Politics

ఓట్ల చీలిక‌తోనే గోవాలో కాంగ్రెస్‌కు ఆశించిన స్ధానాలు ద‌క్క‌లేదు – TNI రాజకీయం

ఓట్ల చీలిక‌తోనే గోవాలో కాంగ్రెస్‌కు ఆశించిన స్ధానాలు ద‌క్క‌లేదు –  TNI  రాజకీయం

* గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మిపై ఆ పార్టీ నేత‌లు స్పందించారు.విప‌క్షాల మ‌ధ్య ఓట్ల చీలిక‌తోనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధానాలు ద‌క్క‌లేద‌ని సీనియ‌ర్ నేత పీ చిదంబ‌రం పేర్కొన్నారు. బీజేపీ కేవ‌లం 33 శాతం పైచిలుకు ఓట్ల‌తోనే విజ‌యం సాధించింద‌ని, మిగిలిన పార్టీల మ‌ధ్య ఓట్ల చీలిక‌తో త‌మ పార్టీ వెనుక‌ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. గోవాలో మొత్తం 40 స్ధానాల‌కు గాను బీజేపీ 20 స్ధానాల్లో కాంగ్రెస్ 11 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా ఆప్ 2 స్ధానాల్లో, టీఎంసీ 2 స్ధానాల్లో ఇత‌రులు 5 స్ధానాల్లో ముందంజ‌లో ఉన్నారు.గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ స్వ‌ల్ప ఆధిక్యంతో విజ‌యం సాధించారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ప‌ట్ల సీఎం ప్ర‌మోద్ సీఎం సంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీ ప్ర‌చారం కోసం తాను రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ సొంత నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద‌గా దృష్టి సారించ‌లేక‌పోయాన‌ని చెప్పారు. త‌న త‌ర‌పున పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారం చేప‌ట్టార‌ని తాను స్వ‌ల్ప తేడాతో గెలుపొందాన‌ని అన్నారు.తాను త‌క్కువ మెజారిటీతో బ‌య‌ట‌ప‌డినా పార్టీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించ‌డం గొప్ప విష‌య‌మ‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌కు 20 స్ధానాలు ల‌భించాయ‌ని, మ‌రో ముగ్గ‌రు బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకొచ్చార‌ని చెప్పారు. మ‌రోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తికూల ఫలితాలు ఎదుర‌య్యాయి. పంజాబ్‌లో అధికారం కోల్పోయిన ఆ పార్టీ మిగిలిన రాష్ట్రాల్లోనూ పేల‌వ‌మైన ఫ‌లితాలు సాధించింది.

* అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. 37 ఏళ్ల తరువాత యూపీలో వరుసగా రెండవ సారి ఒకే పార్టీ అధికారంలోకి రావడం గొప్ప విషయమన్నారు. ఆ ఘనత సీఎం యోగి ఆదిత్యనాధ్, ప్రధాని మోదీల సమర్థ పాలన ఫలితమేనన్నారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడిన వారికి ఓటమి తప్పలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారకులైన నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా సుజనా చౌదరి అభినందనలు తెలిపారు.

*కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మైన ఫ‌లితాల‌ను గాంధీ కుటుంబం తేలేదు : అశ్వ‌నీ కుమార్‌
కాంగ్రెస్ మేలుకోవాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అశ్వ‌నీ కుమార్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వ‌చ్చిన ఎన్నిక‌లు చాలా ప‌రిణామాత్మ‌క ఎన్నిక‌ల‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇక‌.. కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మైన ఫ‌లితాల‌ను గాంధీ కుటుంబం తీసుకురాలేద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీకి జ‌వస‌త్వాలు నింప‌డం వారితో కుద‌ర‌ద‌ని అశ్వ‌నీ కుమార్‌ పేర్కొన్నారు. తాను ఇప్ప‌టికీ సోనియా గాంధీ విధేయుడినేన‌ని త‌న‌కు తాను ప్ర‌క‌టించుకున్నారు. ఈ ఫ‌లితాల‌ను చూసి కాంగ్రెస్ ప‌ట్ల జాలిప‌డుతున్నాన‌ని ఎద్దేవా చేశారు. గ‌త మూడు నెల‌లుగా పంజాబ్‌లో స‌ర్కస్ న‌డుస్తోంద‌ని, రాజ‌కీయాలు దిగ‌జారుతున్నాయ‌ని అశ్వ‌నీ కుమార్ పేర్కొన్నారు.

* కోర్టులో కేసులు వేయించి సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకుంటున్నారు: జగన్
గ‌వ‌ర్నర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపుమంటన్నారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పురమాయించి గవర్నర్‌పైకి పంపారని ఆరోపించారు. ఆయ‌న కొడుకు ద‌గ్గరుండి ఈ ప‌నిచేయించారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీకి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తువ‌చ్చే ఒక్క స్కీం ఉందా? అని ప్రశ్నించారు. కేవ‌లం వెన్నుపోటు అనే స్కీం త‌ప్ప మరేమీ లేదన్నారు. ఈ చ‌ర్చ చేయ‌లేకే గ‌వర్నర్ ప్రసంగ పత్రాన్ని చించేశారని చెప్పారు. చట్టసభలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే చంద్రబాబు సంతోషపడతారని అన్నారు. కోర్టులో కేసులు వేయించి సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ను చంద్రబాబే దోచుకున్నారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు క‌మ్యూనిస్టులు తానా తందాన అంటారని అన్నారు.

*బీజేపీ విజయం.. ప్రజా విజయం: సోము వీర్రాజు
యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది. దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. బీజేపీ విజయఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు సంబరాలలో పాల్గొన్నారు. రాజధాని రైతులు… సోము వీర్రాజును‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విజయం.. ప్రజా విజయమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.

*దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషికి ఈ ఎన్నికలే నిదర్శనం: Kanna
దేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషికి నాలుగు రాష్ట్రాల ఎన్నికలే నిదర్శనమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం కొత్త చరిత్రన్నారు. మోదీ, యోగి డబుల్ ఇంజిన్ మాదిరిగా యూపీ అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. అవినీతి రహిత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మోదీ చేస్తున్న కృషికి ప్రజలు వెన్నంటి నిలిచారన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఫలితాలపై ఆలోచించాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలు పెట్టుబడి పెట్టి అధికారంలోకి రావటం తప్ప ప్రజలకు ఏమీ చేయటం లేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

*వినుకొండ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుత్నాడు: జీవీ
వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టించి ఆనందం పొందుతున్నాడన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని జీవీ పేర్కొన్నారు. ఈపూరులో వైసీపీ కార్యకర్తలు అత్యాచారాలకు పాల్పడితే చర్యలు శూన్యమన్నారు. ఎమ్మెల్యే బొల్లా ఆగడాలకు ప్రజలు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధంగా ఉన్నారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

*ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం: రాహుల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నామని అన్నారు. గెలిచిన వారందికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం అంకిత భావంతో, కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వలంటీర్లందరికీ ఒక ట్వీట్‌లో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌‌తో పాటు గోవాలోనూ బీజేపీ మరోసారి హవా కొనసాగించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

*తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: సంజయ్‌
యోగి సంక్షేమ పాలన చూసే ప్రజలు ఓటేశారని బీజేపీ నేత బండి సంజయ్‌ తెలిపారు. యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది. దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. బీజేపీ విజయఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాసంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారు. కేంద్రానికి టీఆర్ఎస్‌ ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర నిధులను వాడుకోవడం లేదని తప్పుబట్టారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని సంజయ్‌ జోస్యం చెప్పారు.

*ఎమ్మెల్యే బొల్లా ఆగడాలుకు ప్రజలు అడ్డుకట్ట వేస్తారు: టీడీపీ నేత
వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొల్లా ఆగడాలుకు ప్రజలు అడ్డుకట్ట వేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

*ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం: రాహుల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నామని అన్నారు. గెలిచిన వారందికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం అంకిత భావంతో, కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వలంటీర్లందరికీ ఒక ట్వీట్‌లో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌‌తో పాటు గోవాలోనూ బీజేపీ మరోసారి హవా కొనసాగించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

*కులాంత‌ర వివాహాల‌కు కూడా క‌ల్యాణ‌ల‌క్ష్మి : మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
తెలంగాణ‌లో కులాంత‌ర వివాహాల‌కు కూడా క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు అమ‌లు చేసి, చెక్‌లు అందిస్తున్నామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ రెండు ప‌థ‌కాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. కులాంత‌ర వివాహాల‌కు ఇబ్బంది లేదు. భార్య బీసీ, భ‌ర్త ఓసీ అయిన‌ప్ప‌టికీ చెక్‌లు ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో ఎలాంటి అబ్జెక్ష‌న్ లేదు. ఒక వేళ ఎక్క‌డైనా స‌మ‌స్య ఎదురైతే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని స‌భ్యుల‌కు మంత్రి సూచించారు. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న వారి విష‌యానికి వ‌స్తే.. త‌ల్లికి లేదా బిడ్డ‌కు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.ఈ ప‌ది రోజుల్లో సుమారు 12 వేల మంది ల‌బ్ధిదారుల‌కు చెక్‌లు అందాయి. కొంత మంది పెళ్లి చేసుకున్న త‌ర్వాత మూడు నాలుగు నెల‌ల‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటున్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో త‌నిఖీ త‌ర్వాత చెక్‌లు అందిస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కాల‌కు నిధుల కొర‌త లేదు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప‌దిహేను రోజుల‌కే చెక్కులు ఇస్తున్నామ‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు పెట్టించే బాధ్య‌త స‌ర్పంచ్‌లు, కౌన్సిల‌ర్లు తీసుకోవాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సూచించారు.

*ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డే విధంగా ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
స‌ర‌ళా సాగ‌ర్, కోయిల్ సాగ‌ర్ ప్రాజెక్టుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్‌‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డే విధంగా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వ‌ద్ద ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ రెండు ప్రాజెక్టుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాల‌ని స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చారు.

*రాజీనామా చేసేందుకు చండీఘడ్ వచ్చిన సీఎం చన్నీ
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరో ఓటమి పాలవడంతో ఆ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేయనున్నారు. తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తుండటంతో చన్నీ రాజీనామా చేసేందుకు గురువారం చండీఘడ్ నగరంలోని తన అధికార నివాసానికి వచ్చారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ గురువారం మధ్యాహ్నం పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశముందని అధికారులు చెప్పారు

* రేపు అగ్రి కమిషనరేట్‌ ముట్టడి: కిసాన్‌ మోర్చా
రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూ అదే రైతును మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరు మొదలుకొని ఎరువుల సరఫరా వరకూ అన్నింటా విఫలమైన జగన్‌ ప్రభుత్వం కేంద్రం రైతులకు ఇచ్చిన నిధులు తీసుకుని రాష్ట్రంలో అన్నదాతలకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసరిస్తూ ఈ నెల 9న గుంటూరులోని వ్యవసాయ కమిషనరేట్‌ను ముట్టడిస్తున్నట్లు చెప్పారు. సోము వీర్రాజు, సీఎం రమేశ్‌, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.