DailyDose

మార్చి 7 నుండి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు – TNI తాజా వార్తలు

మార్చి 7 నుండి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు – TNI  తాజా వార్తలు

* తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 6న బడ్జెట్‌ ఆమోదంపై తెలంగాణ కేబినెట్‌ భేటీ జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు

* మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది

*తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆత్మకథా పుస్తకాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సోమవారం ఆవిష్కరించారు. చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాబిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. తన పుస్తకానికి స్టాలిన్ ఉంగలిల్ ఒరువన్మీలో ఒకరు) అనే పేరు పెట్టారు. మొదటి పుస్తకాన్ని తమిళనాడు మంత్రి దురైముగురన్‌కు రాహుల్ అందజేశారు.

*దక్షిణ కాశీ వేములవాడలో మహా శివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజుల పాటు శివరాత్రి జాతర ఉత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం టీటీడీ నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు.. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు మంత్రులు సమర్పించనున్నారు

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.

* మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు సంగీత‌, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఎస్వీ నాద‌స్వరం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వరం, డోలు వాయిద్య సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేశ్‌ అనే విద్యార్థులు భ‌క్తిగీతాల‌ను ఆలపించారు. క‌ళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్‌ వైవిఎస్‌.ప‌ద్మావ‌తి, వారి శిష్యులు ల‌క్ష్మి, కె.పి.రాధిక బృందం ఆలపించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అన్ని విభాగాల అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు

*2022-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కోసం చేయాల్సిన ప్రతిపాదనలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇదివరకే శాఖాపరంగా అవసరమున్న నిధులపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన మంత్రి సోమవారం ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

*వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఏపీ పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. గంజాయి సాగుఅక్రమ రవాణా కట్టడికి ఒడిశాతో జాయింట్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ అక్రమ రవాణావినియోగంపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. కాలేజీలురిసార్ట్స్‌కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామనివిలేజ్ పోలీస్ యాక్ట్ సజీవంగానే ఉందని చెప్పారు. సచివాలయ పోలీస్ వ్యవస్థకోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

*తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్న ఘతన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలు నిలిపివేయగా తెలంగాణలోనే సక్రమంగా పెన్షన్లు అందుతున్నాయన్నారు.రాష్ట్రంలో నూటికి అరవై ఒక్క శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని అందువల్ల రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు వేల వందల కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని మంత్రి చెప్పారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూకోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణపు పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలసి శంకుస్థాపన చేసారు.

*ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుంది. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు .రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన. కొత్త జిల్లాలపై అభ్యంతరాలను మార్చి 3 వరకు స్వీకరిస్తాం- ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్.

* కేసీఆర్‌పై మండిపడ్డ భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ప్రభుత్వం విత్తనాలు ఇవ్వలేదని, దీనికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రైతులకు క్రాఫ్‌ లోన్, పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ దుర్మార్గంగా ఉందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షా 25 వేల కోట్లు మింగారని ఆరోపించారు. ఢిల్లీలో మోదీ, హైదరాబాద్‌లో కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లలో కేసీఆర్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బడ్జెట్‌ మాత్రం లక్షల కోట్లు దాటుతోందని భట్టి విక్రమార్క తెలిపారు

*టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులపై హైకోర్టులో విచారణ మార్చి 11కు వాయిదా..
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌తో తోపాటుదాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన జీవోలపైన కోర్టులో కేసు జరుగుతుండగా అదే అంశంపై ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది . ప్రత్యేక ఆహ్వానితుల విషయంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్న పిటిషనర్‌ తరుఫున న్యాయవాది వాదించగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించబోమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఇరు వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం విచారణ మార్చి 11 వరకు వాయిదా వేసింది.

* బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ ఆదివారం కొద్దిసేపు అయింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలంటూ ఒక పోస్ట్, రష్యాకు సాయం చేయాలంటూ మరో పోస్టు ఆయన అకౌంట్‌లో ప్రత్యక్షమయ్యాయి. విరాళాలను క్రిప్టో కరెన్సీ రూపంలోనూ స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది.దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పీటీఐతో మాట్లాడుతూ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా ట్విట్టర్‌ అకౌంట్‌ యథావిధిగా నడుస్తోందని, హ్యాకింగ్‌పై ట్విట్టర్‌ బాధ్యులతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

*విశాఖ కోర్టుకు హాజరైన టీడీపీ నేత నారా లోకేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అనని మాటలను అన్నానని ప్రచురించారన్నారు. తనపై తప్పుడు వార్తలను ప్రచురించారన్నారు. సాక్షితో పాటు మరో రెండు పత్రికలకు నోటీసులిచ్చామన్నారు. తప్పు జరిగిందని తనకు లేఖలు కూడా రాశారన్నారు. సాక్షిపై 75 కోట్లు, డెక్కన్ క్రానికల్‌పై 25కోట్ల దావా వేశారు.

*భీమ్లానాయక్ చిత్రంపై అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు అందింది. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం సినిమాలో సారెను కాలితో తన్నే సన్నివేశంతో.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించిచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పురుషోత్తం ఫిర్యాదులో పేర్కన్నారు

* హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్‌కు నిరసనగా ఆటో డ్రైవర్స్ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ నగర పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన ఆటోలు మాత్రమే నడపాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆటోలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పోలీస్, రవాణా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

* మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. మైలవరంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం స్థలంలో దీక్షలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దేవినేని ఉమ, టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి గౌతు లచ్చన్న విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్నారు.ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మైలవరం రెవిన్యూ డివిజన్ కోసం ప్రాణాలైన అర్పిస్తానన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి 10 రోజులు రాజమండ్రి జైలులో ఉంచారని, అవసరమైతే గుండాలతో ప్రాణాలు కూడా తీయిస్తారన్నారు. ఈ పాలనలో అంతకు మించి ఎం చేస్తారన్నారు. తాము రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతుంటే.. జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. పోలీసులు దీక్షలను అడ్డుకున్నా.. సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగిస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు. తనపై కక్షతోనే మైలవరంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించలేదన్నారు. మైలవరంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటిస్తే 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. మైలవరంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

* మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు భౌతికకాయనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి సానుభూతి ప్రకటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ యడ్లపాటి ప్రజల కోసం తాపత్రయ పడ్డారన్నారు. అలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారనిఅధికారం కావాలని ఏనాడు కోరుకోలేదని తెలిపారు. సంఘం డైరీ స్థాపనకు కృషి చేశారన్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తిఅజాత శత్రువు యడ్లపాటి అని కొనియాడారు. పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి అని అన్నారు. యడ్లపాటి వెంకటరావు మృతి బాధాకరమని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు.

* నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ను పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైస్ చైర్మన్‌ను కాపాడేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.

* కృష్ణానదిపై తెలంగాణప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వెంకట గోపాలకృష్ణ రావు తెలిపారుసోమవారం కేఆర్ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు వెంకట గోపాలకృష్ణ రావు వినతి ప్రత్రం ఇచ్చారు.ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కృష్ణానది నీటి వాటాను శాతం కేటాయించాలని వెంకట గోపాలకృష్ణ రావు అన్నారు

*వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ. జగన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి కాపులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు’’ అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. పవన్ సినిమాలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. కాపు రిజర్వేషన్లు, కాపు భవన్లు నిలిపివేస్తున్నట్లుగానే పవన్ కల్యాణ్ సినిమాను కూడా నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు.

*దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి సంస్మరణ సభ దుబాయ్లో నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన చేసిన చివరి పర్యటన దుబాయ్, యూఏఈలోనే. ఏపీఎన్ఆర్టీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం యూఏఈలో ఏర్పాటుచేసిన ఈ సంస్మరణ సభలో దుబాయ్లో కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ అమిన్పురి, ఏపీ ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రాంతీయ సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి పాల్గొన్నారు. కాగా.. రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో మేకపాటి గౌతమ్రెడ్డి అస్థికల నిమజ్జనం ఆదివారం నిర్వహించారు. స్థానిక కోటిలింగాల రేవులో గౌతమ్రెడ్డికి పితృకర్మలను ఆయన తనయుడు కృష్ణార్జునరెడ్డి నిర్వహించారు.

*వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం సోమవారం ప‌త్రికా ప్రక‌ట‌న విడుదల చేసింది.

*వాణిజ్య పునర్వ్యవస్థీకరణ పేరుతో అసంబద్ధమైన, హేతుబద్ధతలేని ప్రతిపాదనలు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ… జీఎస్టీ పన్ను చట్టానికి అనుగుణంగా శాఖలో పలు మార్పులు చేయాల్సి ఉండగా, ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచించడంలేదన్నారు.

*తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ‌ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్సీకి వేదపండితులు వేదాశీర్వచనం అందిచగా, టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు.

*వాణిజ్య పునర్వ్యవస్థీకరణ పేరుతో అసంబద్ధమైన, హేతుబద్ధతలేని ప్రతిపాదనలు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ… జీఎస్టీ పన్ను చట్టానికి అనుగుణంగా శాఖలో పలు మార్పులు చేయాల్సి ఉండగా, ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచించడంలేదన్నారు.

*జ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావుకు కన్నుముశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన నివాసంలో యడ్లపాటి వెంకట్రావు (104) తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

*దక్షిణ అండమాన్ సముద్రంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నది. దీని ప్రభావంతో ఈనెల 28న అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాతఇది శ్రీలంక దిశగా పయనిస్తుందని, కోస్తాపై అల్పపీడనం ప్రభా వం ఉండకపోవచ్చునని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు.

*సొంత స్థలం ఉన్న వారికి దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. శనివారం విశాఖపట్నం జిల్లా చోడవరంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లడుతూ.. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి 24 గంటల్లో బిల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

*ప్రతీ ఏడాది విశిష్ట పురస్కారాలను అందజేసే రామినేని ఫౌండేషన్ ఈ ఏడాది 286 మంది ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, 39 మంది మండల విద్యాశాఖాధికారులకు గురు సన్మానం చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం, చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని విజయవాడలో శనివారం వెల్లడించారు. మార్చి ఒకటో తేదీన మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.

*అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజధాని పరిరక్షణ సమితి ఉద్యమాన్ని ఇకపై రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు విస్తరింప చేయాలని రాజధాని పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో లోక్సభ స్థాయిలో జరిగిన పరిరక్షణ సమితి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శివారెడ్డి అధ్యక్షత వహించారు

*‘అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో చివరికి గెలిచేది ఆత్మగౌరవమే. సీఎం జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారు’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘‘సంకుచిత మనస్తత్వంతో కక్షపూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ… తన ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్రెడ్డిని పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీలోని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మగౌరవంతో ఉన్నవారంతా పార్టీ నుంచి బయటకు రావాలి. మాతో కలిసి ముందుకు నడవండి. పవన్ కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం’’ అని నాదెండ్ల పిలుపునిచ్చారు.

*ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావుకు(82) ఇచ్చిన బెయిలును వచ్చే నెల 3 వరకూ బోంబే హైకోర్టు పొడిగించింది. రావు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో గత ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు ఆరునెలల కాలానికి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం రీత్యా తనకు శాశ్వత బెయిల్ ఇప్పించాలని గత ఏడాది సెప్టెంబరులో ఆయన కోర్టును అభ్యర్థించారు. అప్పటి నుంచి కోర్టు బెయిల్ను పలుమార్లు పొడిగించింది. ఆయన తరపు న్యాయవాది శనివారం మరోమారు బెయిల్ పొడిగింపునకు పిటిషన్ దాఖలు చేశారు. వైద్య నివేదికల ప్రకారం రావు పార్కిన్సన్ వ్యాధితో పాటు వివిధ నరాల సంబంధిత ఇబ్బందుల్ని, ఉదర సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు. ముంబై దాటి వెళ్లొద్దన్న నిబంధనను కూడా సడలించి, వరవరరావును తెలంగాణకు వెళ్లనివ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్పై వాదనలను వచ్చే నెల 1న ఆలకిస్తామని.. రావు బెయిల్ను వచ్చే నెల 3 వరకూ పొడిగిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.

*బొగ్గు కంపెనీల నుంచి వివిధ రంగాలకు బొగ్గు కొనుగోలు ఇకపై పూర్తి పారదర్శకంగా జరగనుంది. కంపెనీల నుంచి ఈ-వేలం ద్వారా బొగ్గు కొనుగోలు జరిగేలా సింగిల్ విండో విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు బొగ్గు కంపెనీలు చేసిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)/సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ల ద్వారా ఈ-వేలం జరపాల్సి ఉంటుందని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య వర్గాలతోపాటు విద్యుత్ రంగం, నాన్ రెగ్యులేటెడ్ రంగాలు కూడా ఈ-వేలం ద్వారానే బొగ్గు కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మార్కెట్లో ఒకే రేటుకు బొగ్గు లభించనున్నందున వినియోగదారులంతా ఈ-వేలం బాట పడతారని, తద్వారా మార్కెట్ వక్రీకరణలు తొలగిపోతాయని తెలిపింది.

*కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన తెరాస సర్కారు.. అధికారంలోకి వచ్చాక విద్యారంగాభివృద్ధిని మర్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. పాఠశాలల్లో సిబ్బంది లేకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు.