NRI-NRT

ప్రవాసుల దేశ బహిష్కరణకు.. కువైత్ ఎంత ఖర్చు చేసిందంటే..?

ప్రవాసుల దేశ బహిష్కరణకు.. కువైత్ ఎంత ఖర్చు చేసిందంటే..?

కువైటైజేషన్ పాలసీ, ఇతర కారణాలతో గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారిపైనైతే ఉక్కుపాదం మోపుతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా 2019 జనవరి 1 నుంచి 2021 జూలై 11 వరకు ఏకంగా 42,529 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. దీనికోసం అక్షరాల 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.52.43కోట్లు. అయితే, ఈ వ్యయాన్ని బహిష్కరణకు గురైన ప్రవాసుల స్పాన్సర్ల నుంచి వసూలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మొత్తాన్ని స్పాన్సర్లు చెల్లించే వరకు వారిని వదలబోయేది లేదని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.