Health

విషజ్వరాల నివారిణి వామింట తులసి

విషజ్వరాల నివారిణి వామింట తులసి

యాంటీసెప్టిక్‌గానూ, యాంటీవైరల్‌గానూ పనిచేయడమే కాకుండా మలేరియా వంటి తీవ్రమైన జ్వరాలను తగ్గిస్తుంది వామింట తులసి. ఈ మొక్క విశేషాలు ఈ వారం తెలుసుకుందాం.ఆఫ్రికా దేశాల్లో ఈ హెర్బ్‌ని ‘ఫీవర్‌ ప్లాంట్‌’గా పిలుస్తారు. ఒక మీటరు ఎత్తు పెరిగే ఈ మొక్క చిరుపూత దశలో ఉన్నప్పుడే ఎక్కువ పరిమాణంలో తైలాలను తీయవచ్చు. ఈ తైలాలలో థైమాల్‌ అను ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ గరిష్టంగా 55 శాతం వరకు ఉంటుంది. మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఇలా వచ్చిన వామింట తులసి తైలం అసలైన వామాయిల్‌ బదులుగా మార్కెట్లో చలామణి అవుతుంటుంది.

**ప్రయోజనాలు
దీని తైలం శక్తివంతమైన యాంటీసెప్టిక్‌గా, యాంటీమైక్రోబియల్‌గా, యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. దీనికి కారణం ఆయిల్‌లో థైమాల్‌ అను వాలటైల్‌ కాంపోనెంట్‌ సమృద్ధిగా ఉండటమే.ఆకురసం తేనెతో కలిపి తీసుకున్నచో మలేరియా జ్వరం కూడా తగ్గిపోతుంది.ఆకు కషాయం రొపం, పడిశం, గొంతునొప్పి, తలనొప్పులను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టిస్తుంది.మొక్క నుంచి తీసిన లేపనం కీళ్లవాతానికి, శారీరక వాపులు, నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.దీంతో తయారుచేసిన హెర్బల్‌ టీ తాగితే ఉదర భాగానికి శాంతిని చేకూర్చుతుంది. వాంతులను, వికారాన్ని నెమ్మదిస్తుంది.ఆకు మెత్తగా నూరి ముద్దగా చేసి వెన్నతో కలిసి శరీరానికి రాసుకుంటే చర్మ సంబంధ దురదలు, స్కాబిస్‌ వంటివి దూరమవుతాయి. పుండ్లు, ఇతర గాయాలకు రాసుకోవచ్చు.నోటి దుర్వాసనకు, గార్గిల్‌ లోషన్‌గా, కండ్ల కలక లాంటి సమస్యలకు ఇది ఉపయుక్తం. ఫీవర్‌ప్లాంట్‌ రసాయనాలలో హార్మోనల్‌ గుణాలు కూడా ఉండటం ఒక విశేషం. కొన్ని జాతుల మొక్కల విత్తన శుద్దికి, విత్తనాల మొలక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దీని రసాయనం దోహదపడుతుంది. ఆహారపదార్థాలకు, పానీయాలకు సువాసనను, రుచిని కలిగించడానికి ఫ్లేవరింగ్‌ ఏజెంట్‌గానూ ఉపయోగిస్తారు.వామింట తులసి శక్తివంతమైన కీటక, దోమల రెపెల్లెంట్‌గా పనిచేయడమే కాకుడా పరిసరాలను పరిశుభ్రతగాను, స్వచ్ఛతగాను ఉంచుతుంది.