NRI-NRT

700 మందికి బహ్రెయిన్ గోల్డెన్ వీసాలు.. తొలి వీసా భారతీయుడికే!

700 మందికి బహ్రెయిన్ గోల్డెన్ వీసాలు.. తొలి వీసా భారతీయుడికే!

యూఏఈ బాటలోనే మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్ కూడా విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో గోల్డెన్ వీసా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో గోల్డెన్ వీసా కోసం ప్రవాసుల నుంచి ఇప్పటివరకు 1,680 దరఖాస్తు వచ్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్ అఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ హిషమ్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ ఖలీఫా వెల్లడించారు. వీటిలో అన్ని రకాల అర్హతలు గల 700 మందికి వీసాలు మంజూరు చేశామని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, బహ్రెయిన్ గోల్డెన్ వీసా పథకాన్ని ప్రకటించిన తర్వాత తొలి వీసా అందుకుంది మన ప్రవాస భారతీయుడే కావడం విశేషం. ఆయన ఎవరో కాదు లులు గ్రూపు ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ. ఇటీవలే ఆయన వీసా కూడా అందుకున్నారు.
1a
*గోల్డెన్ వీసా ప్రమోజనాలు..
ఇక ఈ వీసా పొందినవారు 10 ఏళ్ల పాటు బహ్రెయిన్‌లో నివాసం ఉండొచ్చు. ఆ దేశంలో పని చేసుకునేందుకు వీసాదారుడికి అవకాశం ఉంటుంది. అలాగే వీసాదారుడి భాగస్వామి, కుటుంబ సభ్యులకు రెసిడెన్సీ బెనిఫిట్స్‌ వర్తిస్తాయి. వీటితో పాటు అపరిమిత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవకాశం కూడా ఉంటుంది. ఈ వీసాను ప్రతి పదేళ్లకు ఒకసారి రెన్యువ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

*ఈ వీసా ఎవరికి ఇస్తారంటే..
ఆ దేశంలో 2లక్షల బహ్రెయిన్ దినార్ల(రూ.4కోట్లు) వరకు ఆస్తులు కలిగిన విదేశీయులు* ప్రవాసులు ఎవరైతే ఉద్యోగ విరామణ సమయంలో 4వేల బీడీ(రూ.8లక్షల) ఆదాయం కలిగి ఉంటారో వారికి* వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు ఈ గోల్డెన్ వీసాకు అర్హులు* ఐదేళ్ల నుంచి ఆ దేశంలో నివాసముంటు నెలకు కనీసం 2వేల బహ్రెయిన్ దినార్లు(రూ.4లక్షల) వరకు సంపాదించే వారు గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.