DailyDose

ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ – నేటి నేర వార్తలు

ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ – నేటి నేర వార్తలు

*పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజనల్ ఉప ఖజానా కార్యాలయం పై ఏసీబీ దాడులు వడుగు సాయి శ్రీనివాసరావు సీనియర్ అకౌంటెంట్.. డివిజనల్ సబ్ ట్రెజరీ ఆఫీస్. ఏలూరు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డీ. కృష్ణంరాజు గారి ఉత్తర్వులు మేరకు ఫిర్యాది అయినా ఎండీ.రెహ్మాన్ షరీఫ్ గారి వద్ద పెన్షన్ బెనిఫిట్స్ బిల్స్ చేయుటకు గాను 50000 /-రూపాయలు లంచంగా తిసుకొనగ ఏలూరు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు… ఈ కేసు దర్యాప్తులో డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ గారు సిఐలు శ్రీనివాసు, భాస్కర్, ఏసుబాబు మరియు నాగేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
*గుర్తుతెలియని వాహనం ఢీకొని మగ్గం పనిచేసే కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఎస్ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.
*తెలంగాణ మద్యాన్ని కావలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తెలంగాణ మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 20 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు వాటి విలువ 18,000 రూపాయల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు.
*మెదక్: జిల్లాలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పులి గుట్టతండాలో విషాదం చోటు చేసుకుంది. దశరథ్ అనే రైతు అప్పుల బాధ భరించలేక వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో పాటు పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలం కడపల్లి దగ్గర కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టెంపో వాహనం-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
*విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు మృతిద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్‌ పాఠశాల బస్సువిజయనగరం: తెర్లాం మండలం టెక్కలివలసలో ప్రమాదంప్రమాదంలో మరో చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
*ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్‌ హతమయ్యారని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొర్లి – ముతేలి గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల సంయుక్త బృందం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్‌రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ పేర్కొన్నారు. కాల్పుల్లో కాటే కల్యాణ్‌ ఏరియా దంతెవాడ, సుక్మా జిల్లాల పరిధిలోని ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల సంచారంపై పక్కా సమాచారం అందడంతో డీజీఆర్‌, సీఆర్‌ఎఫ్‌ 230వ బెటాలియన్‌, సీఎఆపీఎఫ్‌ స్క్వాడ్‌ బృందాలు అక్కడికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు.
*మహబూబాబాద్: జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయట పడనీయకుండా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రహస్యంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. తల్లితండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా వైద్య పరీక్షలు చేయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
*అనంతపురం: జిల్లాలోని సెట్టూరు మండలం బొచ్చు పల్లిలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. వేరుశనగ పంట కాపలాకు వెళ్లిన రమేష్‌పై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో రమేష్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేస్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం తరలించారు.
*మితిమీరిన వేగం.. నిద్రమత్తు.. ఐదుగురి ప్రాణాలను బలికొంది. చిన్నారి అన్నప్రాసం కోసం బయల్దేరిన ఆ కుటుంబం అనంతలోకాలకు చేరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద.. కల్వర్టును కారు వేగంగా ఢీకొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మున్సిపల్ ఉద్యోగి కుటుంబ సభ్యులు చనిపోయారు.
*హనుమకొండ నగరంలోని భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో మాదం లింగయ్య సంబంధించిన 21 గొర్రెలు మృతి చెందాయి. కుక్కల దాడిలో అన్ని గొర్రెలు చనిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. గ్రామం నుంచి పిచ్చికుక్కలను తరిమికొట్టాలని గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య తలపై బండరాయితో మోది హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరి ఇందిరమ్మ కాలనీలో సోమవారం జరిగింది. వెంకటగిరి గ్రామం పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపంగి చిన్నరాములు, సంపంగి కళావతి (35) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నరాములు మద్యానికి బానిసై రోజూ భార్యను కొడుతూ ఉన్నాడు. సోమవారం సాయంత్రం కూడా మద్యం తాగివచ్చిన చిన్న రాములు భార్యతో గొడవపడి కళావతి తలపై బండరాయితో మోదాడు. దీంతో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*తొండంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెండపూడి హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తుల మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ పిఠాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవి సోమవారం తీర్పు వెలువరించినట్టు తొండంగి ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపారు. 2018లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారన్నారు. అప్పటి ఎస్‌ఐ కృష్ణమాచారి ప్రమాదానికి కారణమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ చందన గిరిని అరెస్టు చేసి రిమాండుకు పంపారన్నారు. కేసు విచారణ అనంతరం సీఐ చెన్నకేశవరావు చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం గిరికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరపున డి.కిరణ్‌ కేసు వాదించారు.
*వివాహితతో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురుపై కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. కొత్తబట్టలు, చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది.
*కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లోనే నిందితులైన పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామని దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు.