NRI-NRT

వర్జీనియాలో వేడుకగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

వర్జీనియాలో వేడుకగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

వర్జీనియాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావు ఉయ్యూరు శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాల ఎగ్జిబిషన్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ తెదేపా సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మన్నవ సుబ్బారావు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
Whats-App-Image-2022-05-30-at-9-04-38-AM-1
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేయడమే నందమూరి తారక రామారావుకి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్ వర్జీనియాలో స్టెర్లింగ్లో జరిగిన అన్నగారి శతజయంతి ఉత్సవాలలో అన్నారు.తెలుగు జాతి విఖ్యాతి ప్రపంచానికి యన్టీఆర్ చాటిచెప్పితే,నేటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా విధానంలో తెలుగు మాధ్యమాన్ని తీసివేయడమేకాకుండా కళాశాలు,విశ్వవిద్యాలయాల్లో చరిత్ర భోధనకు మంగళం పాడిందని,యన్టీఆర్ చారిత్రక సినిమాలు తీసి భావి తరాలకు తెలుగువారి మహోన్నతను తెలిపి గొప్ప చరత్రకు వారసులు మీరు అని తెలియజేయడమే కాకుండా,హైదరాబాద్ ట్యాంకు బండ్ పై తెలుగు వెలుగుల విగ్రహాలు నెలకొల్పి,తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా భాషా,చరిత్రల పరిశోధనలకు నాంది పలికారని ఆయన అన్నారు.
Whats-App-Image-2022-05-30-at-9-04-38-AM
తెలుగు జాతి ఉనికికే ప్రమాద పరిస్దితులు నేటి పాలకులు కల్పించడం శోచనీయమని అన్నారు.తెలుగుభాష పరిరక్షణకు యన్టీఆర్ అందించిన స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.అమెరికాలోని తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు భాషా,సంస్కృతులను తెలియజెప్పడానికి చేస్తున్న కృషి యావత్తు జాతికే ఆదర్శప్రాయమని ప్రశంసించారు. తెలుగువారిని ఆత్మాభిమానధనులుగా రూపుదాల్చడానికి యన్టీఆర్ ఆత్మ ప్రతి ఒక్కరిలో ప్రవేశించాలని ఆయన అన్నారు.యు.యస్.యన్టీఆర్ ఫ్యాన్స్ ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.శ్రీమూల్పూరి వెంకట్రావు,శ్రీ ఉయ్యూరు శ్రీనివాస్ లను ఆయన అభినందించారు.
Whats-App-Image-2022-05-30-at-9-03-29-AM
మాజీ మంత్రి,శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగిస్తూ యన్టీ ఆర్ కారణ జన్ముడు,మానవతామూర్తి అన్నారు.తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంత్రిని చేసి,రెండు రూపాయలకు కిలో బియ్యం పధకాన్ని అమలుచేసే బాధ్యతని అప్పగించారని,పేదవారి బతుకుల్లో వెలుగులు నింపాలని తపన పడేవారన్నారు.
ప్రముఖ కవి శ్రీజొన్నావిత్తుల రామలింగేశ్వరరావు యన్టీఆర్ నటనాకౌశల్లాన్ని విశ్లేషించారు.నటనలో ఆయనకు ఆయనే సాటి అన్నారు.శతజయంతిని పురస్కరించుకుని ఆయన రచించిన గీతం ప్రేక్షకులను రంజింపచేసింది.
మాజీ నాటక అకాడమి అధ్యక్షులు శ్రీగుమ్మడి గోపాలకృష్ణ,శ్రీమన్నవ సుబ్బారావు,యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మాన్ శ్రీ సందీప్ రెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.శ్రీ ఉయ్యూరు శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Whats-App-Image-2022-05-30-at-9-05-11-AM
parse geojson