DailyDose

ఏపీ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ హైకోర్టులో పిటిషన్ -TNI నేర వార్తలు

ఏపీ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ హైకోర్టులో పిటిషన్   -TNI నేర వార్తలు

* ఏపీ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎఫ్ఆటర్ వివరాలను వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్లుప జరుగుతున్నాయని పిటిషన్లోర పేర్కొన్నారు. పిటిషన్పైో న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. 167 సీఆర్పీరసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఉమేష్చం్ద్ర వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండానే రిమాండ్ విధించడం హక్కులను భంగపర్చడమేనని, అభియోగాల వివరాలు నిందితలను తెలియజేకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఏపీలో ఇష్టారీతిన రిమాండ్లుర విధించడం కుదరదని హైకోర్టు తెలిపింది. దిగువ స్థాయి జడ్జిలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దిగువ కోర్టుల మెజిస్ట్రేట్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని, ఎఫ్ఐ ఆర్ నమోదైన 24 గంటల్లో అప్లోలడ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఎలాపడితే అలా కేసులు పెడితే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. విచక్షణ లేకుండా రిమాండ్కు్ ఆదేశిస్తే బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలని హైకోర్టు పేర్కొంది.

* నెల్లూరు లాయల్‌ టెక్స్‌ టైల్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం
నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజిన్లు వచ్చినప్పటికీ మంటలు ఆర్పేందుకు చాలా సమయం తీసుకున్నారు. దాంతో పెద్ద మొత్తంలో వస్త్రాలు, యంత్రాలు బూడిదైపోయాయి. ఈ ఘటప నాయుడుపేట మండలం మేనకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుననది.అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేనకూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో లాయల్‌ వస్త్ర తయారీ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ ఇంచార్జి అధికారి చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. పరిశ్రమలోని పత్తి గోదాంతోపాటు వస్త్రాలు నిల్వచేసి గోదాముల్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. సీఐ సోమయ్య, ఎస్‌ఐలు రాత్రంతా సహాయక చర్యల్లో మునిగిపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

* ఆ అమ్మాయి వివాహం గురించి ఎన్నో కలలు కంది. తనకు కాబోయే భాగస్వామి దొరికాడని సంతోషించింది. అయితే సప్తపదిని పలికేందుకు కొన్ని గంటల సమయం ముందు వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయి పెళ్లిమండపంలో విషాదం నెలకుంది. సంఘటన చెన్నై నగర పరిధిలోని తాంబరంలో జరిగింది. వరుడిది చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లె. దీంతో తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు

* త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి హత్య జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోనే మృతుడి నివాసం ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

* గుంటూరుజిల్లాలో భారీ దారి దోపిడీ జరిగింది. ముగ్గురు వ్యాపారుల దృష్టి మరల్చి రూ. లక్షలు ఎత్తుకుపోయారు. దాచేపల్లి మండలంనడికుడి రైల్వే జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై వెళ్లేందుకు ముగ్గురు వ్యాపారులు నడికుడి రైల్వే జంక్షన్ వద్దకు వచ్చారు. పోలీసులు పిలుస్తున్నారంటూ కొందరు వ్యక్తులు వారికి మాయమాటలు చెప్పారు. వ్యాపారుల దగ్గరున్న రెండు బ్యాగుల్లోని రూ. లక్షలు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఒంగోలులో డ్రగ్స్‌ దందా
చెన్నైలో తీగ లాగితే.. ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది. ఒంగోలులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై సోమవారం రాత్రి చెన్నై పోలీసులు దాడిచేసి ఈ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. దీంతో అక్కడ నిషేధిత మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ని గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకొచ్చింది. సోమవారం రాత్రి చెన్నై నుంచి వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నేరుగా పారిశ్రామిక వాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తీసుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే కోణంలో వారిని విచారించగా.. ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. మత్తుపదార్థాలు బయటపడిన కేంద్రంలో రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ నిర్వహించేవాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని చెబుతున్న విజయ్‌, వెంకటరెడ్డి అనే వ్యక్తులు దీన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ తయారుచేసి చెన్నైతోపాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.

* కేరళ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వర్కలా పట్టణంలోని దలవపురం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. భవనంలో నివాసముంటున్న ప్రతాపన్(62), షెర్లీ (53), అభిరామి (25), అఖిల్ (29), అభిరామి ఎనిమిది నెలల కుమారుడు రియాన్‌లు మంటల్లో కాలి మరణించారు.ఇంటి యజమాని ప్రతాపన్ కూరగాయలు వ్యాపారి.ఇతను గత కొంతకాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.తీవ్ర గాయాలపాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిహుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
*మణుగూరు ప్రాంతంలోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(బీటీపీఎస్‌)లోని 3, 4 కూలింగ్‌ టవర్లకు సంబంధించిన యాసిడ్‌ బాక్స్‌కు రంగులు వేస్తుండగా.. ప్రమాదవశాత్తు యాసిడ్‌లీకై కార్మికుడి తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

* మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు కోర్టు నాలుగు రోజులు కస్టడీ విధించింది. రేపటి నుంచి 13 వరకూ పోలీస్ కస్టడీకి మేడ్చల్ కోర్ట్ అనుమతించింది. నిందితులను కస్టడీకి ముందు, కస్టడీ ముగిసిన తరువాత వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం తెలిపింది. కస్టడీ విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేయాలని ఆదేశించింది. వీడియో రికార్డింగ్ మొత్తం కోర్టుకి సమర్పించాలని తెలిపింది. ఈ కేసులో సీజ్ చేసిన ఆయుధాలు, ప్రాపర్టీని కోర్టుకి సమర్పించాలని సూచించింది. కస్టడీలోకి తీసుకున్న తరువాత నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని కోర్టు ఆదేశించింది.

* విదార్థులతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ట్యూషన్‌ టీచర్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా..రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సాల్మన్‌ రాజు పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్‌ వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్‌ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్‌ సెంటర్‌ నిర్వాహకుడు సాల్మన్‌ రాజును నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

* నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజిన్లు వచ్చినప్పటికీ మంటలు ఆర్పేందుకు చాలా సమయం తీసుకున్నారు. దాంతో పెద్ద మొత్తంలో వస్త్రాలు, యంత్రాలు బూడిదైపోయాయి. ఈ ఘటప నాయుడుపేట మండలం మేనకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని లాయల్ టెక్స్‌ టైల్స్ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుననది.

మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగి 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. గుంటూరు జిల్లాలోని కురిచేడు రైల్వే స్టేషన్ నుంచి గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ మెయింటినెన్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న నల్ల ప్రశాంత్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విశాఖ నగరంలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు.

*విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గవర్నర్ బంగ్లా వెనక పందిమెట్ట ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పితానిదిబ్బకు చెందిన కాగితం ప్రసాద్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కలిసి తలపై రాళ్లతో బలంగా కొట్టి చంపారు. పట్టపగలే ఈ ఘటన జరగడంతో అటుగా వెళ్తున్న వారు చూసి నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడవ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం

*కృష్ణాజిల్లా పామర్రు గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలి కాలువ గట్టుపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు కుటుంబాలకు చెందిన నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సమీప ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. ప్రమాదంలో సుమారు ఐదు లక్షల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటు బాధిత కుటుంబాలు విన్నవించుకుంటున్నాయి.

*శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతం మేనకూరు సెజ్‌లోని లాయల్‌ టెక్స్‌టైల్‌ కర్మాగారంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా. కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులంతా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. కర్మాగారంలోని దూది, వస్త్ర గోదాములకు మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందో లేదా మరేదైనా కారణం ఉందో తెలియాల్సి ఉందని యాజమాన్యం తెలిపింది.

*చెన్నైలో తీగ లాగితే.. ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది. ఒంగోలులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై సోమవారం రాత్రి చెన్నై పోలీసులు దాడిచేసి ఈ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. దీంతో అక్కడ నిషేధిత మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ని గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకొచ్చింది. సోమవారం రాత్రి చెన్నై నుంచి వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నేరుగా పారిశ్రామిక వాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తీసుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే కోణంలో వారిని విచారించగా.. ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. మత్తుపదార్థాలు బయటపడిన కేంద్రంలో రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ నిర్వహించేవాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని చెబుతున్న విజయ్‌, వెంకటరెడ్డి అనే వ్యక్తులు దీన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ తయారుచేసి చెన్నైతోపాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.