Politics

నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా? – TNI రాజకీయ వార్తలు

నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా?   – TNI రాజకీయ వార్తలు

* పోలవరం నిర్వాసితులకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వాటిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మరి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఇంకా ఏమన్నారంటే..‘‘2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ కేంద్రానికి చెప్పారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదు. ఆ నిధులేమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రకటనను జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదు. కేసీఆర్ నుంచి నిధులు వచ్చినందునే ఏమీ చెప్పట్లేదు. సీఎఫ్ఎంఎస్ నుంచి ఆఫ్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. వాటిపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం. రూ.లక్ష కోట్ల బిల్లులు చెల్లిస్తే.. రూ.20 వేల కోట్లు సజ్జల కాజేశారు. పోలవరం డ్యామ్‌ను పోలవరం బ్యారేజీగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆరోపించారు

*Modi పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు: Narayana
మోదీ పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో బ్లాక్ మనీ కాస్త వైట్‌గా మార్చేసుకున్నారన్నారు. మోదీ విధానాలతో డ్రగ్ మాఫియా ఆగిందా?.. సర్జికల్ స్ట్రైక్‌తో దేశంలో ఉగ్రవాదం తగ్గిందా? అని ప్రశ్నించారు. జాతికి మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. బొగ్గు ఉత్పత్తి కావాలనే మోదీ ప్రభుత్వం తగ్గించిందని, అదానికి మేలు చేసేందుకు ఈ చర్య చేపట్టిందని ఆరోపించారు. ఆదానికి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు.14 మంది ప్రధానులు కలిసి రూ. 40 లక్షల కోట్ల అప్పు చేస్తే… మోదీ ఒక్కరే రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారని నారాయణ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. హడావిడిగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి లోపల ఎం చేశారో ఎవరికీ తెలియదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, నిధులు ఏమి అడగలేదన్నారు. జగన్‌ను నమ్మి రాష్ట్ర ప్రజలు 22 లోక్ సభ సీట్లు ఇస్తే ఎం సాధించారని ప్రశ్నించారు. హోదాపై ప్రగల్బాలు పలికిన జగన్ ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీకని, ఢిల్లీ నాయకులను ఎదిరించి నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. జగన్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ దావోస్ పర్యటనలో ఒక్క కొత్త కంపెనీ రాలేదని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో పెట్టుబడిదారులంతా వెళ్లిపోయారని నారాయణ అన్నారు

*పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు కళకళ: మంత్రి Errabelli
పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లలుకళకళలాడుతున్నాయని, ఎక్కడ చూసినా శుచి, శుభ్రతతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆదివారం జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో రాష్ట్రం ఇప్పటికే పురోగతి సాధించిందన్నారు.ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెల్లో ఎన్నో కార్యక్రమాలను తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రు ఇద్దరూ గ్రామంలో పాదయాత్ర చేసి, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, సెగ్రీ గేషన్ యార్డు, గ్రామ పంచాయతీ పార్క్ ను సందర్శించి,,గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు.మన ఊరు బడి పథకం లో భాగంగా కోటి ముప్పై లక్షలతో స్కూల్ అభివృద్ధి పనులకు, శంకుస్థాపన చేసి, క్రిడా ప్రాంగణాన్ని మంత్రులు ప్రారంభించారు. ఏపూర్ గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, Zp చైర్ పర్సన్ దీపిక, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, Zp వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు.

*ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది అధిస్ఠానం నిర్ణయిస్తుంది:పురందేశ్వరి
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్లే పెట్టుబడులు రాక యువతకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు.విజయవాడలోని భాజపా కార్యాలయంలో పార్టీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పురందేశ్వరి మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.ఏపీలో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు. రాష్ట్రానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు.

*జల్లయ్యను ఎమ్మెల్యే కిరాతకంగా చంపించారు: GV Anjaneyulu
బీసీ నేత జల్లయ్య)ను ఎమ్మెల్యే పిన్నెల్లి కిరాతకంగా చంపించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యాదవులు అంటే పిన్నెల్లికి ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు. బీసీలు బ్రతకడం వైసీపీకి ఇష్టం లేదా..? అని అన్నారు. నలుగురు బీసీలకు పదవులు ఇచ్చి 40 మంది బీసీలను చంపడం సామాజిక న్యాయమా? అని నిలదీశారు. జగన్ రెడ్డి అమరావతిని స్మశానం చేస్తే పిన్నెల్లి పల్నాడును వల్లకాడు చేశారన్నారు. పల్నాడులో బీసీ, ఎస్సీ, ముస్లింలు బ్రతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. హత్య రాజకీయాలకు పాల్పడే వైసీపీ నేతలు, వారికి వత్కాసు పలికే పోలీసులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జి.వి.ఆంజనేయులు అన్నారు

*పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దే: పురంధేశ్వరి
పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దేనని ఆ పార్టీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని పురంధేశ్వరి ప్రకటించారు. ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఈ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ముగింపు ప్రసంగం చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ఇప్పటికే స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌… తాజాగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది… బీజేపీతో కలిసి ప్రభుత్వ స్థాపన. రెండు… బీజేపీ, టీడీపీలతో కలిసి అధికారంలోకి రావడం. మూడు… జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం’’ అని పవన్‌ పేర్కొన్నారు

*మోదీ, అమిత్ శాలకు పవన్ కళ్యాణ్ వేదవ వేషాలు తెలుసు: వెల్లంపల్లి
నరేంద్ర మోదీ, అమిత్ షాలకు పవన్ కళ్యాణ్ వెదవ వేషాలు తెలుసు అని విమర్శలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బీజేపీ వాళ్లు పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడంలేదు.పవన్ మాత్రం బీజేపీ భజన చేస్తున్నాడని చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ బీజేపీతో టచ్‌లో ఉన్నాడని మండిపడ్డారు.బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్కరోజైనా పని చేశారా ? అని నిలదీశారు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్‌మెంట్‌ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి.పవన్ కళ్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదని ఎద్దేవా చేశారు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనకి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం చిరంజీవిని అవమానించటమే అని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్‌ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాడు మెగాస్టార్‌ లేనిదే పవర్‌స్టార్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. చిరంజీవి లేకుండా పవన్‌ కళ్యాణ్ ఎవరికి తెలుసు? అని అన్నారు.

*ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి: Laxmi parvathi
ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీకి సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరని పేర్కొన్నారు. టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక.. మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారని, లోకేష్ వచ్చాక పార్టీలో సంస్కారం లోపించిందని విమర్శించారు. మహానాడుకు యాభై వేల మంది హాజరయితే .. తమ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు లక్షల మంది జనం వస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

*పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇప్పటికైనా నోరు విప్పాలి: Ramakrishn
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు విప్పి, ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్, రాష్ట్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమైందన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి ఏ ఏ అంశాలపై చర్చించారో ప్రజలకు వివరించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస ప్యాకేజీ తదితరాలు సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయడంలేదో స్పష్టం చేయాలని రామకృాష్ణ డిమాండ్ చేశారు.

*దేవరకద్ర‌ను మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి KTR
మహబూబ్‌నగర్: జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం దేవరకద్ర‌ను మున్సిపాలిటీగా మారుస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తకోట, దేవరకద్ర‌లలో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. పల్లెటూర్లకు అపార్ట్‌మెంట్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే తమ పార్టీ ధ్యేయమన్నారు. ప్రతిపక్షాలు సైంధవ పాత్ర పోషిస్తున్నాయని KTR ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం జాతీయ హోదా ఇస్తామని మోసగించిందన్నారు. కృష్ణానదిలో తమకున్న 575 టీఎంసీల నీటివాటా ఇవ్వటంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన సెస్సు వాటా ఇవ్వకపోగా.. రూ. 2 లక్షల కోట్లను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని..ఇందులో నిజం లేక‌పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించాడు.

*మంత్రి అమర్‌ ప్రకటన బాధ్యతారాహిత్యం:సీపీఎం
బ్రాండిక్స్‌ పరిశ్రమలో ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి ‘బాధితులకు వైద్యం అందిస్తే సరిపోదా?…నష్టపరిహారం ఎందుకివ్వాలి?’ అని వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యరాహిత్యానికి నిదర్శనమన్నారు.

*సెజ్‌ సంఘటన ప్రభుత్వ వైఫల్యమే: వంగలపూడి అనిత
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన విష వాయువు సంఘటన ప్రభుత్వ వైఫల్యమేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విష వాయువు కారణంగా అస్వస్థతకు గురై ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె శనివారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాలిమర్స్‌ విషయంలోనే పటిష్ఠమైన చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కావన్నారు.

*సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చే నాయకుడు పవన్: Nagababu
సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఉందన్నారు. గతంతో పోలిస్తే ఉత్తరాంధ్ర కార్యకర్తలు చాలా మోటివేట్ అయ్యారని, పనిచేయని నాయకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. మంగళగిరిలో నాగబాబు మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికుల పోరాట‌ ప్రతిమ అమోఘమన్నారు. వైజాగ్ రుషికొండ వ్యూ చాలా‌ అద్భుతమైందని, దాన్ని కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన కార్యకర్తలేనని గుర్తు చేశారు. వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా తయారైందని, అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడని ఆరోపించారు. స్వార్ధం, కన్నింగ్ మైండ్, లంచగొండి తనం లేని వ్యక్తి పవన్ కల్యాణ్, పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చని చెప్పారు.

*సొంత నిధులతో ఫౌంటెన్ ఏర్పాటు చేస్తాం: tg venkatesh
ఎంతో చరిత్ర కలిగిన కొండారెడ్డి బురుజు ఆధునిక హంగులకు ఎన్ని నిధులైన సమకూరుస్తామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కొండారెడ్డి బురుజు చుట్టూ తిరిగేందుకు వీలుగా రోడ్ నిర్మాణం కోసం చుట్టూ ఉన్న షాపుల యజమానులతో మాట్లాడి నష్టపరిహారం ఇస్తామన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సూచించారు. కర్నూలు మేయర్ రామయ్య కోరిక మేరకు రాజ్ విహార్ సెంటర్‌లో సొంత నిధులతో ఫౌంటెన్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

*ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరూ సరిగా పనిచేయడం లేదు: Vidadala Rajini
ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది తీరుపై మంత్రి విడదల రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరూ సరిగా పనిచేయడం లేదన్నారు. జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ మాటను డాక్టర్స్‌ వినడం లేదని తెలిపారు. వైద్య సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. త్వరలో ఎమ్మెల్యేలందరితో సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పీహెచ్‌సీల పనితీరు మెరుగుపడాలని విడదల రజినీ పేర్కొన్నారు

*పోలవరంపై జగన్‌ నోరు విప్పాలి: రామకృష్ణ
‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్‌ ఇప్పటికైనా నోరు విప్పాలి. నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయన్నారు. రివర్స్‌ టెండరింగ్‌, రాష్ట్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమైందన్నారు. ఇటీవల జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి ఏఏ అంశాలపై చర్చించారో ప్రజలకు వివరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస ప్యాకేజీ తదితరాలు సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయడంలేదని రామకృష్ణ నిలదీశారు.

*సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చే నాయకుడు పవన్: Nagababu
సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఉందన్నారు. గతంతో పోలిస్తే ఉత్తరాంధ్ర కార్యకర్తలు చాలా మోటివేట్ అయ్యారని, పనిచేయని నాయకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. మంగళగిరిలో నాగబాబు మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికుల పోరాట‌ ప్రతిమ అమోఘమన్నారు. వైజాగ్ రుషికొండ వ్యూ చాలా‌ అద్భుతమైందని, దాన్ని కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన కార్యకర్తలేనని గుర్తు చేశారు. వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా తయారైందని, అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడని ఆరోపించారు. స్వార్ధం, కన్నింగ్ మైండ్, లంచగొండి తనం లేని వ్యక్తి పవన్ కల్యాణ్, పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చని చెప్పారు.

*టీడీపీతో పొత్తుపై స్పష్టతనిచ్చిన పవన్‌కల్యాణ్‌
టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ‘‘ఆప్షన్‌1: జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 2: జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 3: జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం’’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్ని సార్లు నేనే తగ్గాను.. ఇప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం తగ్గితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో చంద్రబాబుకు స్పష్టత లేదని.. ఆయనకు స్పష్టత వచ్చాక మాట్లాడుకుంటామని’’ పవన్‌కల్యాణ్‌ అన్నారు.