Business

ఆర్బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌ సూచీలు- TNI వాణిజ్య వార్తలు

ఆర్బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌ సూచీలు- TNI వాణిజ్య వార్తలు

* వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఇప్పటికే కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం, ముడి చమురు ధరల ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా ఉండగా తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్టు పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఉదయం మార్కెట్‌ ఆరంభమైన గంట తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. మరోవైపు ఆర్బీఐ ఏకంగా రేపోవడ్డీ రేటును అంచనా బేస్‌ పాయింట్లు 25కు మించి 40 బేస్‌ పాయింట్లకు పెంచడంతో.. మార్కెట్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. సాయంత్రం ముగిసే వరకు అమ్మకాల హోరు తగ్గలేదు.
*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.
* కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.
* ఏప్రిల్‌ నెల ఎగుమతుల్లో మరో కొత్త రికార్డు నెలకొల్పింది. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, కెమికల్స్‌ విభాగాల మద్దతుతో ఏప్రిల్‌లో ఎగుమతులు 24.22 శాతం పెరిగి 3,819 కోట్ల డాలర్లకు (రూ.2.86 లక్షల కోట్లు) చేరాయి. ఒక నెలలో నమోదైన గరిష్ఠ ఎగుమతుల రికార్డు ఇదే. కాగా దిగుమతులు 26.55 శాతం పెరిగి 5,826 కోట్ల డాలర్లుగా (రూ.4.37 లక్షల కోట్లు) నమోదు కాగా వాణిజ్య లోటు 2000 కోట్ల డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) పెరిగింది.
*టాటా స్టీల్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,835.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.7,161.91 కోట్లు)తో పోల్చితే లాభం 37 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.50,300.55 కోట్ల నుంచి రూ.69,615.70 కోట్లకు పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.51 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. కాగా రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.1 ముఖ విలువ కలిగిన షేరుగా విభజించేందుకు బోర్డు సిఫారసు చేసిందని టాటా స్టీల్‌ తెలిపింది. కాగా నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఎన్‌ఎల్‌) కొనుగోలును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
*మూవీ ఈవెంట్స్‌, ప్రమోషన్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేయాస్‌ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపింది. 2011లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో 1,500కు పైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. తాజాగా దుబాయ్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. సమీకరించిన నిధులను పశ్చిమాసియా, అమెరికా సహా భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు శ్రేయాస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. సినిమా ఈవెంట్స్‌కు అనుబంధంగా కొత్త విభాగాల్లో ప్రవేశించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని వివరించారు. కాగా 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్‌, 120 మూవీ ప్రమోషన్స్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

*హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి ఎస్‌యూవీ క్రెటా కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చింది. క్రెటా నైట్‌ ఎడిషన్‌ పేరుతో తీసుకువచ్చిన ఈ ఎస్‌యూవీ ధరలు రూ.13.51 లక్షలు-రూ.18.18 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. 6 స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌తో కూడిన పెట్రోల్‌ వేరియంట్‌ క్రెటా ధర రూ.13.51 లక్షలు, రూ.17.22 లక్షలుగా ఉండగా డీజిల్‌ వేరియంట్స్‌ ధరలు రూ.14.47 లక్షలు, రూ.18.18 లక్షలుగా ఉన్నాయి.
*బీఎస్‌ఈ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీల్లోని షేర్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సూచీలు 4 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. అధిక వృద్ధి, రాబడులకు అవకాశం ఉన్నా.. ఏ చిన్న ప్రతికూల సంఘటన జరిగినా స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణ భయాలతో ఈ సూచీలు మరిన్ని ఆటుపోట్లకు లోనయ్యే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ సంవత్సరం ఇప్పటి వరకు బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1,095.98 పాయింట్లు (3.72 శాతం), మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 666.1 పాయింట్లు (2.66 శాతం) నష్టపోయాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2.19 శాతం (1,277.83 పాయింట్లు) మాత్రమే నష్టపోయింది.

*బోధి ట్రీ సిస్టమ్స్, జేమ్స్ మర్డోక్ యొక్క లూపా సిస్టమ్స్ మరియు ఆసియా పసిఫిక్‌లోని వాల్ట్ డిస్నీ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ యొక్క ప్లాట్‌ఫారమ్, ప్రీమియర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌లో $600 మిలియన్లకు వ్యూహాత్మక వాటాను కైవసం చేసుకుంది. కాగా… రెండు సంస్థలు విడుదల చేసిన ఒక ప్రకటనలో వాటా కొనుగోలు పరిమాణాన్ని మాత్రం పేర్కొనలేదు. భారత్‌లో ప్రముఖ వినోద వేదికను సంయుక్తంగా నిర్మించేందుకు, వయాకామ్ 18 లో రూ. 13,500 కోట్లను పెట్టుబడిదారుల కన్సార్టియంతో కలిసి నిధుల సమీకరణకు నాయకత్వం వహిస్తున్నట్లు బోధి ట్రీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ లావాదేవీ చోటుచేసుకోవడం గమనార్హం.