Devotional

3 గంటల్లోనే శ్రీవారి దర్శనం – TNI ఆధ్యాత్మికం

3 గంటల్లోనే శ్రీవారి దర్శనం – TNI ఆధ్యాత్మికం

1. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,265 మంది దర్శించుకోగా, స్వామివారికి 31,217 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.50 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనం 3 గంటల్లోనే లభిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమతాలకు సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు కలిగి ఉన్న ఎడల వాటిని విజిలెన్స్‌ సిబ్బంది వాహనదారులకు వివరించి తీసివేస్తున్నారు. కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవిలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా టీటీడీ రద్దు చేయనుంది.ఈ సేవలు రద్దు చేసిన రోజుల్లో కూడా సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ జూన్‌ 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు సమాచారం

2. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 76,324 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,710 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

3. టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి కొనసాగింపు?
టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి మరో రెండేళ్లపాటు అదే పదవిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన డిప్యుటేషన్‌ను మరో రెండేళ్లు పొడి గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి ప్రతిపాదన పంపించింది. ఈనెల 14 నాటికి ఆయన డిప్యుటేషన్‌ ముగియనుంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఏడు సంవత్సరాల డిప్యుటేషన్‌ పూర్తిచేసుకున్నట్లవుతుంది. కేంద్ర నిబంధనల ప్రకారం కేంద్ర సర్వీసుల నుంచి వెళ్లిన ఏ అధికారీ ఏడేళ్లకు మించి డిప్యుటేషన్‌పై ఉండటానికి వీల్లే దు. అయితే, ఆయన సర్వీసులు తమకు అవసరమని, ఇంకొంతకా లం కొన సాగించాలని సీఎం జగన్‌ కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

4. తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్‌ ఇప్పిస్తానని ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి విజయవాడకు చెందిన భక్తుడిని మోసగించిన ఘటన శనివారం వెలుగు చూసింది. విశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి పంజా రమణప్రసాద్‌.. విజయవాడకు చెందిన సత్యనారాయణకు రూ.కోటి విలువ కలిగిన తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్‌ను తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో సత్యనారాయణ రూ.94 వేలు రమణప్రసాద్‌కు పంపాడు. నగదు తీసుకున్నప్పటికీ నుంచి రమణప్రసాద్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సత్యనారాయణ తిరుమల విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు నకిలీ గుర్తింపు కార్డులతో సుప్రభాతసేవ టికెట్లు పొంది దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించిన హైదరాబాద్‌కు చెందిన జిల్లా ప్రసాద్‌, అతని భార్యను కూడా విజిలెన్స్‌ అధికారులు శనివారం గుర్తించారు.

5. శ్రీవారి ఆలయంలో వారపు సేవలు తాత్కాలికంగా రద్దు!
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను తాత్కాలికంగా రద్దు చేసేందుకు తితిదే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా తితిదే రద్దు చేస్తున్నట్లు తెలిసింది. అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యామ్నాయంగా బ్రేక్‌ దర్శనాన్ని కల్పించాలని తితిదే నిర్ణయించింది. వేసవి రద్దీ దృష్ట్యా వారపు సేవలను తితిదే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారపు సేవలైన విశేష పూజ, సహస్ర కలశాభిషేకంతో పాటు నిత్య సేవైన వసంతోత్సవ సేవను శాశ్వత ప్రాతిపదికన తితిదే రద్దుచేసి సంవత్సరానికి ఒక పర్యాయం నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ రద్దు కానున్నాయి.

6. 2023లో Veluruలో వేసవి ఉత్సవాలు
చెన్నై జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా వచ్చే 2023లో వేసవి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలను డిజిలైటేషన్‌ చేసి ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా సమస్యలు, ఫిర్యాదులు తెలిపేలా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా విమానాశ్రయ విస్తరణ పనులు త్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే, పట్టణంలో చేపట్టిన స్మార్ట్‌ సిటీ పథక పనులు కూడా వేగవంతం చేయనున్నామన్నారు. జిల్లాను పర్యాటకు ప్రాంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించామని, ఈ పనులు పూర్తిచేసి 2023లో వేసవి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు

7. ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం=ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు
ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్‌ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్‌ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్‌ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు.ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది.