DailyDose

నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల బీభత్సం- TNI నేర వార్తలు

నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల బీభత్సం- TNI  నేర వార్తలు

*నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఆదివారం సీఎం జగన్ నరసరావుపేటలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పల్నాడు రోడ్డులోని.. ఓ టీస్టాల్ బిల్డింగ్‌కు వైసీపీ నేతలు బ్యానర్ కట్టారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్ తొలగించారు. బ్యానర్ తొలగింపుతో టీస్టాల్ నిర్వాహకులతో వైసీపీ శ్రేణులు గొడవకు దిగారు. శనివారం అర్ధరాత్రి టీస్టాల్ ధ్వంసం చేసి నిర్వాహకులపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

*దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామానికి చెందిన చిల్కూరు లక్ష్మీదేవి (39)ని హత్య చేసిన భర్త చిలమకూరి పుల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 10 గంటల ప్రాంతంలో మంచంపై పడుకున్న భార్య లక్ష్మీదేవిని గొడ్డలితో భర్త హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. శనివారం ఉదయం కోవెలకుంట్ల మండ లం కంపమల్ల మెట్ట వద్ద నిందితుడు పుల్లయ్యను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తానని మోసంతో నగదు వసూలు చేసిన కేసులో నిందితుడు నల్లాప్రసాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం కూనలంక గ్రామానికి చెందిన నల్లాప్రసాద్‌ ఆదర్శ మాలల ఐక్యసంఘం పేరుతో కోవూరు మండలంలోని చెర్లోపాళెం గ్రామానికి చెందిన గాలి కేశవప్రసాద్‌ తదితరుల నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ డీ వేంకటేశ్వరరావు తెలిపారు

*వర్ధన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లంద గ్రామం సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

*ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కర్నూలు పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన హైకోర్టు లాయర్‌ ఆవుల వెంకటేశ్వర్లు మూడు రోజుల క్రితం తమ్ముని వద్దకు వెళ్లి తిరిగి వస్తూ కనిపించకుండా పోయాడు. మూడురోజులుగా అతడి కుటుంబ సభ్యులు ఆచూకి కోసం గాలించినా ఫలితం కానరాలేదు. కాగా ఇవాళ కర్నూలు శివారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్నారు.

*విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిలా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన ముంజలు కొంటున్న వారిపైకి దూసుకెళ్లింది.ఈ సంఘటనలో శ్రావణ్‌(8), సుహాస్‌(6) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు సోనాపతి, శ్రావణి తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలో గాయపడ్డ పెద్దకన్నెపల్లికి చెందిన మరో బాలుడు సుషిత్ ( 8) పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉంది.

*నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) వద్ద శనివారం కొంత మంది దుండగులు అర్ధరాత్రి దారి దోపిడీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద రోడ్డు పక్కన కాపుకాసి రాళ్ల దాడికి దిగారు. ఏం జరుగుతుందో తెలియక ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బస్సు వేగాన్ని పెంచడంతో దుండగుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి.

* నరసరావుపేటలో 8వ వార్డు వాలంటీర్ అబ్దుల్లా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పింఛన్ డబ్బులు అడిగినందుకు వృద్ధురాలు జాన్ బిపై వాలంటీర్ అతని తండ్రి దాడి చేశారు. అడ్డుకోబోయిన వృద్ధురాలి కుమార్తెపై కూడా దాడి చేశారు. ఈ నెల 1న వృద్ధురాలు జాన్ బి వాలంటీర్‌ను పింఛన్ డబ్బులు అడిగింది. అయితే 5న ఇస్తామని చెప్పిన వాలంటీర్… 6వ తేదీన ఆమెకు రూ. 1500 వితంతు పింఛన్ ఇచ్చాడు. మిగతా డబ్బులు ఏవని అడగ్గా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని వాలంటీర్ చెప్పాడని వృద్ధురాలు పేర్కొంటూ.. దీనిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్ట్‌లోని పార్కింగ్‌ ప్లేస్‌లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను తిరుమలగిరి పోలీ్‌సలు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పార్సీగుట్టకు చెందిన తుకారాం (22), భన్సీలాల్‌(20) గంజాయి సేవిస్తూ, విక్రయిస్తుంటారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులోని పార్కింగ్‌ లో శనివారం గంజాయి విక్రయిస్తుండగా విశ్వసనీయసమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 110 గ్రాముల గంజాయి, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాలి ఆకాష్‌(28), అంజన్న (25) అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

*కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు లాయర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు.కర్నూలు శివారులో లాయర్ వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని కుటుంబీకులు భావిస్తున్నారు. మూడ్రోజుల క్రితం వెంకటేశ్వర్లు మహానందికి వెళ్లి అదృశ్యమయ్యారు. వెంకటేశ్వర్లు మృతిపై పోలీసులు కేసు నమోదసి దర్యాప్తు చేపట్టారు.

* స్నేహితుడితో కలిసి సరదాగా క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురానికి చెందిన దమ్మ అర్జున్‌ నిజాంపేట్‌ బండారి లే అవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌. వీరి కుమారుడు నాని (12) ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితుడితో కలిసి సర్వే నెంబర్‌ 334లోని క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లాడు. నాని నీటిలో మునిగిపోవడంతో స్నేహితుడు భయపడి పారిపోయాడు. గమనించిన స్థానికులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ మృతదేహాన్ని బయటకు తీయించారు.

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తానని మోసంతో నగదు వసూలు చేసిన కేసులో నిందితుడు నల్లాప్రసాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం కూనలంక గ్రామానికి చెందిన నల్లాప్రసాద్‌ ఆదర్శ మాలల ఐక్యసంఘం పేరుతో కోవూరు మండలంలోని చెర్లోపాళెం గ్రామానికి చెందిన గాలి కేశవప్రసాద్‌ తదితరుల నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ డీ వేంకటేశ్వరరావు తెలిపారు.

* అప్పులు మరో ఇద్దరు రైతులను బలితీసుకున్నాయి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మరసపెంట గ్రామానికి చెందిన వాంకడావత్‌ మంగిత్యానాయక్‌ (51) తన రెండున్నర ఎకరాల పొలంతోపాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని రెండేళ్లుగా సాగు చేస్తున్నాడు. పంటనష్టాలతో అప్పులు సుమారు రూ.15 లక్షల దాకా పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న మంగిత్యానాయక్‌ పంటను కాపాడేందుకు పొలం చుట్టూ కట్టిన చీరతోనేచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పెద్దముడియం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులరెడ్డి (61) తన పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని మొత్తం 40 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. వరుసగా నష్టాలు రావడంతో సుమారు రూ.40 లక్షల మేర అప్పులు మిగిలాయి. శుక్రవారం గ్రామంలో నీటికుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మృతదేహాన్ని గుర్తించారు.

* గుంటూరు…. నకిలీ ఐఏఎస్ అధికారి భాగోతం గుట్టు రట్ట్టు చేసిన నల్ల పాడు పోలీసులు. పోలీస్ యంత్రాంగం లో ఒక కీలక విభాగం ఘరానా మోసగాడు కోసం గాలింపు. నల్ల పాడు పోలీసులు వలలో చిక్కుకున్న ఘరానా నిందితుడు. Bmw కారు తో హల్ చల్ చేస్తు నకిలీ ఐఏఎస్ అవతార మెత్తిన వైనం. నకిలీ ఐఏఎస్ అధికారి నీ అరెస్ట్ చేశాం…. నకిలీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నరసింహా మూర్తి గా గుర్తించాo… ఓ అమ్మాయికి బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారు పోలీస్ సిబ్బందిని పంపమని కోరాడు.. నకిలీ ఐఏఎస్ అధికారి పై అనుమానంతో విచారణ చేశాం. గతంలో నిందితుడు పై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి..నిందితుడు మోసం పోయిన బాధితుల్లో ఓ రిటైర్డు పోలీస్ ఉన్నత అధికారీ ఉన్నారు..ఇప్పటికే మోస పోయిన బాధితులు విజయవాడ.ఇతర చెందిన వారు వచ్చారు..
నిందితుడు వల్ల మోస పోయిన బాధితులు తమకు ఫోన్లు చేస్తున్నారు… బాధితుల్లో ఒకరు కోటి రూపాయలు.ఒకరు 3oలక్షలు ఒకరు 5లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు.నరసింహ మూర్తి.అతని PA వెంకటేశ్వర రావు నీ అరెస్ట్ చేశాం.. ఉద్యోగాల పేరిట ఎంత మంది నీ మోసం చేశాడు అనేది త్వరలో తెలుస్తుంది. యువత ఉద్యోగాల పేరిట మోసపోవద్దు.. నిందితుల వద్ద నుంచి రెండు పోన్లు .ల్యాప్ ట్యాప్ స్వాధీనం.