DailyDose

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం- TNI 20 యుద్ద కథనాలు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం- TNI  20 యుద్ద కథనాలు

1. ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయాలివైట్‌హౌస్‌ వద్ద వేలాది మంది డిమాండ్‌
రష్యా దాడి కొనసాగుతున్న ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఆదివారం యూసీసీఏ, యూఎన్‌ఐఎ్‌స, యునైటెడ్‌ హెల్ప్‌ ఉక్రెయిన్‌లు అమెరికా రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహించాయి. వేలాది మంది శ్వేతసౌధం సమీపంలో గుమిగూడి ‘నో ఫ్లై జోన్‌ ఓవర్‌ ఉక్రెయిన్‌’, ‘స్టాప్‌ ది వార్‌ ఇన్‌ ఉక్రెయిన్‌’, ‘క్లోజ్‌ అవర్‌ స్కైస్‌’, ‘సపోర్ట్‌ ఉక్రెయిన్‌’ అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు.

2. Romania నుంచి ఢిల్లీ చేరిన విమానం…200మంది భారతీయుల రాక
ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఉక్రెయిన్ దేశం నుంచి రొమేనియాలోని సుసెవా సరిహద్దు ప్రాంతానికి వచ్చిన 200 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు.‘‘మేం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బాంబు దాడులు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం, మా ఎంబసీ మాకు సహాయం చేశాయి… మేము తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన ఒక విద్యార్థి చెప్పారు ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అనుమతించాలని ఐక్యరాజ్యసమితి ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ అభ్యర్థించారు.ఈ నేపథ్యంలో మార్చి 10న రష్యాతో సమావేశం కాబోతున్నట్లు ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా చెప్పారు.కాగా ఖార్కివ్ సమీపంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్‌ను ఉక్రెయిన్ బలగాలు కాల్చిచంపాయని ఉక్రెయిన్ చీఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ మంగళవారం చెప్పారు
03062022143324n24
3. Kharkiv యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ హతం
ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న సైనిక దాడి పర్వంలో కీలక ఘటన జరిగింది. ఖార్కివ్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్.విటాలీ గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధం,సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. విటాలీకి 2014లో రష్యా సర్కారు నుంచి పతకం కూడా లభించింది.తమతో జరిగిన యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.గతంలో రష్యన్ 7వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండింగ్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీని, 41వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన డిప్యూటీ కమాండర్‌ను ఉక్రేనియన్ సైనికులు హతమార్చారు.

4. Ukraine దేశంలోని 5 నగరాల్లో రష్యా కాల్పుల విరమణ
రష్యా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలోని కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో మాస్కో కాలమానం ప్రకారం మంగళవారం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.సోమవారం బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన మూడవ రౌండ్ చర్చల్లో పౌరుల తరలింపు సమస్యలు ప్రస్థావనకు వచ్చాయి.పౌరుల తరలింపు కోసం కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో విరామం ఇస్తున్నట్లు రష్యా వివరించింది.కాగా తాను రష్యాతో మార్చి 10వతేదీన సమావేశం కాబోతున్నట్లు ఉక్రేనియన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా చెప్పారు.

5. Russia-Ukraine War: కదనరంగంలో దిగిన కోయంబత్తూర్ వైద్య విద్యార్థి
వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన తమిళనాడు విద్యార్థి రష్యా దండయాత్ర నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమిళనాడు విద్యార్థి ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళంలో చేరాడు.2018వ సంవత్సరంలో ఉక్రెయిన్ దేశంలోని ఖార్కివ్‌ నగరంలోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి సాయినికేష్ ఉక్రెయిన్ వెళ్లారు. సాయినికేష్ వైద్యవిద్య 2022 జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర చేస్తుండటంతో సాయినికేష్ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తుండటంతో సాయినికేష్ రవిచంద్రన్ అతని కుటుంబంతో కమ్యూనికేషన్ కోల్పోయారు.
03082022091430n74
6. ఉక్రెయిన్‌ నుంచి 65 మంది విద్యార్థుల రాక
యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ నుంచి సోమవారం ఉదయం మరో 65 మంది విద్యార్థులు రాష్ట్రానికి సురక్షితంగా చేరుకున్నారు. దీంతో ఇంతవరకు తిరిగొచ్చిన విద్యార్థుల సంఖ్య 500 దాటింది. మరో 163 మంది విద్యార్థులు రెండు మూడు రోజుల్లో వాపసు రావచ్చునని అంచనా వేస్తున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే రుమేనియా, పోలెండ్‌ సరిహద్దుల్లో తమవంతు విమానాలకోసం పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్‌ గంగ పేరిట ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను ఇంత వరకు 51 విమానాలలో సురక్షితంగా మనదేశానికి తరలించారు. ఢిల్లీనుంచి సోమవారం కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న 65 మంది విద్యార్థుల బృందాన్ని అధికారులు స్వాగతించారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సులలో వారి సొంత జిల్లాలకు పంపించారు

7. ఉక్రెయిన్ సైనిక స్థావరాన్ని ఆక్రమించిన రష్యా
ఉక్రెయిన్ దేశంలోని ఓ సైనిక స్థావరాన్ని రష్యా మంగళవారం స్వాధీనం చేసుకుంది.ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి చేస్తున్న రష్యా ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని పాడుబడిన సైనిక స్థావరాన్ని ఆక్రమించింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని బెర్డియాన్స్క్ శివార్లలో సైనిక పరికరాలు, ఫిరంగులు, ఇంధన డిపోలతో కూడిన సైనిక స్థావరాన్ని ఉక్రేనియన్ భద్రతా దళాలు విడిచిపెట్టాయి. దీంతో రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనిక స్థావరాన్ని ఆక్రమించారని సాక్షులు పేర్కొన్నారు.ఈ సైనిక స్థావరంలో నైట్ నిఘా పరికరాలు, ఆర్టిలరీ నిఘా సముదాయం, సాయుధ వాహనాలు, ఇతర సైనిక పరికరాలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు.మరో 26 ఉక్రెయిన్ సైనిక నిర్మాణాలు తమ వైమానిక దాడుల్లో ధ్వంసమైనట్లు రష్యా పేర్కొంది.ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ఏరోస్పేస్ ఫోర్సెస్ ఏవియేషన్ 26 సైనిక నిర్మాణాలను ధ్వంసం చేసిందని రష్యన్ ఫెడరేషన్ కు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

8. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు నిలిపివేత…ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియన్ రిఫైనర్లు రష్యా దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును నిలిపివేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యా దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవడానికి ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ మంగళవారం తెలిపింది. ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర తర్వాత మాస్కోపై విధించిన ఆంక్షలను అనుసరించి రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడానికి ఆస్ట్రేలియాలోని రిఫైనర్ వివా అంగీకరించింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ముడి చమురు, ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని ఆస్ట్రేలియా యొక్క ఏకైక రిఫైనర్ అయిన అంపోల్ ప్రతినిధి తెలిపారు.
03082022100342n64
9. ఈ టైంలో పుతిన్‌ మనసు మార్చగలిగేది ఆ ఒక్కడే!
ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మనసును మార్చగలిగేది ఒక్కరేనని అంటున్నాడు ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్‌ రోచ్‌. ఆ ఒక్కరు ఎవరో కాదు.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. ఉక్రెయిన్‌ రష్యాల మధ్య యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. రష్యా బలగాల పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్‌ సైన్యం. అయితే నష్టం మాత్రం భారీగానే ఉంటోంది. యుద్ధం మధ్యే శాంతి చర్చలు, పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది కూడా. ఈ తరుణంలో మొండిగా ముందుకెళ్తున్న పుతిన్‌ను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఒక్క జింగ్‌పిన్‌ మాత్రమేనని అమెరికన్‌ ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ అభిప్రాయపడుతున్నారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌ పరిణామాల విషయంలో పుతిన్‌ మనసును మార్చగలిగే ప్రపంచలోని ఏకైక వ్యక్తి జిన్‌పింగ్‌ మాత్రమే. వాళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉంది. చైనా ఈ వ్యవహారంలో ట్రంప్‌కార్డుగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి నా దృష్టిలో ఇప్పుడు జీ జిన్‌పింగ్‌ ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనొక్కడే ఇప్పుడు పుతిన్‌ను ప్రభావితం చేయగలరు’’ అని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. రష్యాతో తమ బంధం ఎంతో బలమైందని, అందుకే ఈ వ్యవహారంలో స్థిమితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. అవసరమైతే ఇరు దేశాల(ఉక్రెయిన్‌-రష్యా) మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామంటూ ఆఫర్‌ కూడా ఇచ్చింది. ఇంకోపక్క రష్యాపై ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది.

10. ఈ టైంలో పుతిన్‌ మనసు మార్చగలిగేది ఆ ఒక్కడే!
ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మనసును మార్చగలిగేది ఒక్కరేనని అంటున్నాడు ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్‌ రోచ్‌. ఆ ఒక్కరు ఎవరో కాదు.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. ఉక్రెయిన్‌ రష్యాల మధ్య యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. రష్యా బలగాల పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్‌ సైన్యం. అయితే నష్టం మాత్రం భారీగానే ఉంటోంది. యుద్ధం మధ్యే శాంతి చర్చలు, పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది కూడా. ఈ తరుణంలో మొండిగా ముందుకెళ్తున్న పుతిన్‌ను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఒక్క జింగ్‌పిన్‌ మాత్రమేనని అమెరికన్‌ ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ అభిప్రాయపడుతున్నారు.సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌ పరిణామాల విషయంలో పుతిన్‌ మనసును మార్చగలిగే ప్రపంచలోని ఏకైక వ్యక్తి జిన్‌పింగ్‌ మాత్రమే. వాళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉంది. చైనా ఈ వ్యవహారంలో ట్రంప్‌కార్డుగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి నా దృష్టిలో ఇప్పుడు జీ జిన్‌పింగ్‌ ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనొక్కడే ఇప్పుడు పుతిన్‌ను ప్రభావితం చేయగలరు’’ అని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. రష్యాతో తమ బంధం ఎంతో బలమైందని, అందుకే ఈ వ్యవహారంలో స్థిమితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. అవసరమైతే ఇరు దేశాల(ఉక్రెయిన్‌-రష్యా) మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామంటూ ఆఫర్‌ కూడా ఇచ్చింది. ఇంకోపక్క రష్యాపై ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది.
03082022104132n20
11. అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి పుతిన్‌ వెలి
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ సమాజమంతా గుర్రుగా ఉంది. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్‌) పుతిన్‌ను వెలివేసింది. ఆయన ఐజేఎఫ్‌లో గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందే పుతిన్‌ను సస్పెండ్‌ చేసిన ఐజేఎఫ్‌ ఇప్పుడు ఆయనను శాశ్వతంగా తొలగించింది. పుతిన్‌ సన్నిహితుడు ఆర్కడి రోటెన్‌బర్గ్‌ను సైతం ఐజేఎఫ్‌ విడిచి పెట్టలేదు. ఐజేఎఫ్‌ అన్ని హోదాల నుంచి వీరిద్దరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

12. రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళాలలో చేరాడు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించబడిందని తెలిపారు.అయితే సాయినికేష్ 2018లో ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అతని కుటుంబం సాయినికేష్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత వారు సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు.
03082022114231n2
13. ఆయిల్‌ దిగుమతులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు- అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోంది. సున్నితమైన అంశం కావడంతో రిస్క్‌ తీసుకునేందుకు వెనుకాడుతోంది. తాజాగా రష్యా దిగుమతుల విషయంలోనూ స్వరం తగ్గించి మాట్లాడుతోంది అమెరికా. పది రోజులు గడిచినా ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాతో పాటు యూరప్‌లో ఉన్న దాని మిత్రదేశాలు రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు రష్యా నుంచి ముడి చమురు, దిగుమతిని నిషేధించాలని చర్చించాయి. ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు బయటకి పొక్కడంతో ఒక్కసారిగా బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 140 డాలర్లను టచ్‌ చేసింది. మరోవైపు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ మాట్లాడుతూ.. యుద్ధ అనంతర పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. రష్యా నుంచి చమురు, ఆయిల్‌ దిగుమతి చేసుకోకూడదని యూరప్‌ దేశాలు భావిస్తే .. దాని వల్ల వారికే నష్టమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు బ్యారెల్‌ చమురు ధర 300 డాలర్లకు పెరగొచ్చంటూ బాంబు పేల్చారు.క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం రష్యాకు మరో ప్రత్యామ్నాయ చమురు ఉత్పత్తి దేశం ఏదీ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమెరికా దాని మిత్రదేశాలు పునరాలోచనలో పడ్డాయి. లిబియా, వెనుజువెలా, ఇరాన్‌లలో ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరిగే అవకాశం లేకపోవడంతో రష్యా దిగుమతుల విషయంలో అమెరికా దూకుడు తగ్గించింది.తాజగా వైట్‌హౌజ్‌ మీడియా ప్రతినిధి జేన్‌సాక్‌ మాట్లాడుతూ… రష్యా నుంచి ఆయిల్‌, గ్యాస్‌ దిగుమతులపై నిషేధం విధించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే నిషేధం అంశంపై మిత్రపక్ష దేశాలతో చర్చలు జరిగిందని తెలిపింది. రష్యా దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతూనే చమురు దిగుమతులపై కఠిన వైఖరి తీసుకోవడానికి అమెరికా మీనమేషాలు లెక్కపెడుతోంది.

14. సేఫ్‌ కారిడార్‌లు ఎక్కడ? రష్యా-ఉక్రెయిన్‌ల తీరుపై భారత్‌ తీవ్ర అసంతృప్తి
ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్‌, మరియూపోల్‌, సుమీ, చెర్నీగోవ్‌ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సేఫ్‌ కారిడార్‌లపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్‌.. ఆపరేషన్‌ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి. అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్‌ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు. సేఫ్‌కారిడార్‌ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి.
Sumi-evacuation
15. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన నెల్లూరు విద్యార్థులు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో విద్యార్థులు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే 31 మంది నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో తమ బిడ్డల పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో తల్లడిల్లిన తల్లిదండ్రులకు జిల్లా యంత్రాంగం కొండంత అండగా నిలిచింది. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో అధికారులు విద్యార్థులను సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు.

16. ఉక్రెయిన్ సైన్యంలో చేరిన త‌మిళ‌నాడు యువ‌కుడు
ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొనసాగుతూనే వున్నాయి. నేటికి స‌రిగ్గా 13 రోజులు. రాజ‌ధానితో స‌హా ప‌లు ప్రాంతాల‌పై ఏక ధాటిగా ర‌ష్యా బ‌ల‌గాలు కాల్పులు జ‌రుపుతూనే వున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్యాపై పోరులో విదేశీ వాలంటీర్లు త‌మ‌కు స‌హ‌క‌రించాలంటూ, వాలంట‌రీగా ముందుకు రావాలంటూ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ పిలుపు మేర‌కు త‌మిళ‌నాడుకు చెందిన ఓ యువ‌కుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఉక్రెయిన్ మీడియా రిపోర్టుల ప్ర‌కారం కోయంబ‌త్తూరుకు చెందిన సైనికేశ్ ర‌విచంద్ర‌న్ (21) ఉక్రెయిన్ పారామిల‌ట‌రీ సైన్యంలో చేరిన‌ట్లు పేర్కొంది. అంతేకాకుండా ఖార్కివ్‌లోని ఏవియేష‌న్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకోవ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేశాడు. అయితే ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.

17. అమెరికా జెట్‌లపై చైనా జెండాలు అమర్చి… రష్యాపై బాంబులు వేయండి: ట్రంప్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్‌-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలని అన్నారు. ఆ తర్వాత చైనానే ఆ పని చేసిందని అమెరికా చెప్పాలని, దీంతో రష్యా, చైనా పోట్లాడుకుంటే మనం ఎంచక్కా కూర్చొని చూడవచ్చంటూ హస్యమాడారు. శనివారం జరిగిన రిపబ్లికన్ జాతీయ కమిటీ అగ్ర దాతల సమావేశంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలోని వారంతా నవ్వడంతోపాటు చప్పట్లు కొట్టారు.
Sumy-Ukraine-Indian-Student
18. ఉక్రెయిన్‌కు రూ.76కోట్ల సాయం అందించిన హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత 13 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు ఆస్కార్‌ విజేత, హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో ఆర్థికంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.ఉక్రెయిన్‌కు 10 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.76కోట్లు) విరాళంగా అందజేశారు. ఆయన సహాయం అందించడం వెనుక పెద్ద కారణమే ఉంది. లియోనార్డో అమ్మమ్మ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాకు చెందిన వారు. ఆమె అంటే హాలీవుడ్‌ స్టార్‌కు ఎంతో ఇష్టం. ఆమె 2008లో మరణించారు. ఆమె స్వస్థలమైన ఒడెస్సా నగరంపై ప్రస్తుతం రష్యన్‌ సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నది.ఈ సందర్భంగా డికాప్రియో ఒడెస్సాలో తన అమ్మమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. టాటైనిక్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా లియోనార్డో డికాప్రియో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో కేట్‌ విన్సెస్లెట్‌ హీరోయిన్‌గా నటించింది. టైటానిక్‌తో పాటు డికాప్రియో బ్లడ్ డైమండ్, ది ఏవియేటర్, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, ది రెవెనెంట్, ఇన్‌సెప్షన్ వంటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.ఇదిలా ఉండగా.. లియోనార్డో తాతలు రష్యా, జర్మనీకి చెందిన వారు. లియోనార్డో ఆయన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆయన లీగల్‌ సెక్రెటరీ కాగా.. తండ్రి కామిక్‌ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌, లియోనార్డోకు ఏడాది వయసు ఉన్న సమయంలో తల్లిదండ్రులిద్దరు విడాకులు తీసుకున్నారు.

19. ఉక్రెయిన్లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. బాంబులతో దాడులు చేస్తోంది. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన లక్షిత దాడుల్లో 10 మంది పౌరులు మరణించారు. రెండు ఆయిల్ డిపోలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. పలు నగరాల్లోని విదేశీయులను తరలించేందుకు మానవతాసాయం కోసం రష్యా కాల్పులవిరమణ ప్రకటించినప్పటికీ… బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. జైటోమిర్ నగరాల్లోని ఆయిల్ డిపోలపై రష్యా వైమానిక దళాలు దాడులు చేశాయి. దీంతో రెండు డిపోల నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది
uk
20. ఆ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం
ఉక్రెయిన్లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రారంభమైంది. వీరంతా బస్సుల్లో సురక్షిత ప్రాంతానికి బయల్దేరారు. పోల్టావా అనే ప్రాంతానికి వెళ్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.ఉక్రెయిన్లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు ఊరట లభించింది. ఆ విద్యార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న అన్షద్ అలీ అనే వ్యక్తి వెల్లడించారు.కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులు పోల్టావాకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నుంచి సోమవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 694 మంది విద్యార్థులు సుమీలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా బస్సుల్లో బయలుదేరారని చెప్పారు.
పౌరుల తరలింపు అంశానికి భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విషయంపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఉక్రెయిన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
uk1