Politics

2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయం – TNI రాజకీయ వార్తలు

2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయం  – TNI రాజకీయ వార్తలు

* 2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను సీఎం కేసీఆర్‌ పరామర్శించ లేదని తప్పుబట్టారు. కానీ.. పంజాబ్ రైతులకు నగదు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు లూటీ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

*ఎమ్మెల్సీ ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి: prattipati pullarao
వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గడపగడపకు ప్రభుత్వంకు ఎక్కడా స్పందన లేదన్నారు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు ప్రజలలో అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు

*ఎమ్మెల్సీ ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి: prattipati pullarao
వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గడపగడపకు ప్రభుత్వంకు ఎక్కడా స్పందన లేదన్నారు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు ప్రజలలో అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు

* జగన్ లండన్ వెళ్లింది.. ఖచ్చితంగా అందుకే : యనమల
అనుమతివ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా…లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేదన్నారు. సీబీఐ కోర్టు అనుమతి…. దావోస్ సమావేశంలో చూపించటం రాష్ట్రానికి అప్రదిష్ట కాదా అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై తెదేపా సీనియర్ నేత, శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ దావోస్కు వెళ్లడానికి మాత్రమే సీబీఐ కోర్టు అనుమతి ఉందా..? లండన్ వెళ్లేందుకూ అనుమతించిందా..? అన్నదానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లండన్ వెళ్లేందుకు సైతం అనుమతిస్తే.. అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదో చెప్పాలని నిలదీశారు. షెడ్యూల్లో లేని లండన్లో ఎందుకు ల్యాండ్ అయ్యారో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఒకవేళ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళ్తే… అది కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు.రాష్ట్ర బృందం మొత్తం ఒకే విమానంలో వెళ్లకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వెళ్లడాన్ని యనమల తప్పుబట్టారు. అధికారులను వదిలేసి భార్య, మరొకరితో మాత్రమే సీఎం ప్రత్యేకంగా వెళ్లడం లోగుట్టు ఏమిటని నిలదీశారు. సొంత, రహస్య పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..? అని ప్రశ్నించారు. దావోస్కు అధికార యంత్రాగానిది ఒక దారి… సీఎం దంపతులది మరో దారా..? అని అడిగారు. స్పెషల్ ఫ్లైట్కు ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్కు మరో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై ఇది అదనపు భారం కాదా..? అని నిలదీశారు.ఇలా కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా గతంలో వచ్చిందా యనమల దుయ్యబట్టారు. ఇది రాష్ట్రానికి అప్రదిష్ట కాదా..? అని ప్రశ్నించారు. 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం… రాష్ట్రం కోసమా, అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా… అని యనమల నిలదీశారు. అధికారులను వదిలేసి సీఎం, ఆయన భార్య వెళ్లడం వెనుక లోగుట్టు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందన్న ఆయన.. జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

*బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం : కవిత
నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. అవసరం అయితే దేవుణ్ణి కూడా ప్రజలు ప్రశ్నిస్తారన్నారు. దేవుడి కంటే భక్తుడే గొప్ప అని.. నాయకుడి కంటే ప్రజలే గొప్ప అని కవిత పేర్కొన్నారు. రాజకీయం మొత్తం దేవుడి చుట్టే తిప్పితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంట్లో దేవుణ్ణి ఎగ్జిబిషన్ లాగా బయట పెట్టబోమన్నారు. దేవుడి పేరు చెప్పి భయపెడితే భయపడబోమన్నారు.

*బీజేపీ, ఆరెస్సెస్‌ల దృష్టిలో భారత్ ఓ బంగారు బాతు : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో జరిగిన Ideas for India సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇతరులు చెప్పే మాటలను వినే దృక్పథాన్ని మోదీ అలవరచుకోవాలని హితవు పలికారు. భారత దేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ ఓ బంగారు బాతుగా భావిస్తున్నాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మాట్లాడే అవకాశం లేని దేశంగా భారత దేశం తయారుకాబోదని చెప్పారు. మోదీ వైఖరి మారాలని చెప్పారు. ‘‘నేను వింటాను’’ అనే ధోరణిని ఆయన అలవరచుకోవాలని, అక్కడి నుంచే అన్నీ వస్తాయని అన్నారు. కానీ మన ప్రధాన మంత్రి ఎవరి మాట వినరన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వని దేశం ఉండదన్నారు. స్వేచ్ఛగా మాట్లాడలేని పీఎంఓ (ప్రధాన మంత్రి కార్యాలయం -PMO) ఉండదన్నారు. బీజేపీ (BJP), ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-RSS)లపై విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య చర్చలు జరిగి, అభిప్రాయాలు పంచుకుని, తద్వారా నిర్ణయాలు తీసుకునే దేశం భారత దేశమని మనం విశ్వసిస్తామన్నారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం భారత దేశమంటే ఓ భౌగోళిక ప్రాంతంగా, ఓ బంగారు బాతుగా భావిస్తున్నాయని, దాని ఫలాలు కర్మ ప్రకారం కేవలం కొద్ది మందికి మాత్రమే అందాలని కోరుకుంటున్నాయని అన్నారు. దళితుడికైనా, బ్రాహ్మణుడికైనా అందరికీ సమానంగా అందాలని తాము విశ్వసిస్తామని తెలిపారు. బహుళ వర్గాల పరస్పర సామరస్య పరిస్థితికి భారత దేశం మళ్ళీ రావాలా? అని అడిగినపుడు రాహుల్ మాట్లాడుతూ, ‘‘మీరు ఉన్న పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా, వాస్తవాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. పరిస్థితిని చూడండి. మీ దేశం, దాని అవసరాలు, సౌభాగ్యం, సంభాషణలను పరిగణనలోకి తీసుకోవాలి; ఆ మౌలికాంశాల మార్గదర్శకత్వంలో పని చేయాలి’’ అని చెప్పారు. భారతీయ ప్రజాస్వామ్యం ఈ భూ మండలానికి ప్రధాన తెడ్డు వంటిదని చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజా శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ఇది ఈ భూమండలానికి ప్రధాన తెడ్డువంటిదన్నారు. ప్రమాణాలకు తగినట్లుగా ప్రజాస్వామ్యాన్ని నిర్వహించినది మనం మాత్రమేనని చెప్పారు. దానికి పగుళ్ళు వస్తే, ఈ భూ మండలానికి సమస్య తలెత్తుతుందన్నారు. ఆ విషయాన్ని అమెరికా గ్రహిస్తోందన్నారు.

*Jagan మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు: మంత్రి Roja
జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ పదవుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారని, అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు వైఎస్సార్, జగన్ లాగా సంక్షేమ పథకాలు తెచ్చారా? అని ప్రశ్నించారు. సీనియర్ సీఎంల కంటే ఫస్ట్ టైం సీఎం జగన్ ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు.

*కేంద్రం చేతిలో Jagan కీలుబొమ్మ: CPI జాతీయ కార్యదర్శి నారాయణ
కేంద్రం చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వినకపోతే జగన్ రెడ్డికి జైలు జీవితం తప్పదన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోదీకి దత్త పుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆర్భాటంగా తిరిగిన జగన్ ప్రస్తుతం మీసాలు దించుకొని తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు.

*ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సీపీఐ నేత కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్కకావిష్కరణ సదస్సులో పలువురు ప్రముఖులు, రైతు, కార్మిక,అఖిల పక్షాల నాయకులు మాట్లాడారు. ‘పోలవరం ఎన్నటికి సాకారమయ్యెను’ పుస్తక రచయిత టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని అనుమతులు పొందిన జాతీయ బహుళార్ధ ప్రాజెక్ట్ పోలవరం‌పై నెలకొన్న అనిశ్చితికి కారణాలు,ఇతర అంశాలను పుస్తకంలో ప్రస్తావించానన్నారు. ప్రాజెక్టు పూర్తయితే విశాఖకు తాగునీరు, కర్మాగారాలకు, వ్యవసాయ అవసరాలకు నీరు ఇవ్వొచ్చన్నారు. మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిస్తే.. ప్రాజెక్ట్ పూర్తి కావడం ఆలస్యమవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం పోలవరం ఎత్తులో 41.1 మీటరు ఎత్తు వరకే నీటిని నిలబెడతామంటున్నారని..ఫలితంగా ప్రాజెక్ట్‌తో వచ్చే ప్రయోజనాలన్నీనిరూపయోగ మేనన్నారు. పుస్తక ఆవిష్కర్త వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో కేంద్ర జలవనరుల శాఖ ఉందన్నారు. పెరుగుతున్న ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రమే భరించాలన్నారు. కేంద్రం జాతీయ రహదారుల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది కానీ వ్యవసాయానికి నిధులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం దిశగా మోడీ ప్రభుత్వం తీసుకువెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఆ స్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. అనంతరం దాసరి బలవర్ధన్ రావు మాట్లాడారు.

*గడప గడపకు ప్రభుత్వం పేరుతో మరో మోసం: Sailajanth
గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… బస్సుయాత్ర ద్వారా ప్రజలకు ఏం అభివృద్ధి చేసారని చెబుతారని ప్రశ్నించారు. దావోస్ సదస్సు పేరుతో ప్రజాధనం వృధా అంటూ మండిపడ్డారు. దావోస్ పర్యటన అని చెప్పి లండన్ పర్యటన ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం, ధగా చేస్తోందని విమర్శించారు. పేరుకు పదవులు ఇచ్చి, వారికి పవర్ లేకుండా రబ్బరు స్టాంపులుగా మార్చిందని అన్నారు. దావోస్‌కని చెప్పి లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పర్యటన వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్వంత విహారయాత్రల కోసం వెళుతూ ప్రజా ధనాన్ని జగన్ రెడ్డి వృధా చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఎమ్మెల్సీ ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి
వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గడపగడపకు ప్రభుత్వంకు ఎక్కడా స్పందన లేదన్నారు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు ప్రజలలో అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

*దేశానికే తెలంగాణ రోల్‌మోడ‌ల్‌: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడ‌ల్‌గా మారింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యూకేలో పర్యట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న‌ లండన్‌లోని హై కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన సమావేశంలో భారత్, బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

*రాజీవ్‌ వల్లే ఐటీలో దేశం ముందుంది: వీహెచ్‌
ప్రస్తుతం ఐటీలో భారతదేశం.. ప్రపంచంలోనే ముందుందంటే దానికి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్‌ ఆశయాలతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ధాన్యం సేకరణలో తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోపిడీ చేస్తున్నారంటూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. బాధ్యులైన అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు.. నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

*KCRకు పాలన చేతకాకే పక్క రాష్ట్రాలకు: BJP Leader ఈటెల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక ఇతర రాష్ర్టాలలో పర్యటిస్తున్నారని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు సరిగా రావడం లేదని, పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం అప్పులమయం కావడంతో ఆ భారాన్ని ప్రజలమీద మోపుతున్నారని విమర్శించారు. భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు, లిక్కర్ మీద, కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచి, సంవత్సరానికి రూ. 25 వేల కోట్ల భారం ప్రజల మీద వేశారని తెలిపారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాల్లో దేశంలో చక్కర్లు కొట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

*Telangana రైతులను పంజాబ్ CM ఆదుకుంటారా?: దాసోజు శ్రవణ్పం
జాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే.. మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయల్లో స్థానం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 194 జీవో ప్రకారం.. కేవలం వెయ్యి మందికి మాత్రమే చెల్లించి, మిగతా 7 వేల మంది కుటుంబాల్లో మన్ను కొట్టారని విమర్శించారు. వడ్ల కొనుగోలు ప్రారంభమై 45 రోజులయితే, ఇంకా 40 శాతం కూడా కొనలేదని చెప్పారు. రైతు భీమా రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 2020 వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నెల రోజులు పాటు తమ పార్టీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

*అధిక ధరలపై వామపక్షాల ఉద్యమం : రామకృష్ణ
నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 30న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట తలపెట్టిన ధర్నాలు విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నాయకులు ఎంఏ గఫూర్‌ ఇతర వామపక్ష పార్టీల నేతలు ఈ నెల 30న జరిగే ధర్నాల గోడపత్రికను ఆవిష్కరించారు.

*మీటర్లు పెడితే పగులగొడతాం: నారాయణ
‘‘సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ తలూపుతూ ప్రజా ద్రోహం, దేశ ద్రోహమే కాదు పితృ ద్రోహానికి కూడా పాల్పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పోర్టులన్నింటినీ అదానీకి కట్టబెడితే… జగన్మోహన్‌రెడ్డి తానతందాన అంటూ వంతపాడుతున్నాడు. కేంద్రం ఆదేశాలకు తలొగ్గి వ్యవసాయానికి ఉచిత కరెంటు విషయంలో రైతులకు ద్రోహం చేస్తున్నాడు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. గుంతకల్లులోని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కోట్లు ఖర్చుచేసి వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించడం వెనుక పెద్ద ఎత్తుగడ ఉంది. మీటర్లను బిగిస్తే వాటిని మా పార్టీ ధ్వంసం చేస్తుంది

*చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి : పెద్దిరెడ్డి
‘‘టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024లో జరిగే సాధారణ ఎన్నికలే చివరి ఎన్నికలు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలు ఆయన్ను హైదరాబాద్‌కే పరిమితం చేయనున్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరో మంత్రి ఉష శ్రీచరణ్‌తో కలిసి అనంతపురంలో నిర్వహించిన నీటి పారుదల సలహామండలి సమావేశంలో పెద్దిరెడ్డి శుక్రవారం మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు బిగిస్తున్న విద్యుత్‌ మీటర్లు చంద్రబాబుకు, ప్రతిపక్ష నాయకులకు ఉరితాళ్లు అవుతాయి. ప్రతిపక్షాలు విద్యుత్‌ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని మంత్రి అన్నారు.

*వైసీపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు: కొల్లు
‘‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారు. టీడీపీ గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న మహానాడు ఒంగోలులో జరగడం సంతోషంగా ఉంది. సుమారు 2 లక్షల మంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ మహానాడు పనులను జిల్లా ముఖ్య నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

*జగన్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైసీపీ పాలకులను తరిమితరిమికొట్టడం కూడా ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు, 55 మంది సీనియర్‌ నాయకులను వేధించడంతో పాటు పలు రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారని లోకేష్ తెలిపారు.

*కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడతారా: చంద్రబాబు
టీడీపీ (TDP) కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడతారా అని ఈ పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా విధ్వంసమే.. అన్ని ప్రాజెక్టులు పోయాయని తెలిపారు. ‘క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలతో ప్రజాఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యంగా ముందుకుపోయి ఏపీని కాపాడుకోవాలన్నారు. లేకుంటే శ్రీలంకలా ఏపీ మారే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.

*జగన్‌ సర్కార్‌పై జనాగ్రహం: రఘురామ
జగన్‌ సర్కార్‌పై జనాగ్రహం తీవ్రంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు పెడతామంటే ఎవరూ భయపడరన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ-క్రాప్‌ అవకతవకలను ఎత్తిచూపిన వారిపై కేసులు పెడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు. రైతుల వద్ద నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేయరాదు. అయినా కొనుగోలు చేస్తున్నారు. దీనికి ఎవరిపై కేసు పెడతారు? ముఖ్యమంత్రి పైనా? వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రుల పైనా?’’ అని ప్రశ్నించారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలను కక్షసాధింపు ధోరణితో వేధిస్తున్న తీరు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? దావోస్‌ సదస్సులో ఎవరైనా ప్రశ్నిస్తే జగన్‌ ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.

*అంబటివి బడాయి మాటలు: బుద్దా
‘‘మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుంది. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు’’ అని టీడీపీ నేత బుద్దా వెంక న్న విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో మంత్రికి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘పోలవరం నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్‌రెడ్డి మూడేళ్ల పాటు ఏం పీకాడు? ఒక్క పిల్ల కాలువ కూడా కట్టని మీ అధినేత, నువ్వు పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది. కుర్చీ కోసం దిగజారే నైజం జగన్‌రెడ్డిది. సీఎంను చేయాలని సోనియా, రాహుల్‌ కాళ్లపై పడిన విషయం మరిచిపోయారా? కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లపై పడిన ఘటన గుర్తు లేదా? అమ్మను, చెల్లిని రాజకీయం కోసం వాడుకుని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్‌ పొలిటీషియన్‌ జగన్‌రెడ్డే. జగన్‌రెడ్డి సింగిల్‌గా వస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు… కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడని నీకు త్వరలోనే అర్థమవుతుంది’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.