NRI-NRT

‘ఆటా’ ఉగాది సాహిత్య వేదిక

‘ఆటా’ ఉగాది సాహిత్య వేదిక

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఉగాది సాహిత్య వేదిక కార్యక్రమం ఏప్రిల్ 2 శనివారం రోజున నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ సందర్భంగా పండుగ రోజునే నిర్వహించిన ఈ సాహితీ కార్యక్రమం సాహితీవేత్తల నడుమ విజయవంతమైంది.శుభకృతు నామ సంవత్సర సాహితీ సౌరభం అంటూ సాగిన ఈ కార్యక్రమం ఆన్లైన్లో వర్చ్యువల్ గా నిర్వహించారు. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, వర్దిపర్తి పద్మాకర్, తనికెళ్ళ భరణి, మారుమాముల వెంకట రమణ మూర్తి, బలభద్రపాత్రుని రమణి వంటి ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు.కృష్ణవేణి మల్లావజ్జల వ్యాఖ్యాతగా సాగిన ఈ సాహితీ కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శారద సింగిరెడ్డి స్వాగతోపన్యాసం చేసి అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేవునిపాటతో కార్యక్రమం మొదలైంది. అనంతరం సాహితీవేత్తలు సాహితీ ప్రియులందరినీ అలరిస్తూ మన తెలుగు ఆచారాలను గుర్తుకు తెచ్చారు. మధ్యమధ్యలో వివిధ కవుల సాహిత్యాన్ని గుర్తుకు తెస్తూ ప్రసరించిన సాహిత్యమాల అందరినీ ఆకట్టుకుంది.తదనంతరం అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్ బుజాల ఆహూతులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే జూలై 1-3, 2022 జరగనున్న 17వ మహాసభలకు అందరినీ సాదరంగా ఆహ్వానించారు. చివరిగా వందన సమర్పణతో సాహితీ సౌరభం నిండిన ఆటా ఉగాది సాహిత్య వేదిక కార్యక్రమం ఘనంగా ముగించారు.