Movies

సిని అవకాశాలు లేక యాడ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్.

సిని అవకాశాలు లేక   యాడ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్.

తాజాగా అమ్మడు కండోమ్ కు ప్రమోషన్స్ చేసింది. భర్తతో కలిసి కండోమ్ ను ఎలా వాడాలి.. ఆ కండోమ్ యొక్క పని తీరు గురించి కూడా ఆడవారికి వివరించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ యాడ్ కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఏదిఏమైనా అవకాశాలు రాకపోయినా ప్రస్తుతం స్టార్లు ఈ యాడ్స్ చేసుకొని కోట్లు సంపాదించేస్తున్నారు. అయితే మన దేశంలో పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు.కానీ హీరోయిన్స్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా ఈ కండోమ్ వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని ప్రమోట్ చేస్తున్నారు. అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు అని ప్రజలు ఎలా అనుకున్నా డోంట్ కేర్ అన్నట్లు ముద్దుగుమ్మలు అంతే ముద్దుగా కండోమ్స్ కంపెనీలను ప్రమోట్ చేసి పెడుతున్నారు. వీలుంటే భర్తలు, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోయిన్ ఇలా కండోమ్ యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషన్లు చేయగా ఇప్పుడు అనితా కూడా మొదలు పెట్టింది.
ఇక పెళ్ళై.. తల్లిగా మారడంతో నటనకు దూరంగా ఉన్న అనితా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను గట్టిగానే సంపాదించుకుంది. ఇన్ స్టాలో బ్రాండ్స్ వీడియోలను షేర్ చేస్తూ ప్రమోటర్ కూడా ఆదాయం దక్కించుకుంటుంది. అదే క్రమంలో తాజాగా కండోమ్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఓ కంపెనీ కండోమ్ వాడాలని సూచిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో అనితా భర్తతో కలిసి కండోమ్ గురించి వివరించడం కొసమెరుపు.