DailyDose

ఆయిల్‌ రిఫైనరీలో భారీ ప్రమాదం – TNI నేర వార్తలు

ఆయిల్‌ రిఫైనరీలో భారీ ప్రమాదం – TNI  నేర వార్తలు

* నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్మిషన్‌ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 100 మందికిపైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్‌ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

*ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగులోంచి రియాల్స్‌ తస్కరించిన సంఘటన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ డిచ్‌పల్లికి చెందిన షేక్‌ అల్తాఫుద్దీన్‌ శుక్రవారం రాత్రి రియాద్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. బంధువులు, కుటుంబసభ్యులు అరైవల్స్‌లోకి కాకుండా డిపార్చర్‌ వైపు వెళ్లడంతో హడావుడిగా అల్తాఫుద్దీన్‌ కూడా అక్కడికి వెళ్లాడు.

*చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో సుమారుగా 20 మంది ఉన్నట్లు సమాచారం. చింతలపూడి మండలం బాలావారిగూడెం నుంచి పుట్రేపు మారెమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గతంలో రేతిఫైల్‌ బస్‌బేలో రెండు బస్సుల మధ్య నలిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరవకముందే శనివారం ఓ మహిళ రెండు బస్సుల మధ్య నలిగి గాయాలతో బయటపడింది. బేగంపేటకు చెందిన రమాదేవి మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేస్తుంది. శనివారం ఉదయం విధులకు వెళ్లేందుకు రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌కు వచ్చింది. అక్కడి నుంచి మలక్‌పేటకు వెళ్లేందుకు డి బస్సు ఎక్కుతుండగా అదే సమయంలో పక్క నుంచి నెంబర్‌ బస్సు వచ్చింది. రెండు బస్సుల మధ్య రమాదేవి ఇరుక్కుపోయింది. అక్కడున్న వారు కేకలు వేయడంతో బస్సు డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. దీంతో రమాదేవి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. గోపాలపురంమహంకాళి ట్రాఫిక్‌ పోలీసులుఆటోడ్రైవర్లు రమాదేవి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదంతా గంటపాటు జరగగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డీవీఎంకంట్రోలర్లు ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

*దాచేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరికేపల్లి గ్రామ సమీపంలో అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఆగివున్న లారీని జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*శాలిగౌరారం మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంగమర్తి సమీపంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతులు నాగారం మండలం నర్సింహుల గూడెం వాసులు సాయమ్మ(70), అవిలయ్య (48)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రాష్ట్రంలో వడదెబ్బతో శనివారం ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుంటాలలో ఉపాధి కూలీ చిటీ లస్మన్న(50), భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మరో ఉపాధి కూలీ కందుల సారయ్య, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం తిప్పాపూర్‌లో చిన్నారి హారిక(4) మృతి చెందినవారిలో ఉన్నారు.

*అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మాసిటీలో ఉన్న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఇండి యా పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమా దం సంభవించింది. ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి మంటలు ఎగసిపడడంతో కార్మికులు భయం తో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంపెనీలో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఎఫ్లూయంట్‌ స్టోరేజ్‌ ట్యాంకులు(ఈయూ 3, 4, 5) ఉన్నాయి. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా కంపెనీలో వివిధ విభాగాల నుంచి వ్యర్థాలు పైపులైన్ల ద్వారా ఈ ట్యాంకుల్లోకి చేరుకుంటాయి. ఈ వ్యర్థాలను పక్కను న్న మరో ట్యాంకులోకి పంపుతారు. అక్కడ శుద్ధి చేసి న అనంతరం పైప్‌లైన్‌ ద్వారా రాంకీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ)కు తరలిస్తారు. శనివారం మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఐదో నంబర్‌ ట్యాంకు నుంచి ఎఫ్లూయంట్‌ ఎక్కువ మోతాదులో పైప్‌లైన్‌ ద్వారా పక్కనున్న ట్యాంకులోకి వెళుతుండగా రసాయనాలు ఒత్తిడికి గురై మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో అలారం మోగించి కార్మికులను అప్రమత్తం చేయడంతో వారు భయంతో పరుగులు తీశారు.

*కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత యువకులను చిత్రహింసలు పెట్టి చంపడం సంచలనమైంది. ఇద్దరి మృతదేహాలు శుక్రవారంనాడు ఒక చెరువులో తేలాయి. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపామని, వారిని చిత్రహింసలు పెట్టిన చంపడానికి దారితీసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండ్ అఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి సారథ్యంలోని పోలీసులు టీమ్‌లు నిందితుల కోసం జల్లెడ పడుతున్నాయి.

*పెద్దకాల్వల శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*రేపల్లెలో విషాదం చోటు చేసుకుంది. వార్డులో పాము కాటుకు విద్యార్థి ఆలపర్తి పవన్ కుమార్ (మృతి చెందాడు. ఎదిగిన కొడుకు కళ్ల ముందు ప్రాణాలు విడవంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించింది. దీప, ఆకాష్‌, నక్షత్ర పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పలాస మండలం బొడ్డపాడులో ఈ ఘటన జరిగింది.

*రువూరులో వాలంటీరు భర్త బాలికను వేధిస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థినిని వాలంటీర్‌ భర్త లైంగికంగా వేధించాడని ఆరోపణ వస్తున్నాయి. స్నానం చేస్తుండగా బాలిక వీడియోలు తీసి వేధించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు.