Movies

అందులో పూజా ఐటెమ్‌ గాళ్‌ కాదట!

అందులో పూజా ఐటెమ్‌ గాళ్‌ కాదట!

రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’ ‘ఆచార్య’ చిత్రాలు నిరాశ పరచినా ‘ఎఫ్‌3’ విజయవంతం కావడంతో కాస్త రిలాక్స్‌ అవుతోంది పూజాహెగ్డే . ‘సమ్మర్‌ సోగ్గాళ్లు’గా ఇటీవల విడుదలైన ‘ఎఫ్‌3’(F3)లో పూజా ఓ ప్రత్యేక గీతంలో నటించి అలరించారు. ‘జిగేల్‌ రాణి’ తర్వాత ఆ పాట ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జనగనమన’ చిత్రంలో పూజా హెగ్డే కూడా ఉందని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో పూజా హీరోయిన్‌ కాదని, ఐటమ్‌ సాంగ్‌కే పరిమితం అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇందులో ఏమాత్రం నిజం లేదని పూజా పీఆర్‌ టీమ్‌ స్పష్టం చేసింది. ‘‘జనగణమనలో.. పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయడం లేదు. పూర్తిస్థాయి పాత్రలోనే కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ముంబైలో ‘జనగణమన’ షూటింగ్‌ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో పూజాహెగ్డే పాల్గొంటారు. విజయ్‌–పూజాలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు’’ అని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు. హిందీలో ‘సర్కస్‌’, ‘కభీ ఈద్‌ కభీ దీవాలీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.