Business

టెక్సాస్‌ కంపెనీతో గ్రీన్‌ రోబోటిక్స్‌ జట్టు – TNI వాణిజ్య వార్తలు

Auto Draft

* అమెరికా మార్కెట్లో అటానమస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూషన్లను ప్రవేశపెట్టడానికి టెక్సా్‌సకు చెందిన టెక్నోలాజిక్స్‌ గ్లోబల్‌తో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ రోబోటిక్స్‌ చేతులు కలిపింది. గ్రీన్‌ రోబోటిక్స్‌ అందించే ఆటానమస్‌ టెక్నాలజీ కంపెనీల ఆదాయాన్ని పెంచడమే కాక నిర్వహణ వ్యయాలను తగ్గిస్తాయని గ్రీన్‌ రోబోటిక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ కిరణ్‌ పీ తెలిపారు. టెక్సాస్‌ కంపెనీతో ఏడాది కాలంగా చర్చలు జరిపిన అనంతరం చేతులు కలిపామన్నారు. కంపెనీకి చెందిన గ్రీన్‌ ఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంపెనీలు ఐదో తరం పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టగలవన్నారు.
* వరుస నష్టాలకు స్టాక్‌ మార్కెట్‌లో బ్రేక్‌ పడింది. క్రితం రోజు సూచీలు భారీగా నష్టపోవడంతో అనేక కంపెనీల షేర్ల ధరలు దిగి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఉక్రెయిన్‌ యుద్ధం , మూడో ప్రపంచ యుద్ధమంటూ రష్యా చేసిన హెచ్చరికలు మార్కెట్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాలతో ఈ రోజును ముగించాయి.
*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.
*అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలు.. దేశీయంగా ఈక్విటీ, ఫారెక్స్‌, బులియన్‌ మార్కెట్లు మూడింటినీ కుంగదీశాయి. విదేశీ మార్కెట్లలో సాగిన భారీ అమ్మకాలు. దేశీయ మార్కెట్ల నుంచి నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, రూపాయి క్షీణత కారణంగా స్టాక్‌మార్కెట్‌ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దీనికి తోడు ఫ్యూచర్‌ గ్రూప్‌తో డీల్‌ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఆర్‌ఐఎల్‌ షేర్లలో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్‌ను కుంగదీసింది. సర్వత్రా ప్రతికూల సంకేతాల నడుమ వరుసగా రెండో సెషన్‌లో కూడా భారీ నష్టాలు తప్పలేదు.
*ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) వచ్చే నెల 4న ప్రారంభమై 9న ముగియనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓలో సంస్థకు చెందిన 3.5 శాతం ఈక్విటీ వాటాను విక్రయించడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టనున్నట్లు తెలిసింది. సెబీ నిబంధనల ప్రకారం.. రూ.లక్ష కోట్లకు పైగా అధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలో కనీసం 5 శాతం వాటా విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే సెబీని కోరింది. ఎల్‌ఐసీ ఐపీఓ ప్రతిపాదనకు సెబీ అనుమతుల గడువు వచ్చేనెల 12తో ముగియనుంది. అప్పటిలోగా ఇష్యూకు రాని పక్షంలో సెబీ అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22) లోనే ఎల్‌ఐసీ ఇష్యూను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
*టైప్‌ 2 మధుమేహ రోగుల కోసం గ్లెన్‌మార్క్‌ దేశీయ మార్కెట్లోకి కొత్త ఔషధాన్ని విడుదల చేసింది. టెనిలిగ్లిప్టిన్‌, పియోగ్లిటజోన్‌ ఫిక్స్‌డ్‌-డోస్‌ కాంబినేషన్‌ ఔషధాన్ని దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. రోగుల్లో గ్లిసెమిక్‌ నియంత్రణను ఇది పెంచుతుందని, ‘జిటాప్ల్‌సపియో’ బ్రాండ్‌తో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు గ్లెన్‌మార్క్‌ తెలిపింది.
*కొవిడ్‌ అనంతరం లైఫ్‌ సైన్సెస్‌ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, వచ్చే దశాబ్దం ఈ రంగానిదే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. స్విట్జర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా వివిధ దేశాల్లో 14 వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు, 30 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు కలిగిన ఫెరింగ్‌ ఫార్మా తన నూతన తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసింది. యూరాలజీ, గ్యాస్ర్టోఎంట్రాలజీతో పాటు మహిళా, శిశు సంబంధిత వ్యాక్సిన్లను ఈ సంస్థ ఇక్కడి కేంద్రంలో తయారు చేయనుంది. సోమవారం నాడు మంత్రి కేటీఆర్‌ ఈ ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
*కొవిడ్‌ అనంతరం లైఫ్‌ సైన్సెస్‌ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, వచ్చే దశాబ్దం ఈ రంగానిదే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. స్విట్జర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా వివిధ దేశాల్లో 14 వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు, 30 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు కలిగిన ఫెరింగ్‌ ఫార్మా తన నూతన తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసింది. యూరాలజీ, గ్యాస్ర్టోఎంట్రాలజీతో పాటు మహిళా, శిశు సంబంధిత వ్యాక్సిన్లను ఈ సంస్థ ఇక్కడి కేంద్రంలో తయారు చేయనుంది. సోమవారం నాడు మంత్రి కేటీఆర్‌ ఈ ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
* మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో దాతృత్వ చర్చలను టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తిరస్కరించాడు. ఇందుకు సంబంధించి… ఎలాన్ మస్క్, బిల్‌గేట్స్ మధ్య జరిగిన చాట్ సోషల్ మీడియాలో బయటపడింది. గేట్స్ మస్క్‌తో దాతృత్వ అవకాశాల విషయమై చర్చించాలనుకుంటున్నట్లు చెప్పగా, ఆయన అభ్యర్థనను మస్క్ తిరస్కరించాడు. ఇదిలా ఉండగా… ఇందుకు సంబంధించిన చాట్‌లను తాను లీక్ చేయలేదని, టెస్లాకు వ్యతిరేకంగా గేట్స్ హాఫ్-బిలియన్ షార్ట్ పొజిషన్‌ను కలిగి ఉన్నారనేది అత్యంత రహస్యమేమీ కాదని మస్క్ ట్వీట్ చేశాడు.