Devotional

తిరుపతి దర్శనం కోసం వెళ్తున్నారా..? ఈ కష్టాలు తప్పవు, ఎందుకంటే..?

తిరుపతి దర్శనం కోసం వెళ్తున్నారా..? ఈ కష్టాలు తప్పవు, ఎందుకంటే..?

ఉచిత దర్శనాలకు సైతం ఆన్ లైన్లో టైం స్లాట్ విధానం పెట్టడంతో.. వారి టైం వచ్చేదాకా తిరుపతిలోనే వెయిట్ చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి. అప్పటిదాకా అక్కడే ఉండాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇక్కడే భక్తులు యాచకులుగా మారే దుస్థితిని TTD చేజేతులా కల్పించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ముందుచూపుతో వ్యవహకరించకపోవడంతో స్వామి వారి భక్తులు ఇక్కట్ల పాలు కావాల్సి వస్తోంది.అయితే, రేపటి నుంచి ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శన టోకెన్ల పంపిణీ నిలిపివేత భక్తుల రద్దీ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత కొవిడ్ పూర్వ విధానాన్ని టీటీడీ పునరుద్ధరించింది. భక్తులను వైకుంఠం కాంప్లెక్స్‌లోకి అనుమతించింది. తొలుత టోకెన్లు తీసుకున్న వారిని మధ్యాహ్నం 2 గంటలకు అనంతరం టోకెన్లు తీసుకోని వారందరినీ కంపార్టుమెంట్లలోకి అనుమతించనుంది.విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందని, కావున భక్తులు సంసిద్ధతతో తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ కోరింది. మరోపక్క శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుమలకు మంగళవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల తర్వాత టీటీడీ టోకెన్ల పంపిణీని చేపట్టడంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని, తోపులాట చోటుచేసుకుంది. దీంతో నేడు టోకెన్లు లేకున్నా, భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు.
04132022171826n90