DailyDose

నోరి దత్తాత్రేయుడు జీవితం ఆదర్శం

నోరి దత్తాత్రేయుడు జీవితం ఆదర్శం

జన్మభూమిని..అమ్మ భాషను మరువని మహనీయులు నోరి..
విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు జీవితం ఆదర్శమనీ.. వారి జీవితాన్ని నేటి యువత అధ్యయనం చేసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.అవనిగడ్డ గాంధీక్షేత్రంలో విశ్వవిఖ్యాత వైద్య శిఖామణి, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ను ప్రదానం చేశారు. సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. దత్తాత్రేయుడు జీవితం వడ్డించిన విస్తరి కాదనీ..కృషి ఉంటే మనుషులు ఋషులవుతాలు..తరతరాలుగా తరగని వెలుగవుతారన్న వేటూరి పాటకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. జన్మభూమిని..తల్లిభాషను మరువని మహనీయులు దత్తాత్రేయుడు అని కొనియాడారు. దత్తాత్రేయుడు దివిసీమ రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది క్యాన్సర్ రోగులు వారి చికిత్సతో పునరుజ్జీవం పొందారని చెప్పారు. సత్పురుషుల సందర్శనతో గొప్పవారవుతరనీ..వారి నుంచీ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని యువతకు తెలిపారు. బసవతారకం కోరిక మేరకు ఎన్టీఆర్ సూచనతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి దత్తాత్రేయుడు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ సంచాలకులు డాక్టర్ రఘునందనరావు, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సహస్రావదాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, బెల్ కంపెనీ అడిషనల్ జీఎం దోనేపూడి రవిప్రసాద్ లు ప్రసంగించారు. సైకత శిల్పాన్ని తయారుచేసిన ఆకునూరి బాలాజీ వరప్రసాద్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
Whats-App-Image-2022-03-13-at-23-08-46-2
Whats-App-Image-2022-03-13-at-23-08-46