DailyDose

విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం- TNI నేర వార్తలు

విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం- TNI  నేర వార్తలు

* విజయవా నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. లంబాడి పేటలో స్థానికులు గంజాయి వారిపై సమాచారం ఇచ్చారంటూ ఐదు ద్విచక్ర వాహనాలను దుండగులు తగలబెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానంతో ద్విచక్ర వాహనాలు తగులబెట్టారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* వైఎస్సార్ జిల్లాలోని బీకేఎం వీధిలోని మెహతా బంగారు దుకాణం నుంచి ఆభరణాలు ఎత్తికెళ్లిన వ్యక్తిని పోలీసులు 4 గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుడిని దుకాణంలో పనిచేసే గుమస్తాగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కేసును నాలుగు గంటల్లోనే చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

*భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు మండలం బొంబాయితండాలో వివాహ వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లికొడుకు బంధువులు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు పెళ్లికొడుకు బంధువులు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేందుకు పోలీసుల ప్రయత్నం చేశారు. అడ్డుకుని ఎస్సై రమణారెడ్డిపై ఏడుగురు స్థానికులు దాడికి యత్నించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*విశాఖ: జిల్లాలోని పెళ్లింట విషాదంలో మరో మలుపు తిరిగింది. సృజన ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషం తాగి ఉండొచ్చని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉంది. కాగా తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ-సృజనల వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికి అటు వరుడు.. ఇటు వధువు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. వరుడు.. వధువు తలపైన జీలకర్ర బెల్లం పెడుతుండగా ఆమె సృహ కోల్పోయింది. ఒక్కసారిగా ఆమె పీటలపైనుంచి కింద పడిపోవడంతో అప్రమత్తమైన కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి (Hospital) తరలించేలోపే వధువు సృజన తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కాగా.. ఎక్కువ అలసిపోవడం వల్ల వధువుకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

*రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై గోవాలో అత్యాచారం జరిగింది. ఉత్తర గోవాలోని అరంబోల్‌లో ఓ రిసార్ట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. రిసార్ట్‌‌లో రూం అటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటకకు చెందిన నిందితుడిని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు పెర్నెం స్టేషన్‌ పోలీసు బృందం వెల్లడించింది. 28 ఏళ్ల నిందితుడి పేరు రవి లమానీ వివాహితుడని, మే 10న అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరించారు. మే 6న అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించారు. బాలిక తల్లి మే 9న తమకు ఫిర్యాదు చేసిందని వివరించారు.

*మినీ లారీ డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ హత్యకేసులో భాగంగా పోలీసుల ఎదుట లక్ష్మీకాంతరెడ్డి లొంగిపోయాడు. ప్రధాన నిందితులు హరికృష్ణ, అశోక్ పరారీలో ఉన్నారు. ఏప్రిల్ 19న పెబ్బేరు దగ్గర రెహమాన్ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని సిమెంట్ రింగ్‌లో వేసి కాంక్రీట్‌తో సీల్ చేసి ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గర చెరువులో నిందితులు పడేసివుండటం స్థానికులు గుర్తించారు.

*గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడిగా కత్తెర సురేష్ ఉన్నారు. FCRA నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడంపై కేసు నమోదైంది. పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌కి బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

*ఏలూరు: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందిన మహిళ డైమండ్ రింగ్(Daimond ring ) మాయం కలకలం రేపుతోంది. కిడ్నీ వ్యాధికి చికిత్స నిమిత్తం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆరుద్ర మౌనిక(33) ఈ నెల 10న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న మౌనిక మృతి చెందింది. కాగా.. ఆమె వేలికి ఉండాల్సిన డైమండ్ రింగ్ లేకపోవడాన్ని బంధువులు గుర్తించారు. దీనిపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*మదురై సమీపంలో మద్యం స్టాకుతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. మదురై సమీపంలోని మనలూరు మద్యం గోడౌన్‌ నుంచి బుధవారం ఉదయం సుమారు రూ.10 లక్షల విలువైన మద్యంతో బయల్దేరిన సరుకు వ్యాన్‌ వీరనూరు రింగ్‌ రోడ్డులో వస్తూ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో, వ్యాన్‌లోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలిసి మద్యం ప్రియులు మద్యం కోసం పోటీపడ్డారు.

*నంద్యాల: జిల్లాలోని నందికొట్కూరులో మునిసిపాలిటీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పగిడ్యాల రోడ్డులోని డ్రైనేజీ కాలువలపై ఉన్న బండలను జేసీబీలతో తొలగించేందుకు అధికారులు యత్నించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఆక్రమణ పన్నును అధికారులు వసూలు చేసినట్లు స్థానికులు తెలిపారు.

*యువ‌త‌ను మ‌త్తుతో చిత్తు చేస్తున్న డ్ర‌గ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్ర‌మంగా న‌డిపిస్తున్న‌ హుక్కా బార్‌పై పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. యూపీలోని కాన్పూర్ క‌లాసీ లైన్ ప్రాంతంలో ఆఫ్‌లైన్ కేఫ్‌తో పాటు కొహ్నాలో ఫ్రెండ్స్ కేఫ్‌పై పోలీసులు దాడులు చేప‌ట్టారు.

*విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి 5 ద్విచక్ర వాహనాలు తగలబెట్టారు. నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతిరోజూ లంబాడిపేట ప్రాంతంలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్ఙిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తున్నామనే అనుమానంతో.. ద్విచక్ర వాహనాలు తగులబెట్టి ఉంటారని స్థానికుల అనుమానం వ్యక్తం చేశారు. టూటౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

*టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం చాంగ్‌కింగ్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతుండగా అగ్నిప్రమాదం జరిగింది. నైరుతి నగరమైన చాంగ్‌కింగ్‌ నుండి టిబెట్‌లోని నైన్చికి వెళుతున్న టివి9833 విమానం గురువారం ఉదయం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా దిశ మార్చుకొంది.విమానంలో అసాధారణ పరిస్థితులను గుర్తించిన సిబ్బంది వెంటనే టేకాఫ్‌ కాకుండా నిలిపివేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చాంగ్‌కింగ్‌ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఘటనా స్థలంలో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. మార్చి 12న కున్మింగ్‌ నుండి గాంగ్‌జౌ వెళ్తున్న విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 132 మంది ప్రయాణికులు సహా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.

*గుంటూరు జిల్లా (గురజాల)బాలికపై అత్యాచారయత్నం… కేకలు వేయడంతో..!ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేదు… ఆడపిల్ల అయితే చాలు… అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై ఓ కీచకుడు లైంగిక దాడికి యత్నించాడు.

*శంషాబాద్ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి ఏసీబీ రైడ్ చేసింది. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.

*రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు పెళ్లికాని బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్‌ చేయడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో రామరక్ష ఆసుపత్రి వైద్యులు బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్‌ చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అధికారులు ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు 417, 420, 312, 342, 376, పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎంత మందికి అబార్షన్‌ చేశారు. ఎప్పుడు ఏ సమయంలో అబార్షన్స్‌ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.

*లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పిల్లర్ నెంబర్ వై ఫైబర్ సర్కిల్ ఎదురుగా..కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద పడివున్న యువకుడి బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడి పక్కా స్కెచ్ తో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*వారిది ప్రేమ వివాహం.. ఆ అన్యోన్య దాంప‌త్యానికి పండంటి ఇద్ద‌రు కుమారులు. ఆర్థిక ఇబ్బందుల‌తో భ‌ర్త గ‌ల్ఫ్ వెళ్ల‌డంతో.. భార్య త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి స్వ‌గ్రామంలోనే ఉంటోంది. అయితే అత్త‌మామ‌లు ఆమెను వేధింపుల‌కు గురి చేశారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వివాహిత త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌ప‌ల్లిలో గురువారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.
*నారాయణపేట: జిల్లాలోని మాగనూరు దగ్గర ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*యాదగిరిగుట్ట బస్ డిపోలో విషాదం చోటు చేసుకుంది. బస్ కింద పడి ఆర్టీసీ డ్రైవర్ మిర్యాల కిషన్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. డిపోలోని బంక్ వద్ద డీజిల్ నింపుకొని వెళ్తున్న బస్ కింద కిషన్ పడిపోయాడు. ఈ నెల చివరలో కిషన్ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారుల వేధింపుల వల్లే కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా మంజూరు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బతికున్న వ్యక్తిని మరణించినట్లు నమోదు చేయడంతోపాటు.. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. తన భార్య గ్రామ సచివాలయ వాలంటీర్‌గా పని చేస్తున్నందున వీఆర్వోతో కలిసి మరణ ధ్రువీకరణ పత్రం పొంది వితంతు పింఛనుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు బళ్లారి సుభాహాన్‌ బాషా ఆరోపిస్తున్నారు. తాను బతికే ఉన్నానని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.

* నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు మాగనూరువద్ద రోడ్డుపై ఉన్న బర్రెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనరు బాలిక ఆశ్రయం పొందుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయారు. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

*రాజంపేట మండలం కిష్టమ్మ చెరువులో దూకి డిగ్రీ చదువుతున్న విద్యార్థి చలపాని రెడ్డయ్య (21) ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్వేలి మండలం మరాటిపల్లెకు చెందిన రెడ్డయ్య రాజంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మూడు రోజుల కిందట కళాశాలకు వెళ్లి వస్తానని ఇంటి వద్ద బయలుదేరి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. రెడ్డయ్య కోసం బంధువులు గాలించి కిష్టమ్మ చెరువులో చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు భోరున విలపించారు. కాగా విద్యార్థి మరణానికి ఇంకా కారణాలు తెలియరాలేదని, మృతుడు రెడ్డయ్య తండ్రి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నామని మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు.

*మరికొద్ది గంట ల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటిదాకా బంధువులతో కలిసి సరదాగా గడిపి, అందరూ నిద్రపోయాక ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. విశాఖపట్నం నగరం మల్కాపురం ప్రాంతంలోని జై ఆంధ్రా కాలనీకి చెందిన పాటి దినేశ్‌(25) హెచ్‌పీసీఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి పెందుర్తి సమీపంలోని పెదగాడి ప్రాంతానికి చెంది న యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి 10:15 గంటలకు గాజువాకలో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం దినేశ్‌ను పెళ్లికొడుకును చేశారు. అర్ధరాత్రి వరకు బంధువులతో సరదాగా గడిపాడు. ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున మూడున్నర సమయం లో మేల్కొన్న కుటుంబ సభ్యులకు దినేశ్‌ కనిపించలేదు. అంతా వెతకగా, మేడపై బట్టలు ఆరేసుకునేందుకు ఉపయోగించే ఇనుప పైపునకు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. దినేశ్‌ రాసినట్టు భావిస్తున్న సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. తనను ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నారని, కంపెనీలో పనికి వెళితే.. కాంట్రాక్టర్‌ అతని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నాడని అందులో ఉంది. భవిష్యత్తుపై బెంగతోనే దినేశ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

*వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని చెప్పినా వినకపోవడంతో కన్నతల్లిని ఓ కొడుకు చంపేశాడు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలుకు చెందిన చాకలి ఈశ్వరమ్మ( భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. కుమారుడు కుమార్తె ఉన్న ఆమె గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. బిడ్డలు ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కుమారుడు పవన్‌కు నెల క్రితమే కూతురు పుట్టింది. అతని భార్య పుట్టింట్లో ఉంది. కాగా వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లిపై పవన్‌ ఒత్తిడి తీసుకువస్తున్నాడు. మంగళవారం రాత్రి తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో… ప్రియుడికి ఇచ్చేందుకు ఉంటాయి కన్న కొడుక్కు ఇవ్వలేవా అని వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో తల్లి తలపై బండరాయితో బాదాడు. దీంతో ఆమె మరణించింది. ఇంటి సమీపంలో ఉన్న మొక్కజొన్న పొలంలోకి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పడేశాడు. అనంతరం తన తల్లి కనిపించడం లేదని బంధువులకు పవన్‌ సమాచారం ఇచ్చాడు. బుధవారం ఉదయం గ్రామ వలంటీర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సీఐ జయనాయక్‌ సిబ్బందితో గ్రామానికి వెళ్లి ఇంటి పక్కన ఉన్న పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. ఇంటిని సోదా చేయగా రక్తపు మరకలు అంటిన పవన్‌ దుస్తులు లభించాయి. దీంతో పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

* డిగ్రీ పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ఓ అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సోమవారం నుంచి డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మాధవరెడ్డి అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్ష రాశారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న అబ్జర్వర్‌ పరీక్షల్లో అధిక మార్కులు వచ్చేలా చేస్తానని, మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తానని ఓ విద్యార్థినిని ప్రలోభపెట్టి ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పరీక్ష అనంతరం విద్యార్థిని విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి, కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.

*పండ్లు ఏరుకుందామని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను జీడితోటలోకి తీసుకెళ్లి ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వారి ఇంటి సమీపంలో బాలుడు (17) ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం బాలికకు మాయ మాటలు చెప్పి, గ్రామ సమీపంలోని జీడితోటలోకి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు వెళ్లి ఆ బాలుడ్ని నిలదీశారు. అనంతరం బంధువుల సూచన మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు.

*దళిత బాలికపై ఓ యువకునితో పాటు మరో తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరు నెలల గర్భిణీగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని ఓ కాలనీకి చెందిన బాలిక గర్భంతో ఉండడం గుర్తించిన స్థానికులు ఒక మహిళా పోలీసుకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 4న ఆ మహిళా పోలీసు బాలికను విచారించగా.. శివాలయం సమీపంలో కూలదోసిన కూరగాయల మార్కెట్‌ వద్ద నుంచి చెంబు అనే వ్యక్తి తనను ఆటోలో తీసుకెళ్లి మరో తొమ్మిది మందితో కలసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక చెప్పింది. దీంతో ఆ మహిళా పోలీసు బాలిక చెప్పిన వివరాలను సీఐ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ బాలికను వారి ఇంటికి పంపించేశారు. ఈ క్రమంలో బాధిత బాలికను రూరల్‌ పోలీసులు ఈ నెల 8న పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలిక గర్భంతో ఉన్న విషయం తెలిసినా తగిన చర్యలు తీసుకోకుండానే ఆమెను గుట్టుచప్పుడు కాకుండా మైలవరంలోని ఓ ప్రైవేట్‌ హోంకు తరలించారు.

*లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పిల్లర్ నెంబర్ 96 వై ఫైబర్ సర్కిల్ ఎదురుగా..కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద పడివున్న యువకుడి బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడి పక్కా స్కెచ్ తో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*రాజంపేట మండలం కిష్టమ్మ చెరువులో దూకి డిగ్రీ చదువుతున్న విద్యార్థి చలపాని రెడ్డయ్య (21) ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్వేలి మండలం మరాటిపల్లెకు చెందిన రెడ్డయ్య రాజంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకామ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మూడు రోజుల కిందట కళాశాలకు వెళ్లి వస్తానని ఇంటి వద్ద బయలుదేరి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. రెడ్డయ్య కోసం బంధువులు గాలించి కిష్టమ్మ చెరువులో చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు భోరున విలపించారు. కాగా విద్యార్థి మరణానికి ఇంకా కారణాలు తెలియరాలేదని, మృతుడు రెడ్డయ్య తండ్రి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నామని మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు.

* తనను పెళ్లి చేసుకోకుంటే తమ అక్రమ సంబంధాన్ని బయటపెడతానని ఓ గృహిణిని ఆమె ప్రియుడు బెదిరించాడు. ఆందోళన చెందిన ఆమె తన ఫేస్‌బుక్‌ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం… బాగ్‌ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్‌(32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి(32) గృహిణి. వీరిద్దరూ 2018లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమయ్యారు. చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. అతను ఆమెకు ఫోన్‌ చేసి నగ్నంగా తనకు వీడియో కాల్‌ చేయాలని కోరగా ఆమె అదే విధంగా చేసింది. నెల రోజుల నుంచి అతను ఆమెకు ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఆ వీడియో, ఫొటోలను అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె భయపడి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువురు మండలానికి చెందిన కొంగల అశోక్‌(28)కు ఫోన్‌ చేసి యశ్మకుమార్‌ను హత్య చేయాలని చెప్పింది. ఆ మేరకు అతను ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి యశ్మకుమార్‌కు ఆమె ఫోన్‌ చేసి ప్రశాంతిహిల్స్‌కు రప్పించి, విషయాన్ని అశోక్‌కు తెలిపింది. అర్ధరాత్రి సమయంలో అశోక్‌ మరో వ్యక్తి కార్తిక్‌తో కలిసి యశ్మకుమార్‌ ఉన్న చోటుకు చేరుకుని వెనుక నుంచి తలపై సుత్తితో రెండు మూడుసార్లు బలంగా కొట్టి పరారయ్యారు. ఆసుపత్రిలో చేర్పించగా 6వ తేదీ మధ్యాహ్నం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఏసీపీ పురుషోత్తంరెడ్డిల పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి సీసీ పుటేజీల సహాయంతో శ్వేతారెడ్డితో పాటు హత్యకు పాల్పడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

* వాలంటీరు ఇంట్లో నాటు తుపాకులు స్వాధీనం
ఓ వాలంటీరు ఇంట్లో ఉన్న 2 నాటు తుపాకులు, వాటి తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చింతోపు ఎస్టీ కాలనీ వాలంటీరు రవి ఇంట్లో తుపాకులు ఉన్నట్లు తెలియడంతో పోలీసులు బుధవారం అతని ఇంటిపై దాడులు చేశారు. తుపాకులు స్వాధీనం చేసుకుని నిందితుడి అరెస్టు చేసినట్లు ఎస్సై దస్తగిరి తెలిపారు. విచారణలో రవి తుపాకులు తయారు చేస్తున్నట్లు తేలిందని, మరో ఇద్దరు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

*యాదగిరిగుట్ట బస్ డిపోలో విషాదం చోటు చేసుకుంది. బస్ కింద పడి ఆర్టీసీ డ్రైవర్ మిర్యాల కిషన్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. డిపోలోని బంక్ వద్ద డీజిల్ నింపుకొని వెళ్తున్న బస్ కింద కిషన్ పడిపోయాడు. ఈ నెల చివరలో కిషన్ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారుల వేధింపుల వల్లే కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా మంజూరు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న కారు-ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.గురువారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బొలెరో కారు ట్రక్కును ఢీకొట్టింది.మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన ఇద్దరు జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మైల్‌స్టోన్ సమీపంలోని జేవార్ టోల్ ప్లాజాకు 40 కిలోమీటర్ల ముందు ఆగ్రా నుంచి నోయిడాకు వెళుతున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని పోలీసులు చెప్పారు.పోలీసులకు సమాచారం అందించిన వెంటనే లారీని స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు

*వనస్థలిపురం బ్యాంక్‌ చోరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణమని తెలుస్తోంది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానని మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు. బెట్టింగ్‌లో వస్తే తిరిగి ఇస్తానని.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు. రెండు రోజుల క్రితం బ్యాంకులో ఉన్న 22 లక్షల 53,378 రూపాయలతో క్యాషియర్ ప్రవీణ్ పరారయ్యాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.

*అప్పుల బాధతో మిర్చి రైతు కరుణాకర్(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందు తాగిన కరుణాకర్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం రైతు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

*సూర్యాపేట: జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్‌పాడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు (Murder). తుమ్మల పెన్‌పాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్, సంతు, రాజశేఖర్‌ తండ్రి కొడుకులు. శ్రీను గౌడ్‌కు వ్యవసాయ భూమి. దానిని తమకు పంచివ్వాలని గత కొంత కాలంగా కొడుకులిద్దరు తండ్రితో గొడవపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రిపై గొడ్డలి, కత్తితో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై వెంకటశివకుమార్‌ సర్వీసు రివాల్వర్‌,బుల్లెట్ల పౌచ్‌ అదృశ్యమయ్యాయి. అందుకు స్టేషనులో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ నిర్లక్ష్యమే కారణమని ఎస్సై పేర్కొంటుండగా, తనకేం సంబంధంలేదని హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. డీఎస్పీ గంగయ్య, కుప్పం గ్రామీణ సీఐ సూర్యమోహనరావు రామకుప్పం స్టేషనుకు వచ్చి ఎస్సై , హెడ్‌కానిస్టేబుళ్లను రివాల్వర్‌, బుల్లెట్ల అదృశ్యంపై బుధవారం మధ్యాహ్నం ఆరా తీశారు. వారు చెప్పిన విషయాలను ఎస్పీకి నివేదించినట్టు సమాచారం. వారంలోపు వాటి ఆచూకీ కనిపెట్టాలని ఉన్నతాధికారులు ఎస్సైకి గడువు ఇచ్చినట్టు తెలిసింది…!!

*నాటు తుపాకులు కలకలం రేపాయి. నాటు తుపాకుల్ని తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు గ్రామ వాలంటీర్ రవి. చింతతోపు ఎస్టీ కాలనీలో రవి వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిందితుడి నివాసంలో నాటు తుపాకుల తయారీకి ఉపయోగించే పరికరాలు, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతను యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకులను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

*అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం అల్వాల్‌లోని సురేందర్‌ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.31 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. రూ.43.79 లక్షల విలువచేసే నాలుగు ఓపెన్‌ ప్లాట్ల పత్రాలను, రూ.8.11 లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును సీజ్‌ చేశారు.

*సత్య సాయి: జిల్లాలోని పెనుగొండ మండలం గుట్టురులో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమందేపల్లి మండలం వెలగ మేకల పల్లి క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెనుకొండ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది ముఠా సభ్యులులో గ్రామ వాలంటీర్ లక్ష్మీనారాయణ A1 ముద్దాయిగా ఉన్నాడు

*గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడిగా కత్తెర సురేష్ ఉన్నారు.FCRA నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడంపై కేసు నమోదైంది. పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌కి బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.