట్టం కింద జంట మరణశిక్షలు విధించిన తొలి కేసు ఇదే. నాలుగేళ్ల క్రితం ఈ దారుణం చోటుచేసుకుంది.

*మెదక్ జిల్లాలోని హవేళిఘనపూర్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

*ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన కొయ్యల రాంబాబు(30) ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువుకునే సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన యువతి రాంబాబును పట్టించుకోకపోవటం, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య కొంతకాలం నుంచి మనస్పర్థలు వచ్చాయి. యువతి తీరుతో మన స్తాపానికి గురైన రాంబాబు ఆదివారం రాత్రి మండపేట మండలం కేశవరం గ్రామం వద్ద ఉన్న రైల్వేట్రాక్పై గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రమాదంలో రాంబాబు మృతదేహం నుజ్జునుజ్జయింది.

*కోలార్ జిల్లాలో 9వ తరగతి చదివే బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుర్మార్గులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. విషయం వెలుగులోకి రాగానే బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణలు జరుపుతున్నామని అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. విద్యార్థినికి పరిచయం కలిగిన వారే కిడ్నాప్కు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థి నుంచి సమగ్ర వివరాలు సేకరించిన మేరకే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

*విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

*విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

*అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, అమానుషంగా హత్య చేసిన కేసులో పానిపట్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పుచెప్పింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నరరూప రాక్షసులకు ఉరిశిక్ష విధించింది. హర్యానాలో పోస్కో చట్టం కింద జంట మరణశిక్షలు విధించిన తొలి కేసు ఇదే. నాలుగేళ్ల క్రితం ఈ దారుణం చోటుచేసుకుంది.
*డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులతో కలిసి బయటకు వెళ్లిన ఆ యువకుడు, మళ్లీ ఇంటికి రాలేదు. రెండ్రోజుల తర్వాత ఓ పొలంలో మృతదేహం లభ్యమైంది. తల, శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

*విజయనగరంజిల్లాలోని కోమరాడ మండలంలో ఒంటరి ఏనుగు పశువులశాలపై విరుచుకుపడింది. ఏనుగుల గుంపులో నుండి బయటకి వచ్చిన ఒక ఏనుగు… అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందారు. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు

*కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వాగేశ్వరి కాలేజీ ఎదురుగా కారు – టాటా ఏసీ వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*పెంపుడు కుక్క చనిపోవడంతో యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల 7 వరిగేటి శ్రీను అనే వ్యకి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెంపుడు కుక్క చనిపోవడంతో శ్రీను ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని భార్య రాజమణి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

*ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో (Anantapur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లమూడ మండలం పులగంపల్లి వద్ద మినీబస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకన్నారు. క్షతగాత్రులను కదిరి దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది ఉన్నారని తెలిపారు.

*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతు ఎరుకుల నారాయణప్ప (54) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణప్ప తన ఐదెకరాల్లో సాగుకు, పెద్ద కుమార్తె పెళ్లి కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధరలేక అప్పుతీరే మార్గంలేక శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

*అన్నాడీ ఎంకే సీనియర్‌ నేతమాజీ మంత్రి డి.జయకుమార్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాయపురంలో కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా డీఎంకే కార్యకర్తపై దాడి చేసి అర్ధనగ్నంగా ఊరేగించారంటూ ఆయనపై పోలీసులు ఎనిమిది సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎగ్మూరు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. జయకుమార్‌ అరెస్టయ్యారనే వార్త తెలియగానే అన్నాడీఎంకేలో ఆగ్రహావేశాలు వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో పలు జిల్లా కేంద్రాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది