Movies

రెండో పెళ్ళి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

రెండో పెళ్ళి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్ళి చేసుకున్నారు.. కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో ఆయన రెండో వివాహం జరిగింది.. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్ళి చేసుకున్నారు.. కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో ఆయన రెండో వివాహం జరిగింది.. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాహానికి గాయకుడు క్రిష్, నటి సంగీత , సీనియర్ నటి కుట్టి పద్మిని హాజరయ్యారు. కాగా 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు ఇమ్మాన్… 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌‌లో విడాకులు తీసుకున్నారు. వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కోలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇమ్మాన్ ఒకరు.