DailyDose

చైతన్య రథం.. @ రామకృష్ణ స్టూడియో

చైతన్య రథం.. @ రామకృష్ణ స్టూడియో

*ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారమంతా ఇందులోనే
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో చైతన్యాన్ని నింపి.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి.. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన ఎన్టీఆర్‌ ప్రచారంలో కీలకపాత్ర ఆయన వాహనమైన చైతన్య రథానిదే. ఎంతో ఆకర్షణీయంగా విశాలం గా సకల వసతులతో ఉండే ఆ వాహనం నిజానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ది. అప్పటికి చాలాకాలంగా ఆయన ఆ వాహనాన్ని వాడుతుండేవారు. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌.. ప్రచారం కోసం ఆ వాహనాన్ని ఎంజీఆర్‌ నుంచి కొనుగోలు చేసి అందులో తనకు కావాల్సిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయించుకున్నారు. కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశమయ్యేందుకు పొడవైన సోఫా, టాయిలెట్‌, వాహనం లోపలి నుంచే పైకి ఎక్కేందుకు మెట్లు ఆ వాహనంలో ఉంటాయి. అలా లోపలి నుంచే వాహనంపైకి ఎక్కి వేలాది బహిరంగ సభల్లో ఎన్టీఆర్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్కు చేసి ఉంచారు. ఎన్జీఆర్‌ చనిపోయాక నాచారంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు.