Movies

బ్రేకప్ అట

బ్రేకప్ అట

‘ఖాలి పీలి’ సినిమా తర్వాత బాలీవుడ్ చిన్నది అనన్యపాండే , ఇషాన్ కట్టర్ల నడుమ దోస్తీ బాగా సాగింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపించడంతో డేటింగ్లో వున్నారన్న వార్తలు జోరుగా సాగాయి. త్వరలో పెళ్ళికబురు చెప్తారని అంతా భావించారు. ఈ మేరకు బాలీవుడ్ మీడి యాలో వార్తలు బాగా వినిపించాయి. ఐతే ఆ మధ్య ఇషాన్ తల్లి నీలిమ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే, అంటూ ఓ మాట చెప్పింది. ఇదంతా గతం. ఇప్పటి వార్తయితే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, స్నేహబంధాన్ని కొనసాగిస్తారని కబురు … నిజమా !