Food

ఆహా! నల్ల జిలేబి

ఆహా! నల్ల జిలేబి

నలుపు రంగులో కనిపిస్తున్న ఈ జిలేబీల్ని చూసి ‘ మాడిపోవడం వల్ల ఇలా ఉన్నాయేమో ‘ అనుకుంటున్నారా ! కాదండీ బాబూ … వీటి రూపే ఇంత . ‘ బ్లాక్ జిలేబీ ‘ పేరుతో పిలిచే ఈ జిలేబీ వంటకం ఈమధ్య నెట్టింట్లో తెగ వైరల్ అయింది . ఢిల్లీలోని స్ట్రీట్పుడ్లో కనిపించిన ఈ జిలేబీ ఫొటోలు సోషల్మీడియాలోకి రావడంతో ఫుడ్ లవర్స్ దృష్టి వాటిమీదకు మళ్లింది . మామూలుగా మైదా పిండితో తయారుచేసే బంగారు , నారింజ రంగు జిలేబీలే మనకు బాగా తెలుసు . కానీ ఈ నలుపు రంగు జిలేబీల్ని కోవా , బంగాళాదుంపలతో తయారుచేసి చక్కెర లేదంటే బెల్లం పాకంలో వేస్తారు . అందుకే ఇవి చూడ్డానికి ఇలా నలుపు రంగులో మాడిపోయినట్టు కనిపిస్తాయి . కానీ రుచిలో మాత్రం మామూలు జిలేబీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి . కాబట్టే ఇది , కొత్తకొత్త రుచుల్ని ఆస్వాదించాలనుకునేవారికి హాట్ ఫేవరేట్గా మారింది .