NRI-NRT

ప్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ చేపట్టిన నాట్స్

ప్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ చేపట్టిన నాట్స్

టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. హోప్ చిల్డ్రన్స్ హోమ్ కోసం అనాథ పిల్లల ఆకలి తీర్చటంలో తాము సైతం ముందుంటామని నాట్స్ ఈ సత్కార్యాన్ని చేపట్టింది.. దాదాపు 2 వేల పౌండ్ల ఆహరాన్ని ఈ సందర్భంగా నాట్స్ సభ్యులు సేకరించారు. ఇందులో పండ్లు, కూరగాయలు, పాలు, పాల పొడితో పాటు అనేక తినుబండారాలు ఉన్నాయి. చిన్నారులు బలం కోసం మాంసాన్ని కూడా నాట్స్ ఈ ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించి హోమ్ చిల్డ్రన్స్ హోమ్ కు విరాళంగా అందించింది. హోప్ ఆశ్రమంలో దాదాపు 67 మంది పిల్లలకు నాట్స్ సేకరించిన ఆహారం ఉపయోగపడనుంది.
Whats-App-Image-2022-04-30-at-7-04-06-AM
ఈ కార్యకమ్రానికి మద్దతిచ్చిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ఛైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి నాట్స్ టెంపాబే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినినిని, నాట్స్ టెంపాబే సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపాబే సంయుక్త సమన్వయకర్త సురేష్ బొజ్జ, నాట్స్ కోర్ టీం కమిటీ నాయకులు ప్రభాకర్ శాఖమురి, అనిల్ అరిమండ, నవీన్ మేడికొండ, భార్గవ్ మాధవరెడ్డి, శ్రీనివాస్ బైరెడ్డి, శిరీష దొడ్డపనేని, దీప్తి రత్నకొండ పాల్గొన్నారు
Whats-App-Image-2022-04-30-at-7-05-30-AM
Whats-App-Image-2022-04-30-at-7-06-23-AM