DailyDose

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి -TNI నేర వార్తలు

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి  -TNI నేర వార్తలు

* మాచారెడ్డి మండలంలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘన్‎పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కరీంనగర్ డిపో వన్‎కు చెందిన ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు రాధాకృష్ణ, కల్పన, సువర్ణ, శ్రీరామ్ గా పోలీసులు గుర్తించారు.
* ఎర్రగొండపాలెం మండలం మురారి పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పనిచేస్తున్న (కసువు ఉడవటం) మహిళ పై బ్లేడుతో దాడి చేసిన భర్త… మహిళా పరిస్థితి విషమం. భార్యపై అనుమానంతో ఈ దాడి చేసినట్లు సమాచారం..
ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ… 24 గంటల వరకు ఏమి చెప్పలేము అంటున్న వైద్యులు..
* యూపీలో బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్న ముస్లిం యువకుడి హత్యపై సీఎం యోగి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నందుకు ఇరుగుపొరుగు వారి చేతిలో హత్యకు గురైన ముస్లిం యువకుడి ఉదంతం సంచలనం రేపింది.ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోపాటు ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించినందుకు బాబర్ అలీ అనే  ఏళ్ల ముస్లిం యువకుడు సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతని పొరుగువారు కొట్టడంతో బాబర్ అలీ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు.
*పామర్రు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గేదె అడ్డం రావడంతో అదుపు తప్పి పక్కనున్న పంట బొదెలో ఆటో బోల్తా పడింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 7గురు ప్రయాణీకులతో ఆటో ఉయ్యూరు నుంచి మచిలీపట్నం వెళుతోంది. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* గుంటూరు.. ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం. గుంటూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలింపు. తరలించే క్రమంలో సృహ తప్పిన మహిళ కానిస్టేబుల్. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆత్మహత్య యత్నం కు కారణాలు పై పోలీసులు విచారణ
* కర్నూలు: జిల్లాలోని నేతాజీ టాకీస్ దగ్గర తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మపేటకు చెందిన దేవసహయం(30), తన మూడేళ్ళ కూతురుతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* మచిలీపట్నం ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్ రైలుక్రింద పడి ఆత్మహత్య.ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ బోట్టఅర్జున్ గా గుర్తింపు.చిలకలపూడి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ సమీపంలో మృతదేహం గుర్తింపు.కుటుంబీకులకు తెలియజేసిన అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
* అనంతపురం: జిల్లాలో వైసీపీ కార్యకర్త శ్రీధర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం వెళ్తున్న శ్రీధర్‌ను కాల్వపల్లి సమీపంలో దారికాచి ప్రత్యర్థులు హత్య చేశారు. కాగా… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రత్యర్ధులు యత్నించారు. శ్రీధర్ స్వగ్రామం ఉరవకొండ మండలం షేక్షానుపల్లి. శ్రీధర్ తండ్రి లింగన్న షేక్షానుపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. గతంలో ఓ హత్య కేసులో శ్రీధర్ నిందితుడిగా ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే శ్రీధర్ కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* అనంతపురం: జిల్లాలో వైసీపీ కార్యకర్త శ్రీధర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం వెళ్తున్న శ్రీధర్‌ను కాల్వపల్లి సమీపంలో దారికాచి ప్రత్యర్థులు హత్య చేశారు. కాగా… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రత్యర్ధులు యత్నించారు. శ్రీధర్ స్వగ్రామం ఉరవకొండ మండలం షేక్షానుపల్లి. శ్రీధర్ తండ్రి లింగన్న షేక్షానుపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. గతంలో ఓ హత్య కేసులో శ్రీధర్ నిందితుడిగా ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే శ్రీధర్ కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆయన స్వగ్రామం బక్తియార్‌పూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు శిల్‌భద్ర యాజి విగ్రహాన్ని నితీశ్‌ ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పిస్తుండగా.. వెనుక నుంచి దూసుకొచ్చిన ఓ యువకుడు వీపుపై కొట్టాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకొనిఅదుపులోకి తీసుకున్నారు. అ యితే అతన్ని కొట్టకండి.. ఏమంటున్నాడో ముందుగా తెలుసుకోండిఅని భద్రతా సిబ్బందికి నితీశ్‌ కుమార్‌ సూచించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని శంభు కుమార్‌గా గుర్తించారు. అతడు బక్తియార్‌పూర్‌ పట్టణం పరిధిలోని అబూ మహ్మద్‌పూర్‌ వాస్తవ్యుడని వెల్లడించారు. శంభు గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూఇంటికే పరిమితమైనట్లు తేలింది.
*పెదపారుపూడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమ్ముడు జీవన్, అక్క కరుణగా పోలీసులు గుర్తించారు.
*రైల్వే కోడూరులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 447 బస్తాల రేషన బియ్యం పట్టుకున్నట్లు జిల్లా విజిలెన్స అధికారి బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలోని మధు రైస్‌ మిల్లు వెనుక ఉన్న క్వార్టర్స్‌, ఇండియన గ్యాస్‌ గోడన పక్క గోడౌనలో దాడులు నిర్వహించి రేషన బియ్యాన్ని స్వాఽధీ నం చేసుకుని ఎల్లిశెట్టి లీలరామ్‌ను ఆదుపులో తీసుకుని క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నిశ్చితార్థానికి వెళుతున్న మినీబస్సు ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి చింతలచేను సమీపంలోని రవీంద్రనగర్‌కు చెందిన ఫయాజ్‌కి, పాకాల మండలం, దామలచెరువు అమ్మాయితో వివాహం కుదిరింది. నిశ్చితార్థం కోసం తిరుపతి నుంచి రెండు మినీ బస్సుల్లో ఫయాజ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం మధ్యాహ్నం దామలచెరువుకు బయలుదేరారు. ఎం.కొత్తపల్లె వద్ద రోడ్డు పక్కనున్న పొలం నుంచి ట్రాక్టర్‌ రావడంతో మినీబస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలో ఒక రోజు వ్యవధిలోనే ఒకే మండలంలో రెండు ప్రమాదాలు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ట్రక్కు బోల్తా పడి ఆరుగురు మహిళా కూలీలు గాయపడ్డారు.