DailyDose

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -TNI నేర వార్తలు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -TNI నేర వార్తలు

*నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహాత్యయత్నం. మూడు అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి తీవ్రగాయాలతో నాలుగు గంటలు రోడ్డుపై పడి వున్న విద్యార్థినిని గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది.ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మారడపు హారిక స్వస్థలం రాజమండ్రి.
ఆత్మహత్యయత్నంకు పాల్పడిన హారిక పరిస్థితి విషమం. చేతిపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలింపు. హారిక కు వెన్నెముక, కాళ్ళు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, విచారణ చేపట్టిన పోలీసులు.
*మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కుక్క కాటుకు గేదె, దాని దూడ మరణించడంతో బెంబేలెత్తపోయిన స్థానికులు ఆసుపత్రికి పరుగులు తీశారు. రేబిస్ వ్యాక్సిన్ కావాలంటూ వైద్య సిబ్బంది ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. కుక్క కరవడంతో ఒక గేదె, దూడ మృతి చెందాయనే వార్త స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
*పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం ఉదయం సందర్శించారు. స్వామీజీకి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. స్వామిజీతో పాటు చిన వెంకన్నను ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసు బాబు, కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.
*సిద్దిపేట: జిల్లాలోని దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలమల్లు అనే వ్యక్తి తన తండ్రి మైసయ్యపై గొడ్డలితో దాడి చేసి.. ఆపై తల్లి పోశవ్వ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడు బాలమల్లును అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదలే ఈ ఘాతుకానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
*భార్య ఇంట్లో నుంచి వెళ్లి పోయిందని మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. కుంట్లూర్‌ రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉండే మంచికంటి బంగారురాజు (32) ప్రైవేటు ఉద్యోగి. 24న అతడి భార్య ప్రసన్న ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతడు గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉండే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుప‌తిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ్లి కొడుకు బంధువులు ఈ బ‌స్సులో వ‌స్తున్నారు. బ‌స్సులో పెండ్లి కొడుకు వేణుతోపాటు 50 మంది కూడా ఉన్నార‌ని స‌మాచారం.
*కాప్రా ఎల్లారెడ్డిగూడ సమీపంలోని మల్లికార్జున నగర్‌లో శనివారం వీధి కుక్కలు దాడి చేయడంతో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. పరిసర ప్రాంతాలనుంచి వచ్చిన నెమలి ఇక్కడ రోడ్డుపై గింజలు తింటుండగా వీధికుక్కలు దాడిచేయగా స్థానికులు కుక్కలను వెళ్లగొట్టి నెమలిని కాపాడే ప్రయ త్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన నెమలి కొద్దిసేటి తరువాత మృతిచెందింది. స్థానికులు జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారమందించగా, వారు అటవీశాఖ అధికారులకు నెమలి కళేబరాన్ని అప్పగించారు.
*వివాహేతర సంబంధం అనుమానం పెనుభూతమై ఆలి గొంతు కోశాడు ఓ ఉన్మాది. వెదురుకుప్పం పంచాయతీ సీఆర్‌కండ్రిగ దళితవాడకు చెందిన సౌందర్య(22), సూర్య(28) దంపతులు. సూర్య తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం వుందని అనుమానం. ఆ అనుమానంతో తరచుగా గొడవలు జరిగేవి. ఈ నేపధ్యంలో శనివారం ఉదయం అనుమానం పెనుభూతమై కత్తితో గొంతు వద్ద కోశాడు… అప్పటికీ ఆగక రెండు పోట్లు పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చే సరికి పరారయ్యాడు. చుట్టుపక్కల వారి సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సౌందర్యను రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు వెదురుకుప్పం ఎస్‌ఐ గోపి చెప్పారు.
*శ్రీకాకుళం నగరంలో దీర్ఘాశి కరుణ్‌రాజు (35) అనే యువకుడు శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని జరిగింది ఈ ఘటన. గూనపాలెం ప్రాంతానికి చెందిన దీర్ఘాశి కరుణ్‌రాజు వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులు హరి, భాను, పొట్నూరు రాజులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మరో వార్డు వలంటీరు అయిన సవళపురపు వరప్రసాద్‌ (అబ్బాస్‌), సూరి, దిలీప్‌తో పాటు మరో ముగ్గురు బైక్‌లపై వచ్చారు. వచ్చీరాగానే మాట్లాడుతున్న యువకులపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పదునైనా గొడ్డలితో దాడిచేయడంతో కరుణ్‌రాజు ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయాడు. అతడి తలలో గొడ్డలి ఉండిపోవడంతో రక్తపుమడుగులో రహదారిపై పడిపోయాడు. మిగతా స్నేహితులను పరుగులు పెట్టగా వారిని మరణాయుధాలు, తుపాకీలతో వెంబడించారు. హరి అనే యువకుడు గొడ్డలి వేటుకు తీవ్రగాయాలపాలయ్యాడు. పొట్నూరు రాజులు అనే యువకుడు ప్రాణభయంతో పరుగులు తీసి ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
*ఎర్రచందనం దుంగలను మలేషియా, తైవాన్‌ దేశాలకు తరలిస్తున్న స్మగ్లర్‌తో పాటు మరో ఐదుగురిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. సత్యవేడు మండలం దాసుకుప్పం సచివాలయం వద్ద ఊత్తుకోటకు వెళుతున్న ఒక సుమో, ఒక లారీని తనిఖీ చేయగా రూ. 2కోట్ల విలువైన 145 ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు చెందిన స్మగ్లర్‌ గిరినాయుడు అలియాస్‌ కందేరి నాయుడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన రామకృష్ణన్‌(34), పొన్నుస్వామి(60), చిన్నస్వామి(58), వెల్ల పయ్యన్‌(57), నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వావిలేరుకు చెందిన నెట్టెం శ్రీకాంత్‌(26)లను అరెస్టు చేశారు. గిరినాయుడుపై ఇప్పటికే 40 కేసులున్నాయి.
* శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శ‌నివారం ఉద‌యం క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 255 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 13.63 ల‌క్ష‌ల విలువ చేస్తుంద‌ని అధికారులు పేర్కొన్నారు.
*చిత్తూరు జిల్లాలో భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాద సంఘటన మర్చిపోకముందే మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద ఓ ట్రాక్టర్, టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది
*సీలేరు నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వై.రామవరం మండలం తెలుగు క్యాంప్‌ వద్ద ఘటన జరిగింది.