Business

అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా – TNI వాణిజ్య వార్తలు

అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా – TNI వాణిజ్య వార్తలు

*అమెరికాలో మూడో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీగా మోటరోలా రికార్డు సృష్టించింది. ప్రముఖ మార్కెట్‌ ఎనాలసిస్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2021 ఏడాదికి సంబంధించి యాపిల్‌, శామ్‌సంగ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచింది మోటరోలా. అమెరికా మార్కెట్‌లో ఆది నుంచి యాపిల్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానం కోసం శామ్‌సంగ్‌, బ్లాక్‌బెర్రీ, ఎల్‌జీ, సోనీ, మోటరోలా కంపెనీలు పోటీ పడ్డాయి. ఆండ్రాయిడ్‌ రాకతో బ్లాక్‌బెర్రీ ఈ రేసు నుంచి తప్పుకోగా మిగిలిన కంపెనీలు ఈ పరుగులో పోటీ పడ్డాయి. అయితే సోని, ఎల్‌జీ కంపెనీలు మార్కెట్‌లో ఆటుపోట్లను ఎదుర్కొలేక క్రమంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ నుంచి తమ ప్రయత్నాలను విరమించుకోవడం లేదా నామామాత్రంగా మిగలడమో జరిగింది.మోటరోలా విషయానికి వస్తే గూగుల్‌ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత మోటరోల దశ తిరుగుతుందని భావించారు. కానీ అటువంటి అద్భుతాలేమీ జరగకపోవడంతో మోటరోలాని లెనోవోకి అమ్మేసింది గూగుల్‌. ఇక లెనోవో చేతికి వెళ్లిన తర్వాత బడ్జెట్‌ ఫోన్లపై ప్రధానంగా ఫోకస్‌ చేసింది మోటరోలా. ఇప్పుడదే ఆ కంపెనినీ గట్టెక్కించింది.
అమెరికా మార్కెట్‌లో 400, 300 డాలర్ల రేంజ్‌ ధరలో మోటరోలా సుస్థిర స్థానం సాధించింది. ముఖ్యంగా మోటోజీ స్టైలస్‌, మోటోజీ పవర్‌, మోటోజీ ప్యూర్‌ మోడళ్లు ఆ కంపెనీని అమెరికాలో తిరిగి నిలబెట్టాయి. దీంతో గతేడాది ఆ కంపెనీ మార్కెట్‌ ఏకంగా 131 శాతం వృద్ధిని కనబరిచింది.అమెరికా స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే 58 శాతం మార్కెట్‌తో యాపిల్‌ ప్రథమ స్థానంలో ఉండగా 22 శాతం మార్కెట్‌తో శామ్‌సంగ్‌ రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ఉన్న కంపెనీలే 80 శాతం మార్కెట్‌ని కైవసం చేసుకున్నాయి. పది శాతం మార్కెట్‌తో మోటరోలా తృతీయ స్థానంలో నిలిచింది. చైనా కంపెనీలు అమెరికా మార్కెట్‌ పోటీలో నిలవలేకపోయాయి.
*పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం ఏడవ రోజు కూడా పెరిగాయి. పెట్రోల్ లీటరుకు 80 పైసలు, డీజిల్ లీటరుపై 70 పైసలు పెరిగాయి.ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటరు ధర రూ.100 మార్కును దాటాయి.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.100.21, డీజిల్ ధర రూ.91.47 కు పెరిగింది. ముంబైలో ఇప్పుడు పెట్రోల్ లీటరు ధర రూ. 115.04లకు పెరిగింది. దేశంలోనే ముంబై నగరంలో పెట్రోలు ధర అత్యధికంగా పెరిగింది. ముంబైలో డీజిల్ లీటరు రూ. 99.25 వద్ద విక్రయిస్తున్నారు.చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 76 పైసలు పెరిగి ఇప్పుడు రూ.105.94 అయింది. డీజిల్ ధర లీటరు రూ.96. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.109.68, డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
*బాబా రాందేవ్‌ నాయకత్వంలోని రుచి సోయా కంపెనీకి సెబీ పెద్ద షాకిచ్చింది. కంపెనీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఎఫ్‌పీఓ)లో పాల్గొన్న మదుపరులు ఎవరైనా తమ బిడ్స్‌ వెనక్కి తీసుకునేందుకు ముందుకు వస్తే అందు కు అనుమతించాలని ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఇష్యూని సబ్‌స్ర్కైబ్‌ చేయమంటూ కంపెనీ.. పతంజలి ఉత్పత్తుల వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పంపినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ సందేశాలు ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా, మోసపూరితంగా ఉన్నట్టు సెబీ పేర్కొంది. కాగా సోమవారం ముగిసిన రుచి సోయా ఎఫ్‌పీఓ బొటాబొటిగా సబ్‌స్ర్కైబ్‌ అయింది. సెబీ తాజా ఆదేశాలతో ఈ ఎఫ్‌పీఓ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.
*బాబా రాందేవ్‌ నాయకత్వంలోని రుచి సోయా కంపెనీకి సెబీ పెద్ద షాకిచ్చింది. కంపెనీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఎఫ్‌పీఓ)లో పాల్గొన్న మదుపరులు ఎవరైనా తమ బిడ్స్‌ వెనక్కి తీసుకునేందుకు ముందుకు వస్తే అందు కు అనుమతించాలని ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఇష్యూని సబ్‌స్ర్కైబ్‌ చేయమంటూ కంపెనీ.. పతంజలి ఉత్పత్తుల వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పంపినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ సందేశాలు ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా, మోసపూరితంగా ఉన్నట్టు సెబీ పేర్కొంది. కాగా సోమవారం ముగిసిన రుచి సోయా ఎఫ్‌పీఓ బొటాబొటిగా సబ్‌స్ర్కైబ్‌ అయింది. సెబీ తాజా ఆదేశాలతో ఈ ఎఫ్‌పీఓ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.
*కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా లిమిటెడ్‌.. మాజీ కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ను చైర్మన్‌, ఇండిపెండెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. నియంత్రణా సంస్థలు, వాటాదారుల అనుమతికి లోబ డి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా టీఎస్‌ కల్యాణరామన్‌ కొనసాగుతారని స్పష్టం చేసింది.
*భారత్‌ అప్పులకుప్పలా మారుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) డిసెంబరు త్రైమాసికం ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పుల భారం రూ.128.41 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.15 శాతం (రూ.2.7 లక్షల కోట్లు) ఎక్కువ. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం చెల్లింపుల్లో ప్రభుత్వ అప్పుల భారమే 91.60 శాతం ఉంది. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.45 శాతం ఎక్కువ. డిసెంబరు నాటికి ఉన్న బకాయిల్లో 25 శాతం అప్పులు ఐదేళ్లలోపు చెల్లించాల్సిన అప్పులే కావటం గమనార్హం. ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో 35.40 శాతం దేశంలోని వాణిజ్య బ్యాంకులకే చెల్లించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
*హైదరాబాద్‌కు చెందిన హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఇష్యూ ఏప్రిల్‌ 5న ముగుస్తుంది. కనీసం రూ.120 కోట్ల సమీకరణకు కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.144-153గా నిర్ణయించింది. కనీసం 98 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. ఇష్యూలో భాగంగా 85 లక్షల షేర్లను జారీ కంపెనీ జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ.40 కోట్లను నిర్వహణ మూలధనంగా వినియోగించనుండగా మిగిలిన మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనుంది. హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ స్టీల్‌ పైపులను తయారు చేసి దక్షిణాది రాష్ట్రాల్లో విక్రయిస్తోంది.
*భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఈ సంస్థలు ఇప్పటి వరకు రూ.1,14,855.97 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇందులో స్టాక్‌ మార్కెట్‌ అమ్మకాలే రూ.48,261.65 కోట్ల వరకు ఉన్నాయి. ద్రవ్యోల్బణ భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఆర్నెల్లుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కమోడిటీల ధరల పెరుగుదల ముఖ్యంగా చమురు సెగ భారత ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తుందని ఎఫ్‌పీఐలు భయపడుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు కూడా ఇందుకు తోడైంది.
*లిథియం-అయాన్‌ బ్యాటరీలను తయారు చేస్తున్న సిగ్నీ.. హైదరాబాద్‌ సమీపంలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దాదాపు ఏడాదికి 40 వేల బ్యాటరీల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఎలక్ట్రిక్‌ వాహనాల్లో, టెలికాం టవర్లు నిర్వహణ మొదలైన చోట్ల వినియోగిస్తున్నారు. విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిఽధుల కోసం 70 లక్షల నుంచి కోటి డాలర్లను రుణాలు, ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాలని సిగ్నీ యోచిస్తోంది