DailyDose

హైకోర్టులో వైఎస్ వివేకా కేసు.. హాజరైన సునీత – TNI తాజా వార్తలు

హైకోర్టులో వైఎస్ వివేకా కేసు.. హాజరైన సునీత – TNI తాజా వార్తలు

* నిందితుల తరఫున హైకోర్టులో ఇప్పటికే పూర్తయిన వాదనలు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో సునీత న్యాయస్థానానికి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ మీద ఉన్నారు. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే కోర్టును కోరారు.గత సోమవారం శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే సునీత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ వాదనలూ వినాలని అనుబంధ పిటిషన్‌ (ఇంప్లీడ్‌) దాఖలు చేశామని తెలిపారు. మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్‌ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే.

*రేపు (గురువారం) తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

*కొడవలూరులో SI Subbarao అరాచకాలు బయటపడ్డాయి. కొడవలూరులో వాహనాలు తిరగాలంటే.. మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ ఎస్ఐ సుబ్బారావు బెదిరింపులు వైసీపీ నేతల సహకారంతో ప్రతినెలా రూ.లక్షలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎస్‌ఐ వసూళ్లకు పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మామూళ్లు ఇవ్వనివారిని పీఎస్‌కు రప్పించి ఎస్ఐ చితకబాదుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఎస్‌ఐ ఆగడాలపై స్థానికుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

*తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 9వ తేదీన జరగనుందని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. women, children,disable and old age తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కమిటీ గుజరాత్ పర్యటన పై కూడా చర్చించనున్నట్టు తెలిపారు.

*ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా చాటింది. టీ20ల్లో భారత్‌ 270 పాయింట్లతో మరోమారు టాప్‌లో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో, 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో, 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో, 251 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్ధానాల్లో నిలిచాయి.

* నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నాయకులు సోమవారం స్థానిక ఆళ్వార్‌పేటలో ని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన పాండవర్‌ జట్టు.. తమ సంఘం ట్రస్టీ సభ్యుడిగా కమలహాసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్‌ మర్యాదపూర్వకంగా కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు కమలహాసన్‌ను సంఘం ట్రస్టీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు కమలహాసన్‌ కూడా అంగీకరించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో నటీనటుల సంఘం నాయకులు తెలిపారు.

*అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.

*రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలోని ధర్మవరం మండలం ఎల్లక్కుంట్లలో టీడీపీ కార్యకర్త గుత్తా సూర్యనారాయణకు చెందిన మామిడి తోటకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మామిడి టేకు ఎర్రచందనం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి నీటితోనే సాగుచేసుకుంటున్న తోటకు నిప్పు పెట్టడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

*బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ మసీదుకు స్థలం కేటాయింపుపై బీజేపీ కబ్జా అంటూ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ముస్లిం సోదరులు తల్చుకుంటే.. అంటూ హెచ్చరించారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు బహు తక్కువమంది అని…. వాళ్లు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ద్వారంపూడి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. స్థలంపై బీజేపీ రాజకీయం చేస్తే తాము కూడా ఇంకో రకంగా రాజకీయం చేయాల్సి ఉంటుందని అన్నారు. కోర్టులో ఉన్న వివాదంపై ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి.

*పార్వతీపురం మన్యం: జిల్లాలోని పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఊళ్ల చంటి అనే వ్యక్తం ధ్వంసం చేశారు. విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. సమాచారం అందిన వెంటనే పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే చంటి ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

*శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి గైర్హాజరయ్యారు. సభలో నాయకులు, అధికారులు బైరెడ్డి పేరే ఎత్తలేదు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అయన పేరును కూడా తీయలేదు. కాగా ఇప్పటికే బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే నాయకులు, అధికారులు బైరెడ్డి పేరు ఎత్తలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది

*గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. గూల్యపాళ్యం రైల్వే స్టేషన్ ఔటర్‌లో నిలిపిన రైల్ ఇంజిన్‌లో గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. రూ.లక్షల విలువైన రైలు విడిభాగాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

*వేసవి నేపథ్యంలో ప్రజలకు అంబలి పంపిణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర అంబలిని పంపిణి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎండ వేడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేసవి కావడంతో ప్రజలకు మంచి పోషకాలు ఉన్న ద్రావకం అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 45 రోజుల పాటు రోజుకు వెయ్యి మందికి అంబలి అందిస్తామన్నారు. కొల్లు ఫౌండేషన్ సారథ్యంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కొల్లు రవీంద్ర వెల్లడించారు

*భారీ వర్షం కారణంగా నగరంలోని నల్లకుంటలో రోడ్డు కుంగింది. దీంతో నల్లకుంట నుండి వీఎస్టీ వైపు వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. గత కొద్ది రోజుల క్రితం స్టీల్ బ్రిడ్జి కోసం రోడ్డు తవ్వకం జరిగింది. రోడ్డు కిందే పెద్ద నాలా ఉండడం… ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైనేజీ నీరు పొంగి రావడంతో 20 లక్షల మెటిరియల్ నీటిలో మునిగిపోయిందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

*మచిలీపట్నంలో పేదల ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్‌కు వరుణుడు అడ్డంకయ్యాడు. జియో ట్యాగింగ్ చేసేందుకు స్థలాల వద్దకు అధికారులువాలంటీర్లు చేరుకున్నారు. అయితే వర్షం కురవడంతో ఇళ్ల స్థలాలలో వర్షపు నీరు నిలిచింది. ఇవాళ జియో ట్యాగింగ్ పూర్తయితే గురువారం నుంచి ఇళ్ల నిర్మాణం చేపడదామని లబ్ధిదారులు అనుకున్నారు. అకాల వర్షంతో జియో ట్యాగింగ్ నిలిచిపోయింది.
* హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్‌, సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేటలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

*ఏపీలో వరుసగా జరుగతున్న ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం చేయడానికి ముగ్గురు రాలేదు.. ముగ్గురు బాగా మద్యం సేవించి ఉన్నారని వెల్లడించారు. డబ్బుల కోసం మొదట భర్తపై దాడి చేసారు.. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. దీంతో మహిళను పక్కకు లాక్కునివెళ్ళి అత్యాచారం చేశారని.. గంజాయి వల్ల నేరాలుజరుగుతున్నాయని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వెల్లడించారు. గత డిజిపి గంజాయిని ఎలా ధ్వంసం చేశారో అందరికీ తెలుసు అని.. గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తున్నామన్నారు.రైల్వేస్టేషన్ లో భద్రతను పెంచటంతో పాటు సీసీ కెమేరాలు ఏర్పాటు చెయ్యటానికి చర్యలు తీసుకుంటున్నాం.. గడప గడపకు కార్యక్రమం పోస్టు పోన్ చెయ్యడంలో రాజకీయ కోణం లేదని చెప్పారు. ప్రతి ఇంటికి సగటున 5 పథకాలు అందుతున్నాయి.. ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయో వాటికి సంబంధించిన డేటా తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఆ సమాచారం తీసుకున్న తర్వాత గడప గడపకి ప్రోగ్రాం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు వనిత…

*సత్యసాయి జిల్లా :చిలమత్తూరు ఎస్సై రంగడు యాదవ్ ను వీ.ఆర్ కు తీసుకొస్తూ డి.ఐ.జి ఉత్తర్వులు జారీ.పోలీసు స్టేషన్ కు వచ్చిన వ్యక్తిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారించి వీ.ఆర్ కు పంపినట్లు వెల్లడికస్టోడియల్ హింసకు తావిస్తే ఎవరికైనా చర్యలు తప్పవన్న రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ .

* ఎన్టీపీసీ సింహాద్రిలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడంపై ఎన్టీపీసీ వివరణ ఇచ్చింది. నాలుగు యూనిట్లలో ఒకేసారి గ్రిడ్‌ వైఫల్యం చెందడానికి గల కారణాలను వెల్లడించింది.భారీగా వీచిన ఈదురుగాలులు, వర్షంతో గాజువాక, కాలపాకలో సబ్‌స్టేషన్లు ట్రిప్‌ అయ్యాయని తెలిపింది. దీంతో సింహాద్రిలోని నాలుగు యూనిట్లలోనూ ట్రిప్‌ అయి రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. నేషనల్‌ గ్రిడ్‌ నుంచి ప్రత్యా్మ్నాయ విద్యుత్‌ను సరఫరా చేస్తు్న్నామని.. 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమయ్యాయని ఎన్టీపీసీ తెలిపింది. 2, 3 యూనిట్లలో మరమ్మతులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించింది. సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఎన్టీపీసీ వెల్లడించింది.

*ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* జగన్‌ ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత అడిషనల్‌ ఎస్పీలకు పోస్టింగులిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 2021లో డీఎస్పీల నుంచి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 38 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రవ్యా ప్తంగా పోలీసుశాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టడంలేదంటూ వారంక్రితం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. అడిషనల్‌ ఎస్పీ స్థా యి అధికారులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. వెయిటింగ్‌లో ఉన్న 38 మంది అడిషనల్‌ ఎస్పీలకు పోస్టింగులివ్వడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో పనిచేస్తున్న 14 మందిని బదిలీ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ జీవో జారీ చేశారు.

*న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులతో అనంతపురం, గుంటూరు జిల్లాల్లో రెండు హైలెవెల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ రహదారులు, బ్రిడ్జిల పునర్నిర్మాణ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ) కింద ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. అనంతపురం జిల్లాలో స్టేట్‌ హైవే 416పై ఉరవకొండ-కనేకల్‌ మార్గంలో రూ.33.18 కోట్లతో ఓ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. గుంటూరు జిల్లాలో గుంటూరు-చీరాల రహదారిపై కొమ్మమూరు కెనాల్‌పై రూ. 26.74 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలిచారు. ఈ రెండింటికీ జూన్‌ 8 వరకు బిడ్‌లు స్వీకరించ నున్నారు. జూన్‌ 9న బిడ్‌లు తెరవనున్నట్లు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ (ఎన్‌డీబీ) వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొమ్మమూరు కెనాల్‌పై హెలెవల్‌ బ్రిడ్జి టెండర్లు ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. నిజానికి గతేడాది ఏప్రిల్‌ 24న ఈ పనులకు తొలిసారి టెండర్లు పిలిచారు. ఈ ఏడాది జనవరి 17న మరోసారి టెండర్లు పిలిచినా అవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మూడోసారి టెండర్లు పిలిచారు. ఈసారైనా టెండర్‌ ఖరారవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీనికితోడు రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి ఏర్పడి కోస్తాలో మంగళవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీగా, దక్షిణ కోస్తా, సీమల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, మంగళవారం పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 42.6 డిగ్రీలు నమోదైంది.

*శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా పండ్లతోటలకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి, నేరేడు పండ్లు నేలకొరిగాయి. తాడిమర్రికి చెందిన రైతు పార్నపల్లి ప్రభాకర్‌కు చెందిన మామిడి తోటలో నాలుగు టన్నుల దాకా కాయలు నేలరాలాయి. లక్ష్మన్న అనే రైతుకు చెందిన మామిడిచెట్లు పూర్తిగా నేలకొరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది.

*రాష్ట్రంలో గుంటూరు లేదా విజయవాడ కేంద్రంగా సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్ర లాయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి అవధానుల హరి కోరారు. గుంటూరులో మంగళవారం జరిగిన అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిసా ఇతర దక్షణాది రాష్ట్రాల ప్రజలకు సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ మేరకు సీజేఐ కేంద్రానికి ప్రతిపాదన చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్‌ మాట్లాడుతూ హైకోర్టు అమరావతిలోనే ఉంచాలని, కావాలంటే హైకోర్టు బెంచ్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు.

*పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిన్న వీరభద్రుడికి జైలు శిక్షతో పాటు జరిమానా పడింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు బీపీఈడీ కోర్సును అభ్యసించేందుకు అనుమతించాలని గత ఏడాది మార్చి 8న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఎస్‌జీటీలు హైకోర్టులో ధిక్కరణ వాజ్యం వేశారు. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోలేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో చిన్న వీరభద్రుడిపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో బీపీఈడీ కోర్సును అభ్యసించడానికి అనుమతించకపోవడాన్ని తప్పుపట్టింది. అయితే కోర్టు తీర్పు అమలు చేయడం ఆలస్యం అయినందుకు చిన్న వీరభద్రుడు క్షమాపణ చెప్పినా అంగీకరించలేదు. నిజాయితీగా క్షమాపణలు చెప్పినట్టు లేదని హైకోర్టు భావించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు అవసరమైన డిగ్రీని అభ్యసించేందుకు అవరోదంగా ఉన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ మెమోను కూడా రద్దు చేసింది. చిన్న వీరభద్రుడికి నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 2 వేలు జరిమానా విధించింది. న్యాయవాది అభ్యర్ధన మేరకు తీర్పు అమలును రెండు వారాల పాటు నిలుపుదల చేసింది.

*కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలని, నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న డిమాండ్లతో టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ బుధవారం నుంచి కృష్ణా జలాల పరిరక్షణ యాత్రను చేపట్టనున్నారు. ఉదయ సముద్రం పానగల్‌ వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 9న నక్కలగండి ప్రాజెక్టు వద్ద ముగియనుంది. మొత్తం 150 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర ఉంటుంది. కాగా, రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా కొందరు విద్యార్థి సంఘాల నేతలు ఆయన్ను ఓయూకు ఆహ్వానించాలనుకుంటే దాన్ని ఆక్షేపించడం సరికాదని కోదండరామ్‌ అన్నారు. ఆక్షేపిస్తే అది వర్సిటీ భావ ప్రకటనా స్వేచ్చకు నష్టం చేస్తుందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వర్సిటీలో స్వతంత్ర చర్చకు అవకాశం ఉండాలన్నారు.

* బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.

*వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను వారి ఇళ్ల వద్దకే చేర్చడానికి టీఎ్‌సఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో అగ్రగామిగా నిలిచిన టీఎ్‌సఆర్టీసీ ఈ సీజన్‌లో లభ్యమయ్యే మామిడి పళ్లను వినియోగదారుల ఇంటి వద్దకు లేదా వారు కోరుకున్న చోటికి కార్గో, పార్సిల్‌ సేవల విభాగం ద్వారా పంపడానికి సిద్ధమైంది. ఆర్టీసీ వెబ్‌సైట్‌ http://www.tsrtcparcel.in ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే 5, 10, 15 కిలోలతోపాటు టన్ను నుంచి 10 టన్నుల వరకు వారం రోజుల్లో మామిడి పండ్లను అందిస్తామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ తెలిపారు. మామిడి పండ్ల ధర కిలో రూ.115 గా పేర్కొన్నారు. జంటనగరాల్లోని కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు సామూహికంగా ఆర్డర్‌ చేస్తే నేరుగా ఆయా ప్రాంతాల్లోనే అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440000 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

*తెలంగాణ ఎంసెట్‌కు మంగళవారం నాటికి 1,48,902 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 94,932 మంది ఇంజినీరింగ్‌ విభాగానికి, 53,970 మంది అభ్యర్థులు అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా, ఈ దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉంది. జూలై 14 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌ నిర్వహిస్తారు.

*ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంపు విజ్ఞప్తిని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎ్‌సపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 నుంచి ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని.. దీంతో వేల మంది నిరుద్యోగులు తమ తప్పు లేకుండానే ఉద్యోగాలకు అనర్హులుగా మారిపోయారని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ఎ.వెంకన్న, మరో ఐదుగురు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పలుమార్లు తాము వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడలేదని.. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చి పదేళ్లకుపైనే అవుతోందని తెలిపారు. ప్రభుత్వోద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి లేకుండా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఓ జీవో జారీచేసిందని గుర్తుచేశారు.

*మే 28న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతానని కేఏ పాల్ వెల్లడించారు. కవితను అరవింద్ ఓడించినట్లు కేసీఆర్, కేటీఆర్‌ను కూడా ప్రజలు ఓడిస్తారని చెప్పారు. కేసీఆర్ హిట్లర్‌లాగా ప్రవరిస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 10 యుద్ధాలు ఆపానని, కోదండరాంను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆలోచించి చెపుతానని కోదండరాం చెప్పినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నానని చెప్పారు. మళ్ళీ తాను సిరిసిల్ల వెళ్తానని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణను చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. కేసీఆర్‌కు తాను గతంలో సపోర్ట్ చేశాననన్నారు. తెలంగాణలో మార్పు రావాలని, కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్, చిన్నజీయర్ స్వామి ఎందుకు వదిలేశారో తెలియాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్ పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని కేఏ పాల్ తెలిపారు. పీకే జాతీయ పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ పది వేల కోట్లు ఇస్తాడని పీకే తనతో చెప్పారని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కేఏ పాల్ పేర్కొన్నారు.

*నిత్యం నిఘా నీడలో ఉండే ఫోరం మాల్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి వెండి ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగను మంగళవారం కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. నాంపల్లికి చెందిన మాజిద్‌ఖాన్‌ గతంలో ఫోరమ్‌మాల్‌లోని వస్త్ర దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసి మానేశాడు. గత నెల 30న మాల్‌లోకి వెళ్లి రెండో అంతస్తులోని ఓ దుకాణంలో ప్రవేశించి వెండి ఆభరణాలు బ్యాగులో సర్దుకుని వెళ్లిపోయాడు. ఉదయం షాప్‌నకు వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీఫుటేజ్‌ ద్వారా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం కేపీహెచ్‌బీ రోడ్డునెంబర్‌ 1లో అనుమానాస్పదంగా కనిపించిన మాజిద్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి రూ.7.80లక్షలు విలువజేసే 6.5కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురిసాయి. తెల్లవారుజామున పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడ్డాయి. మాచర్ల మండలం కంభంపాడులో పిడుగుపడి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొత్తూరులో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శిలో, కురిచేడులో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.బాపట్లలో కురిసన వర్షంతో శనగ రైతులు నష్టపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో భారీగా ఈదురుగాలులకు వంద ఎకరాల్లో మామిడి నేలరాలింది. లక్షలాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగు తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వివరించింది. రాగల రెండు రోజుల్లో ఏపీలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

* అమీర్ పేట్‌లోని ప్రజా శాంతి పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామ కొనసాగుతోంది. పార్టీ ఆఫీసుకు మళ్లీ పోలీసులు వచ్చారు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళేందుకు కేఏ పాల్‌కు అనుమతి లేదని, ఒకవేళ డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు.డీజీపీ కార్యాలయానికి బయలుదేరడానికి కేఏ పాల్ సిద్దమయ్యారు. మూడు రోజుల క్రితం తనపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ, సీఐలపై డీజీపీకి పిర్యాదు చేస్తామన్నారు. డీజీపీ అపాయింట్‌మెంట్ లేకపోవడంతో వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ డీజీపీ కార్యాలయానికి వెళ్తామని కేఏ పాల్ వర్గీయిలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు.

* కైకలూరుఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి పరీక్ష లు 2022 లో భాగముగా సోమవారం జరిగిన లెక్కల పరీక్ష మాల్ ప్రాక్టీసు కేస్ లో 9 మంది పై కేస్ నమోదు చేసినట్లు కైకలూరు సి ఐ వి. వి. ఎల్. నాయుడు మంగళవారం తెలిపారు. మండవల్లి హై స్కూల్ నందు మాల్ ప్రాక్టీసు జరిగినట్లు మండవల్లి హై స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ గుడివాడ గోపాల కృష్ణ ఇచ్చిన పిర్యాదు మేరకు కానుకొల్లు హై స్కూల్ ఉపాధ్యాయడు బేతాళ అబ్రహం రత్న కుమార్ ను అదుపులోనికి తీసుకుని విచారించగా మండవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు మేడేపల్లి జాన్ విల్సన్, అప్పికట్ల సతీష్, భట్రాజు శేషారావు, ఇంటి రమేష్, పరిక్షాహల్ లోని కొనికి చక్రవర్తి, అనే ఉపాధ్యాయుడు పై కేస్ నమోదయిందన్నారు. వీరితో పాటు అటెండర్ బార్య , ఆశవర్కర్ నందికోళ్ల శ్రుతి ల పై కేస్ నమొదు చేసి కైకలూరు సి. ఐ. గారి ఆధ్వర్యములో దర్యాప్తు చేస్తున్నారు.

* విజయవాడ: నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాలతో అజిత్ సింగ్ నగర్ వాంబేకాలనీలో పోలీసులు బుధవారం నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. నార్త్ డివిజన్ ఇన్‌ఛార్జ్ ఏడీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు చేపట్టారు. వాంబే కాలనీ, ఎక్స్ ఎల్ ప్లాంట్ ఏరియాలో ఈ రోజు ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఐదు బృందాలుగా నార్త్ డివిజన్‌లోని ఇన్ స్పెక్టర్స్ నేతృత్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

* ఉస్మానియా యూనివర్శిటీలో టెన్షన్ వాతవరణం కొనసాగుతోంది. ఎన్‌సీసీ గేట్, ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాహుల్ పర్యటనకు పాలక మండలి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రంజాన్ సెలవుల కారణంగా రెండు రోజులుగా వీసీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వీసీ వైఖరిపై తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓయులో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలోని ధర్మవరం మండలం ఎల్లక్కుంట్లలో టీడీపీ కార్యకర్త గుత్తా సూర్యనారాయణకు చెందిన మామిడి తోటకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మామిడి టేకు ఎర్రచందనం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి నీటితోనే సాగుచేసుకుంటున్న తోటకు నిప్పు పెట్టడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

* మద్యం దుకాణాలు మూసి విద్యార్థులను కాపాడడంపై దృష్టిసారించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో విద్యార్థులు మద్యం సేవించడం, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు చిన్న వయస్సులోనే మద్యానికి బానిసలు కావడం బాధాక రమని విచారం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు మూసే చర్యలు చేపట్టాలని రాందాస్‌ విజ్ఞప్తి చేశారు.

* యాదగిరిగుట్టలో భారీ వర్షానికి ఘాట్ రోడ్డు కుంగిపోయింది. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు కాలినడకన కొండపైకి వెళుతున్నారు. ఘాట్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసినా పనుల్లో నాణ్యత అస్తవ్యస్తంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

* తెలుగు దేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారం రోజుల క్రితం చింతలపూడిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేనిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కేసు పై తదుపరి చర్యలను నిలిపి వేస్తూ ధర్మాసనం స్టే ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ తరుపున హైకోర్టులో పోసాని వెంకటేశ్వర్లు, కె.ఎం.కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.

*రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

*ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొంది.పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్‌ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్‌ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్‌ చానళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022 ఎడిషన్, వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే అయిన 3న విడుదలైంది.