Devotional

ఈ నెల 10 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

ఈ నెల 10 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

1. తిరుమలలో పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడురోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో మలయప్పస్వామి తొలిరోజు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడ వాహనంపై వేంచేస్తారు. మరోవైపు ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. తర్వాత కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. పరిణయోత్సవాల సందర్భంగా ఈ మూడురోజులు ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీ డీ రద్దు చేసింది

2. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ఆలయ అధికారులు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి రాచమర్యాదలు చేసి.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను చిన్నచూపు చూశారు. స్వామి నిజరూప దర్శనానికి మంగళవారం ఉదయం పీఠాధిపతి రాగా ఆయన వాహనాన్ని రాజగోపురం వరకు అనుమతించారు. ఆలయ ఈవో సూర్యకళ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లి దర్శనం చేయించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా స్వామి దర్శనానికి వచ్చారు. కానీ ఆమె వాహనాన్ని రాజగోపురానికి దూరంగా ఉన్న పీఆర్వో కార్యాలయం వద్దే ఆపేశారు. అక్కడి నుంచి ఆమెను దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇది చూసి అక్కడి ఉద్యోగులు విస్తుపోయారు.

3.అప్పన్న చందనోత్సవం (నిజరూప దర్శనం) భక్తుల హరినామ స్మరణ నడుమ మంగళవారం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. పాంచరాత్రాగమ శాస్త్ర సంప్రదాయానుసారం ఆరాధనలుపంచకలశావాహనం పూర్తిచేశారు. అనంతరం ఆలయ అర్చకులు కళ్లకు గంతలు కట్టుకుని వెండి బొరిగెలతో స్వామి వారిపై పూతగా ఉండే చందనాన్ని తొలగించిప్రభాత ఆరాధనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దేవాలయ అనువంశిక ధర్మకర్తకేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు దంపతులువారి కుటుంబీకులకు తొలిదర్శనం కల్పించారు. అనంతరం వేకువజామున గంటల నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అశోక్‌గజపతిరాజుటీటీడీ తరపున జేఈవో ధర్మారెడ్డిరాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా.. స్వామివారిని పలువురు మంత్రులుహైకోర్టు న్యాయమూర్తులుప్రముఖులు దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సైఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాంసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహులురాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.సుజాతజస్టిస్‌ కొంగర విజయలక్ష్మిజస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌రాష్ట్ర దేవదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణఐటీపరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణఉప ముఖ్యమంత్రి రాజన్నదొరమాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. భక్తుల దర్శనం అనంతరం మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు.

4. సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం
స్మార్ట్‌ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాక కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అదేదో గొప్ప విషయంగా, ఏదో సాధించినట్టుగా భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. సింహాచలం అప్పన్న సన్నిధిలో ఇలాంటి అత్యుత్సాహపరులే అపచారం చేశారు. చాలా ఆలయాల్లో గర్భగుడిలోకి కెమెరాలు అనుమతించరు. ఫొటోలు తీయడం నిషేధం. అయితే.. కొందరు ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి స్మార్ట్‌ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లి ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. సింహాచలంలో ఓ ఆకతాయి అదే పని చేశాడు. స్వామి అంతరాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు అనుమతి లేని అప్పన్న అంతరాలయంలోకి వెళ్లి వీడియో తీయడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడంతో పెను దుమారం రేగింది.భక్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఆ వీడియో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తగిన బుద్ధి చెప్పాలని.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవం జరుగుతున్న రోజే ఇలాంటి ఘటన జరగడంతో ఆలయంలో భద్రతా సిబ్బంది ఏమేరకు పనిచేస్తున్నారో ఈ ఘటనే రుజువు చేస్తోందని భక్తులు మండిపడుతున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. శ్రీవారి గర్భగుడి ఇదేనంటూ ఆ వీడియో నెట్‌లో చక్కర్లు కొట్టింది. అయితే.. చివరకు తేలిన నిజం ఏంటంటే.. ఆ వీడియో వెంకటేశ్వరస్వామి సినిమా కోసం అచ్చం తిరుమల ఆలయ సెట్ వేసి చిత్రీకరించిన ఒక సీన్ అని తేలింది.చాలా ఆలయాల్లోకి స్మార్ట్‌ఫోన్స్, కెమెరాలు అనుమతించరు. కానీ.. సింహాద్రి అప్పన్న ఆలయంలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే.. కొందరి ఫొటోల పిచ్చి, సోషల్ మీడియాలో తామేదో గొప్ప పని చేశామని చెప్పుకోవాలన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దేవుడి గర్భగుడిలోకి పవిత్రంగా వెళ్లి నిర్మలమైన మనసుతో ఆ దేవుడిని దర్శించుకుని ఆలయంలో నుంచి బయటకు రావాలన్న ఆలోచన లేని కొందరు ఇలా అపచారం చేసి ఆలయ పవిత్రతను మంటగలుపుతుండటం దురదృష్టకరం. ఇక మీదటైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల్లో భద్రతా సిబ్బంది ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి, స్మార్ట్‌‌ఫోన్స్, కెమెరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆలయాల్లోకి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు.

5. 10 నుంచి శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు.. ఎందుకంటే..?
తిరుమలలో ఈనెల 10 నుంచి 12 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 65,577 మంది భక్తులు దర్శించుకోగా 29,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 06 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు . కాగా తిరుమలలోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

6. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ బుధవారం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయం నిర్మాణ పనులు, లడ్డు ప్రసాద విక్రయశాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాద తయారీ విధానం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.