WorldWonders

ఈ ఐస్ క్రీం చాలా ‘హాట్’ గురూ!

ఈ ఐస్ క్రీం చాలా ‘హాట్’ గురూ!

స్కాట్లాండ్లోని గ్లాస్గో కెఫెలో తయారుచేసే ‘రెస్పిరొ డెల్ డియవొలొ’ అనే ఐస్క్రీమ్ తినడానికి కాదు, కనీసం సిప్ చేయడానికి కూడా ఎంతో గుండె ధైర్యం కావాలి. సాధారణ మిర్చితో పోలిస్తే ఇది అనేక రెట్లు కారంగా ఉంటుందట, అక్కడివాళ్లకు సుపరిచిత మైన టబాస్కో సాస్కన్నా 500 రెట్లు ఘాటుగా ఉంటుందట. కారాన్ని కొలిచే స్కావెల్లె స్కేలు ప్రకారం దీని ఘాటు 15,69,300 యూనిట్లు. అందుకే దీన్ని ‘ వరల్డ్ మోస్ట్ డేంజరస్ ఐస్క్రీమ్’గా పిలుస్తుంటారు. దీన్ని గ్లోవ్స్ వేసుకుని తప్ప సర్వ్ చేయరట. ఇది రుచి చూడాలన్నా 18 సంవత్సరాలు నిండాలి. పెద్దవాళ్లు తినాలన్నా కూడా ‘ తిన్నాక తలెత్తే సమస్యలకు బాధ్యత మాదే అన్న డిస్ క్లెయి మర్ ఫామ్ ఇవ్వాలి. ఈ కెఫె యజమాని స్వదేశమైన ఇటలీకి వెళ్లి నప్పుడు వచ్చిన ఆలోచన ఫలితమే ఈ ఐస్క్రీమ్. ఓ సంప్రదాయ వంటకం ఆధారంగా రూపొందించారట. వాలెంటైన్స్ డే సమయం లోనే తయారుచేసే ఈ ఐస్క్రీమ్ని నోట్లో పెట్టుకుంటే అణుబాంబు పేలినట్లే ఉంటుందట. అయినా స్కాట్ల్యాండ్కి చెందిన కొందరు యువతీయువకులు కూడా ‘మిర్చి శృంగార ప్రేరితం’ అంటూ దీన్ని వైన్ సాయంతో చప్పరిస్తున్నారట.
cs3