DailyDose

ఆస్ట్రేలియా నుంచి వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా….రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి – TNI నేర వార్తలు

ఆస్ట్రేలియా నుంచి వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా….రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి  – TNI  నేర వార్తలు

*సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దంపతులు హేమాంమ్ బరధర్, రజిత అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు, కారు డ్రైవర్‌కు తీవ్ర తీవ్రగాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో హేమాంమ్ బరధర్ దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. నిన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చి రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మరణవార్త విని స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

*రాజంపేట గ్రామ పంచాయతీ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన ఇట్టం నవీన్ అనే వ్యక్తి తన తండ్రి పేరున ఉన్న ఇంటి రికార్డులను ఓ అధికార పార్టీ బడా నాయకుని సహాయంతో పంచాయతీ కార్యదర్శి మార్పిడి చేశారని ఆరోపించారు. 1985లో ఇంటి కోసం పట్టా పంపిణీ చేశారని, 2022లో తన ప్రమేయం లేకుండా మార్పిడి చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని కుటుంబంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నవీన్ తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

*చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

*కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తిపై కొండముచ్చు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కోన బాలాజీ అనే వ్యక్తి పెదపట్నంలో జామాయిలు తోటలు నరికేందుకు వెళ్లిన సమయంలో కొండముచ్చు దాడి చేసింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా పెదపట్నంలో గ్రామస్తులపై కొండముచ్చు దాడి చేస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది మందిపై దాడి చేసిందని బాధితుడు తెలిపాడు.

*ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో గుడిపాటి సురేంద్రబాబు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు పాల్పడ్డాడు. వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తీసుకున్న వ్యక్తులు బెదిరిస్తున్నారని సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బులు తిరిగి రావనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను సురేంద్ర వివరించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అర్ఐపై పలు సెక్షన్ల కింద రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాడి సూత్రధారి గంటా సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడికి గురైన ఆర్ఐపైనే కేసు నమోదు కావడంతో.. ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

*ఒడిస్సా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన 2వందల కోడిగుడ్ల లారీలు నిలిచిపోయాయి. గుడ్ల ధరలు పడిపోవడంతో ఒడిసా అధికారులు ఖుర్దా వద్ద లారీలను నిలిపివేశారు. ఏపీ నుంచి నిత్యం అసోం, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు కోడిగుడ్ల ఎగుమతులు అవుతుంటాయి. ఏపీ నుంచి ఎగుమతులవల్ల తమ రాష్ట్రంలో గుడ్లకు గిరాకీ లేకుండా పోతోందని ఒడిసా వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోడి గుడ్డు ధర రూ. 4.25 నుంచి 3.25 పైసలకు పడిపోయింది. సీడ్ ధర పెరిగి గుడ్డు రేటు తగ్గిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉయదం 10:30 గంటల వరకు లారీలు నిలిచిపోయాయి. దీంతో ఏపీ పౌల్ట్రీ దారుల సమాఖ్య రంగంలోకి దిగింది. ఒడిసా అధికారులతో సంప్రదింపులు జరపడంతోపాటు అక్కడి పౌల్ట్రీ సమాఖ్యను కూడా చర్చల కోసం రాజమండ్రికి రావాల్సిందిగా కోరారు.

*గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అర్ఐపై పలు సెక్షన్ల కింద రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాడి సూత్రధారి గంటా సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడికి గురైన ఆర్ఐపైనే కేసు నమోదు కావడంతో.. ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

*కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వ్యవసాయం పనులకు వెళ్లిన కారుకుట్ల రూపశ్రీ (మెడపొట్టపై సంకురు ప్రవీణ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. తెనాలి మండలం నేలపాడు గ్రామానికి చెందిన సంకురు ప్రవీణ్ చిలుమూరు గ్రామానికి చెందిన కరుకుట్ల రూపశ్రీని హత్య చేసి తర్వాత నిండుతుడు ప్రవీణ్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

*రాజంపేట గ్రామ పంచాయతీ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన ఇట్టం నవీన్ అనే వ్యక్తి తన తండ్రి పేరున ఉన్న ఇంటి రికార్డులను ఓ అధికార పార్టీ బడా నాయకుని సహాయంతో పంచాయతీ కార్యదర్శి మార్పిడి చేశారని ఆరోపించారు. 1985లో ఇంటి కోసం పట్టా పంపిణీ చేశారని, 2022లో తన ప్రమేయం లేకుండా మార్పిడి చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని కుటుంబంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నవీన్ తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

*క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను అనంతపురం నగర పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.30,12,500 నగదు, రెండు ఫోన్లు, ట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన కరణం సాయినాథ్‌ ప్రసాద్‌కు 2019లో బెంగళూరులో ఉన్న సమయంలో కర్ణాటకకు చెందిన కొందరు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఐపీఎల్‌ సీజన్‌లో అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కొప్పల రమే్‌షతో పరిచయంఉంది. ఇద్దరూ కలిసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

*క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను అనంతపురం నగర పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.30,12,500 నగదు, రెండు ఫోన్లు, ట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన కరణం సాయినాథ్‌ ప్రసాద్‌కు 2019లో బెంగళూరులో ఉన్న సమయంలో కర్ణాటకకు చెందిన కొందరు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఐపీఎల్‌ సీజన్‌లో అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కొప్పల రమే్‌షతో పరిచయంఉంది. ఇద్దరూ కలిసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

*పెనుగంచిప్రోలు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తోటచర్ల దగ్గర ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*భోగాపురం మండలంలో తెల్లవారుజామున అవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ పైనుంచి పడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బంగార్రాజుపేట వాసి వీరబాబు(32), విజయవాడ వాసి ఈశ్వరరావు(33)గా పోలీసులు గుర్తించారు.

*మంగళవారం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెంగళూరు వర్సెస్‌ రాజస్థాన్‌ పోటీలో ఓ ముఠా బెట్టింగ్‌కు పాల్పడింది. స్థానిక నూనెపల్లెలోని లాడ్జిలో ఐదుగురితో కూడిన ముఠా బెట్టింగ్‌ ఆడుతుండగా పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శిరువెళ్ల పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అశోక్‌తోపాటు మరో నలుగురు ఉన్నారు. వారి వద్ద ఉన్న రూ.3,00,900 నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

*విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కలెక్టర్‌కు సిఫారసు చేసినట్టు హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. ఆమె మా నసిక ఆరోగ్యం, విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తారని, ఒక వేళ మానసిక పరిస్థితి బాగాలేకపోతే, ఆమె తల్లికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆమె కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆమె మాట్లాడారు. అత్యాచారం చేసిన వారిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని, వాళ్లకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ‘ఈ ఘటన దారుణం. ఈ విషయంలో బాధిత కుటుంబం, బాధితురాలి వివరాలు బయటపెట్టకూడదు. మీడియాను కూ డా అక్కడకు తీసుకెళ్లకూడదు. కానీ, ప్రతిపక్షనేత చంద్రబాబు బాధితురాలిని పరామర్శించినప్పుడు గలాటా జరిగింది. దీనిని రాజకీయం చేసి లబ్ధిపొందాలనే ప్రయత్నమే అది. నిందితులను మూడు గంటల్లోనే అరెస్ట్‌ చేశాం. రూ.10 లక్షలు పరిహారం ఇచ్చాం. ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా బాధితులకు అండగా ఉండాలి. రాజకీయం తగదు’ అన్నారు.

* క్రికెట్‌ ఆడుతుండగా ఏర్పడిన వివాదంలో ఓ బాలుడు బ్యాట్‌తో కొట్టడంతో మరో బాలుడు మరణించాడు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నంగి సూర్య(14) జి.మేడపాడు జిల్లా పరిషత్‌ ఉన్న త పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి. ఒంటిపూట బడు లు కావడంతో సోమవారం సాయంత్రం జి.మేడపాడు గ్రౌం డ్స్‌ టలో క్రికెట్‌ ఆడుకుంటుండగా అదే పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థితో వివాదం ఏర్పడింది. అనంతరం సైకిళ్లపై ఇళ్లకు వెళ్తుండగా దారిలో మళ్లీ ఘర్షణ పడ్డారు. ఏడో తరగతి బాలుడు బ్యాట్‌తో సూర్య తలపై మోదడంతో సూర్య కింద పడిపోయాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బా లుడు బెదిరించడంతో సూర్య ఇంటికి వెళ్లి తలనొప్పి వస్తోందని పడుకున్నాడు. ఆరోగ్య పరిస్థితిలో తేడా గమనించిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి తర్వాత ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సామర్లకోట పోలీసులు గ్రామానికి వచ్చి ఆరా తీయగా, క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టడడం వల్లే మృతిచెందాడని సూర్య కుటుంబసభ్యులు తెలిపారు. సూర్య తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారని, అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉండి చదువుకుంటున్నాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విలపించారు.

* ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌ అనాఽథపిల్లల పాఠశాలలో సోమవారం రాత్రి ముక్కు రోహిత్‌(15) అనే పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ రూరల్‌ మండలం పి.నైనవరం గ్రామానికి చెందిన ముక్కు దుర్గ భర్త మరణించడంతో తన ఇద్దరు మగ పిల్లలను రెండేళ్ల క్రితం తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌లో చేర్పించింది. రోహిత్‌ 10వ తరగతి చదువుతుండగా, అతని తమ్ముడు రేవంత్‌ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి పొద్దుపోయాక రోహిత్‌ తాను ఉం టున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకోవడంతో తోటి వి ద్యార్థులు గమనించి వెంటనే అతడిని ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రోహిత్‌ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలంగా పరీక్షలంటే భయపడుతున్నాడని, ఈ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు బాలుడి తల్లి పేర్కొంది.

*భోగాపురం మండలంలో తెల్లవారుజామునఅవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోబైక్‌ పైనుంచి పడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బంగార్రాజుపేట వాసి వీరబాబు(విజయవాడ వాసి ఈశ్వరరావు(గా పోలీసులు గుర్తించారు.

**సూర్య హీరోగా నటించిన వీడొక్కడే సినిమాలో కడుపులో మత్తు పదార్థాలను పెట్టుకొని స్మగ్లింగ్‌ చేస్తున్న సీన్‌ గుర్తుందా? శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ అచ్చం అలాగే జరిగింది. ఓ వ్యక్తి కడుపులో కొకైన్‌ను దాచి తీసుకొస్తూ డీఆర్‌ఐ అధికారులకు చిక్కాడు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

*గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అర్ఐపై పలు సెక్షన్ల కింద రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాడి సూత్రధారి గంటా సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడికి గురైన ఆర్ఐపైనే కేసు నమోదు కావడంతో.. ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి

*హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

*ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ పట్టణంలోని ఆనంద్ డెయిరీ ప్లాంటులో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సియానా ఏరియాలోని ఆనంద్ డెయిరీ ప్లాంటులో మంటలు చెలరేగడంతో అధికారులు హుటాహుటిన అగ్నిమాపక వాహనాలను రప్పించారు.డెయిరీ ప్లాంటులో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకశాఖ, పోలీసు, జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగినపుడు డెయిరీ ప్లాంటులో ఎంతమంది కార్మికులున్నారనేంది ఇంకా తేలలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* రిమాండ్‌లో ఉన్న ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు నిరాశే ఎదురైంది. ఈనెల 29 దాకా వారు కటకటాల వెనకే ఉండనున్నారు. బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ముంబై సెషన్‌ కోర్టు 29వ తేదీకి వాయిదా వేసిం ది. మరోవైపు అరెస్టయిన రోజు తమ పట్ల ఖర్‌ స్టేషన్‌లో పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ లోక్‌సభ స్పీకర్‌కు నవనీత్‌ రాణా ఫిర్యాదు చేశారు. తమకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. అయితే, ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆ రోజు పోలీసు అధికారు ల ఎదుట కుర్చీలో రాణా దంపతులు కూర్చుని చాయ్‌ తాగుతున్న 12 సెక న్ల వీడియోను ముంబై సీపీ సంజయ్‌ పాండే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వారి ఎదుట ఉన్న టేబుల్‌పై మినరల్‌ వాటల్‌ బాటిళ్లు ఉన్నాయి. ‘ఇది సరిపోతుందా.. ఇంకా ఏమైనా వివరాలు కావాలా?’ అని వీడియో కింద రాశారు.