DailyDose

ఎంఎల్ఏలకు జగన్ క్లాస్ – TNI తాజా వార్తలు

ఎంఎల్ఏలకు జగన్ క్లాస్ – TNI తాజా వార్తలు

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్‌ సూచించిన పలు మార్గనిర్దేశకాలు..ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌. ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్‌. క్యాడర్‌ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం. బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి
బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌. ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం. కొత్త జిల్లాల వారీగా రీజినల్‌ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం . జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్‌ . మంత్రివర్గాన్ని కూడా పునర్‌ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్.
*రాజధాని అమరావతి లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రారంభమైన అమరావతి ప్రజా బాట. నేడు రాజధాని నిడమర్రు గ్రామంలో ప్రజా బాట ను ప్రారంభించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు గుంటూరు జిల్లా కార్యదర్శి రామారావు రాజధాని కమిటీ కార్యదర్శి రవి తదితరులు
*ఈ కార్యక్రమంలో భాగంగా నిడమర్రు లో వివిధ ప్రాంతాల్లో ప్రజల తో మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకున్నారు
నిర్మాణమై వృధాగా పడి ఉన్న టీడ్కో గృహాలనుసందర్శించారు నిడమర్రు చెరువు కట్ట వద్ద ఇల్లు తొలగించాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని బాధితులు నేతలకు తెలిపారు వాలంటీర్ ఉద్యోగం పేరుతో ఐదు వేలు జీతం ఇస్తూ 2500 పెన్షన్ రద్దు చేయటం దుర్మార్గమని బాధితులు వాపోయారు రాజధాని పెన్షన్ పెంచకపోవడం, మల్లె తోట ల లో పని లేక ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దళితులకు ఉచిత విద్యుత్ సక్రమంగా అమలు జరగడం లేదని,
కౌలు రైతులను పట్టించుకునే దిక్కే లేదని, డ్వాక్రాగ్రూపులోని సభ్యులకు ఇన్సూరెన్స్ పేరుతో వేల రూపాయలు కట్ చేస్తున్నారని పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు ఈనెల 21వ తేదీన తుళ్లూరులో జరిగే మహాధర్నాలో పాల్గొని సమస్యలపై ఎలుగెత్తి చాటాలి అని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ నెల 19వ తేదీ వరకు ప్రజా బాట కార్యక్రమం కొనసాగుతోంది
*విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టులో విచారణ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం బకాయిలు చెల్లించాలని ఆదేశం సౌర, పవన విద్యుత్ ఒప్పందాల ప్రకారం బకాయిలు చెల్లించాలని ఆదేశం పీపీఏలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి లేదని హైకోర్టు స్పష్టీకరణ పీపీఏల ప్రకారం బకాయిలను 6 వారాల్లోగా చెల్లించాలని తేల్చి చెప్పిన హైకోర్టు
ఏపీఈఆర్‌సీ ముందున్న పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
*తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు షాక్ ప్రభుత్వ సిబ్బంది కార్యాలయ పనివేళల్లో వ్యక్తిగత ఫోన్లు వాడవద్దని ఆదేశం
*వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని.. సీబీఐ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. సీబీఐ దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
* ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా దేశీయ మార్కెట్లోకి 2022 టయోటా గ్లాంజాను లాంచ్ చేసింది. భారత్‌లోని టయోటా కార్లలో 2022 టయోటా గ్లాంజా అత్యంత సరసమైన ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని కంపెనీ ప్రకటించింది.
*ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం బిల్లులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. ఆరు వారాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. బిల్లులను తగ్గించి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు కొట్టేవేసింది. పీపీఏలకు వ్యతిరేకంగా ఏపీఈఆర్సీలో ప్రభుత్వం వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. స్టేట్‌లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్ వేసిన పిటీషన్లను కూడా కొట్టేసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేసింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సుమారు రూ.20 వేల కోట్లను ఏపీ బకాయిలు పడింది.
*టీడీపీ ఆందోళన దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం జంగారెడ్డిగూడెం వరుస మరణాలకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై 10 FIRలు నమోదు నాటుసారా అక్రమంగా నిల్వ చేసినందుకు పది కేసులు నమోదు
మరో మూడు కేసులు అనుమానాస్పద మృతిపై నమోదు నాటుసారా సేవించడంతో తన భర్త మరణించాడని మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మరో మూడు కేసులు నమోదు
*పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు నగరంలో డివిజనల్ ట్రెజరీ ఆఫీసు కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు.కార్యాలయంలో లో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ ట్రాప్ కు చిక్కిన వైనం కొనసాగుతున్న సోదాలు
*‘కశ్మీర్ ఫైల్స్’ చలన చిత్రం అందరూ చూడదగినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలను ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను చూడాలని చెప్పారు. ఇది చాలా మంది చిత్రమని, ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చాలా మంది చలన చిత్రం. మీరంతా దీనిని చూడాలి. ఇటువంటి చిలన చిత్రాలు మరిన్ని రావాలి’’ అని మోదీ అన్నారు. ఈ సినిమా మార్చి 11న విడుదలైంది. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. 1990వ దశకంలో కశ్మీరు నుంచి హిందువులు వెళ్లిపోవడానికి దారి తీసిన పరిస్థితులను దీనిలో వివరించారు
*రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరం నుంచి 2060 మధ్య వివిధ సంస్థలకు రూ.2,18,831 కోట్ల అప్పును చెల్లించాల్సి ఉంటుందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.2,41,395 కోట్ల రుణం తీసుకుందని తెలిపారు. అప్పులపై కాంగ్రెస్‌ సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు (డీమ్డ్‌ టు బీ ఆన్సర్డ్‌)గా స్పీకర్‌ ప్రకటించారు. మంత్రి లిఖితపూర్వకంగా సభకు వివరాలు అందజేశారు. 2024 నుంచి 2060 మధ్యలో 9 సంవత్సరాలను మినహాయించి చెల్లించాల్సిన అప్పుల వివరాలను వెల్లడించారు. 2024లో రూ.5,600 కోట్లు, చివరగా 2060లో రూ.5,765 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. 2026లో అత్యధికంగా రూ.20 వేలకోట్లు, 2027లో రూ.18,585.98 కోట్లు, 2050లో రూ.18,572.80 కోట్లు కట్టాలి. 2014-15లో రూ.9,580 కోట్లు, 2015-16లో రూ.17,385 కోట్లు, 2016-17లో రూ.32,731 కోట్లు, 2017-18లో రూ.26,139 కోట్లు, 2018-19లో రూ.29,139 కోట్లు, 2019-20లో రూ.38,286 కోట్లు, 2020-21లో రూ.44,394 కోట్లు, 2021-22లో ఫిబ్రవరినాటికి రూ.43,648 కోట్లను ప్రభుత్వం తీసుకుందన్నారు
*వనపర్తి జేఎన్టీయూలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ సమావేశం హాల్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తిలో కొత్తగా జేఎన్టీయూ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలో దీనిని నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమయ్యే తరగతి గదుల ఏర్పాటును పరిశీలించడం కోసం అధికారుల బృందం పర్యటించనుంది. అలాగే ఈ కాలేజీకి అవసరమైన భవన సముదాయాన్ని నిర్మించాలని అధికారులతో కలిసి నిరంజన్‌రెడ్డి నిర్ణయించారు
*ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు డైట్‌శానిటేషన్‌ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పించడంపై దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ)హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దళితుల సాధికారత కోసం ఆలోచిస్తూ దళిత బందును ప్రవేశపెట్టిన కేసీఆర్‌ సర్కారు.. తాజాగా డైట్‌ శానిటేషన్‌ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్‌ కల్పించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొంది. అర్హులకు శిక్షణ ఇస్తామని డిక్కీ నేషనల్‌ ప్రెసిడెంట్‌ నర్రా రవికుమార్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ దాసరి అరుణ సౌత్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కిరణ్‌ చంటి తదితరులు ఆ ప్రకటనలో తెలిపారు
*మహబూబాబాద్‌ జిల్లాలో కొంతకాలంగా వరుసగా జరుగుతున్న మిర్చి రైతుల ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక ల ప్రతినిధులు క్షేత్రపర్యటన చేశారు. రెండు నెలల వ్యవధిలో 20 మంది రైతులు ఒకే జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవటంతో కారణాలు తెలుసుకోవటానికి మహబూబాబాద్‌, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో పర్యటించారు. 12 కుటుంబాలను కలిసి వివరాలు సేకరించినట్లు రైతుస్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్‌రెడ్డి తెలిపారు. ఒక్కో కుటుంబానికి సగటున రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిపారు. వారి ప్రైవేటు, బ్యాంకు అప్పులను వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ చేయించి రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
*శ్రీనగర్‌, లేహ్‌, లడ్ఢాఖ్‌ను సందర్శించాలన్నది దక్షిణ భారతీయులకు కల ఉండేదని, ఆర్టికల్‌ 370 రద్దు చేసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఆ కలను నిజం చేశారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన జీవితంకాలంలో ఎప్పుడూ కశ్మీర్‌కు వెళ్లలేదని రెండు నెలల క్రితం పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం అక్కడికి వెళ్లానని తెలిపారు. చాలా అద్భుతంగా ఉందనికశ్మీర్‌ను సందర్శించాలని చాలా మందికి చెబుతున్నానని అన్నారు. జమ్ము కశ్మీర్‌ అదనపు పద్దులపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొని ఆయన మాట్లాడారు. బడ్జెట్‌ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. జమ్ము కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తోందని ప్రశంసించారు. అలాగే పోలవరం విద్యుత్తు కేంద్రానికి కేవలం కోట్లు కేటాయించారని నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లులో కాంగ్రెస్‌ ప్రత్యేక హోదాను పొందుపర్చని కారణంగా ఆ లోపాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ పనితీరుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రత్యేక హోదా ఉంది కాబట్టి సాధ్యమైంది. కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చినా చట్టంలో చేర్చలేదు. విభజన చట్టం ముసాయిదాను రూపొందించానని జైరాం రమేశ్‌చెప్పుకుంటారు..పేవలంగా రూపొందించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లానే ఈశాన్య రాష్ట్రాలు కూడా కాంగ్రె్‌సకు గుణపాఠం నేర్చించాయని తెలిపారు. అయితేముసాయిదా రూపొదించానని తాను ఎప్పుడూ చెప్పలేదని జైరాంరమేశ్‌ అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విజయసాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
*ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి సెక్టార్‌ ఏ సోమవరం తూర్పు బొగ్గు గనులను విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు లేదా రాష్ట్రంలోని ఇతర ప్లాంట్లకు కేటాయించే ప్రతిపాదనలు లేవని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ గనులను వేలానికి ఉంచామని పేర్కొన్నారు. కాగావిశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి తగ్గిందని దిగుమతి చేసుకునే కోకింగ్‌ బొగ్గు లభ్యత తగ్గిపోవడంధరల పెరుగుదల కారణంగా ఉత్పత్తి తగ్గిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఉక్కు శాఖ మంత్రి రాంచంద్ర ప్రసాద్‌ సింగ్‌ చెప్పారు.
*చిన్న చిన్న ఉపగ్రహాలను కారుచౌకగా కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఇస్రో రూపొందిస్తున్న బుల్లి రాకెట్‌ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎ్‌సఎ్‌సఎల్వీ) అందుబాటులోకి వచ్చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌) సోమవారం మధ్యాహ్నం గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీకి నిర్వహించిన చివరిదైన భూస్థిర పరీక్ష సైతం విజయవంతమైంది. దీంతో అంతరిక్ష ప్రయోగాలకు ఈ రాకెట్‌ అందుబాటులోకి వచ్చినట్టయింది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌సఎల్వీ-ఎ్‌సఎస్‌ మోటారు పరీక్ష జరిగింది. షార్‌ డైరెక్టర్‌ రాజరాజ ఆర్ముగంత్రివేండ్రంలోని వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ డి. ఉన్నికృష్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. చివరి దశ పరీక్ష కూడా సక్సెస్‌ కావడంతో ఈ రాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఏడాదికి  నుంచి ప్రయోగాలు చేయాలని ఇస్రో భావిస్తోంది. ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ మూడు ఘన ఇంధన మోటార్లతో (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌పయనించనుంది.జూన్‌ లేదా జులైలో తొలి ఎస్‌ఎ్‌సఎల్వీ-డి ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది.విదేశీ ఉపగ్రహాలను కారుచౌకగా ప్రయోగించేందుకు ఇస్రోకు ఈ రాకెట్‌ ఉపయోగపడనుంది.