Devotional

రంజాన్‌ నెలలోనే జకాత్ ఎందుకంటే.. ?- TNI ఆధ్యాత్మికం

రంజాన్‌ నెలలోనే జకాత్ ఎందుకంటే.. ?- TNI ఆధ్యాత్మికం

1. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రంజాన్‌ నుంచి రంజాన్‌ వరకు సంవత్సరంగా భావించి జకాత్‌ ధనాన్ని లెక్కిస్తారు. దీనికి ప్రధాన కారణం రంజాన్‌ నెల ఖురాన్‌ అవతరించిన మాసం కావడం, ఈ నెలలో ఇచ్చిన దానాలకు 70 రెట్లు అధిక పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకం ఉండడం. అందువల్ల ఈ మొత్తాలను ఈ నెలలోనే అర్హులకు పంచుతారు. మొత్తం మీద అల్లాహ్‌ మనకు ప్రసాదించిన సొమ్ములో పేదలకు హక్కు ఉందని చాటి, వారు కూడా సంతోషంగా జీవనాన్ని గడిపే అవకాశాన్ని కల్పించే ఈ దానం ముస్లింల జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగం.
**ఎవరికి పంచాలి?*
జకాత్‌ దానాన్ని ఎవరికి ఇవ్వాలన్నది కూడా పవిత్ర ఖురాన్‌లో స్పష్టం చేశారు. తొలుత పేదలైన దగ్గరి రక్త సంబంధీకులు అర్హులు. వారు ఆకలితో అలమటిస్తూ ఉంటే, దానాన్ని ఇతరులకు ఇస్తే ఆ జకాత్‌ చెల్లదు. ముందుగా వారికే ఇవ్వాలి. ఆపై ఇతర బంధువులు, అనంతరం స్నేహితులు.. ఇలా బేరీజు వేసుకోవాలి. మదర్సాలలో పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు కనుక వారి అన్నపానాదుల కోసం ఈ ధనాన్ని ఇవ్వొచ్ఛు

2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతంది. శనివారం శ్రీవారిని 75,438 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 34,374 మంది భక్తులు మొక్కులు తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

3.ప్రాణహిత పుష్కరాలు ముగింపునకు రావడంతో భక్తులువీఐపీల తాకిడి పెరుగుతోంది. పుష్కరాల రోజైన శనివారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పుష్కర స్నానం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని ఘాట్‌ వద్ద పుష్కరస్నానం చేసి భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఫడణవీస్‌ దేశప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని తాను కోరుకున్నట్లు తెలిపారు. కాగాకాళేశ్వరం ఘాట్ల వద్ద శనివారం దాదాపు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదివారం సాయంత్రంతో ప్రాణహిత పుష్కరాలు ముగియనున్నాయి

4. రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న పది ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర పథకాన్ని శనివారం స్థానిక వడపళనిలో ప్రసిద్ధిచెందిన సుబ్రమణ్యస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వడపళని సుబ్రమణ్యస్వామి ఆలయంతిరువేర్కాడు దేవికరుమారియమ్మన్‌పళని దండాయుధపాణిమదురై మీనాక్షి సుందరేశ్వరర్‌తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామిసమయపురం మారియమ్మన్‌తిరుత్తణి సుబ్రమణ్యస్వామిశ్రీరంగం రంగనాథస్వామిమరుదుమలై సుబ్రమణ్యస్వామిబన్నారి మారియమ్మన్‌ అని ఆలయాల్లో భక్తులకు రోజంతా ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చక్కెర పొంగలిపులిహోరకొబ్బరన్నంలడ్డూ తదితర ఆరు రకాల ప్రసాదాలను ఒకదాని తర్వాత ఒకటి పంపిణీ చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత ప్రసాదం పంపిణీ పథకాన్ని రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు విస్తరింపజేస్తామనిదేవాదాయ శాఖ తరఫున ప్రకటించిన ప్రకటనల్లో ప్రకటనలను విజయవంతంగా అమలుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. మదురై చిత్తిరై ఉత్సవాల్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమనిరాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను ముమ్మరం చేస్తామని చెప్పారు. కరోనా నిబంధనల సడలింపు అనంతరం ఆలయాలకు తరలివెళ్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందనిభక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించిసామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చంద్రమోహన్‌కమిషనర్‌ కుమరగురుపరన్‌అడిషినల్‌ కమిషనర్లు కన్నన్‌తిరుమగళ్‌ఎమ్మెల్యేలు జె.కరుణానిధిమయిలై వేలువడపళని ఆలయ జాయింట్‌ కమిషనర్లు ధనపాల్‌రేణుకాదేవిసుదర్శన్‌ పాల్గొన్నారు.

5. కాణిపాకం వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌ లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుందన్నారు

6. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు
ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 75,748 మంది స్వామివారిని దర్శించుకోగా 35,348 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమ ర్పించుకున్న కానుకల రూపేణా టీటీడీకి రూ. 3.89 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు.ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. తిరుమ‌ల శ్రీ‌వారి ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవ‌సాయంతో పండించిన వంద ట‌న్నుల శ‌న‌గ‌లు టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మ‌క్షంలో అధికారులు అందుకున్నారు. గో ఆధారిత వ్యవ‌సాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యం స‌మ‌ర్పించాల‌ని ధ‌ర్మక‌ర్తల మండ‌లి నిర్ణయం మేరకు దాదాపు 2500 మంది రైతులు ఎలాంటి ర‌సాయ‌న ఎరువులు, పురుగు మందులు ఉప‌యోగించ‌కుండా, ప్రకృతి వ్యయ‌సాయంతో పండించిన శ‌న‌గ‌ల‌ను రైతు సాధికార సంస్థ ద్వారా సేక‌రించి, మార్క్‌ఫెడ్ ద్వారా, త‌మ మిల్లర్లలో టీటీడీ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా రూపొందించి ఇస్తోంద‌న్నారు.ఈ ఏడాది గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన 2300 టన్నుల శ‌న‌గ‌లు అందుతాయ‌న్నారు. ఇప్పటివ‌ర‌కు 1800 ఎద్దులు, వ‌ట్టిపోయిన ఆవులను రైతుల‌కు అందించామ‌ని, శ్రీ‌వారి ప్రసాదంగా భావించి వారు పూజ‌లు చేసి పోషించుకుంటున్నారని వివ‌రించారు.